అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కొందరు అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదంగా మారింది.. ఆ ఫ్లెక్సీ పై వివాదాస్పద వ్యాఖ్యలు ముద్రించిన ఘటన నేపథ్యంలో పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు..
అక్కడ కూటమిలో కుంపట్లు రగులుకుంటున్నాయా? నా నియోజకవర్గంలో మీ పెత్తనం ఏంటని తెలుగుదేశం నాయకుల మీద జనసేన ఎమ్మెల్యే ఫైరై పోతున్నారా? అక్కడి టీడీపీ లీడర్స్ పరిస్థితి కూడా తేలుకుట్టిన దొంగల్లా అయిపోయిందా? ఏదా అసెంబ్లీ నియోజకవర్గం? ఏ విషయంలో తేడా కొట్టింది రెండు పార్టీల మధ్య? కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య గ్యాప్ పెరుగుతోందా? అంటే…. వాతావరణం పూర్తిగా అలాగే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ…
Off The Record: ఆ బంగారం మంచిదే... కానీ, చుట్టూ ఉన్న మకిలిని మాత్రం వదిలించుకోలేకపోతోందట. కఠిన నిర్ణయం తీసుకోలేని తత్వంతో మంచివాడని పేరున్న ఎమ్మెల్యే కూడా బద్నాం అవుతున్నారట. చుట్టూ చేరిన మట్టి మాఫియా కబంధహస్తాల్లో కీలుబొమ్మగా మారాడని అంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఎందుకొచ్చిన రాజకీయాలు రా.. దేవుడా.. అని ఆయన తల పట్టుకుంటున్నారన్నది నిజమేనా?.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఊడిమూడి శివారు చింతావారి పేట సమీపంలో పంటకాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. భర్త ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.
ఇవాళ చోడవరం, పి.గన్నవరం, పొన్నూరులో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు సీఎం జగన్. ఈ రోజు ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలోని కొత్తూరు జంక్షన్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అమలాపురం పార్లమెంట్ పరిధిలోని పి.గన్నవరం నియోజకవర్గంలో ఉన్న అంబాజీపేట బస్టాండ్ రోడ్డులో జరిగే సభలో.. మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం వైఎస్ జగన్.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేనకు కేటాయించారు. తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన ఇంఛార్జ్ గిడ్డి సత్యనారాయణకు టికెట్ కేటాయించారు. తొలుత తెలుగుదేశం ఫస్ట్ లిస్టులో మహాసేన రాజేష్ కు గన్నవరం సీటు కేటాయించారు. మహాసేన రాజేష్ కు కేటాయించడం పట్ల తెలుగుదేశం జనసేనతో పాటు హిందూ సంఘాలు వ్యతిరేకించాయి. దీంతో టిక్కెట్ మార్పు చేశారు.
MLC Kavitha:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. పి.గన్నవరం మండలం ముంగండ అనే గ్రామానికి వచ్చారు. ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి ఆలయాన్ని ఆమె దర్శించుకున్నారు.