అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేనకు కేటాయించారు. తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన ఇంఛార్జ్ గిడ్డి సత్యనారాయణకు టికెట్ కేటాయించారు. తొలుత తెలుగుదేశం ఫస్ట్ లిస్టులో మహాసేన రాజేష్ కు గన్నవరం సీటు కేటాయించారు. మహాసేన రాజేష్ కు కేటాయించడం పట్ల తెలుగుదేశం జనసేనతో పాటు హిందూ సంఘాలు వ్యతిరేకించాయి. దీంతో టిక్కెట్ మార్పు చేశారు.
Read Also: Bonda Uma: కొందరు పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు..
ఈ క్రమంలో.. పి.గన్నవరం నియోజకవర్గ నేతలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. అనంతరం పి.గన్నవరం నియోజకవర్గం ఇంఛార్జ్ గిడ్డి సత్యనారాయణకు టిక్కెట్ కేటాయించారు. ఎన్నికల నియమావళి, నిబంధనలతో కూడిన పత్రాలను గిడ్డి సత్యనారాయణకు పవన్ కల్యాణ్ అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడి కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా చేశారని ఆరోపించారు. వాటిని తట్టుకొని పి.గన్నవరం నియోజకవర్గంలో జనసేన నాయకులంతా ఒక మాట మీద నిలబడ్డారని తెలిపారు.
Read Also: Man Kills Father: క్రూరుడు.. తండ్రిని పొడిచి చంపేసి ఇంట్లోనే పాతిపెట్టాడు!
స్థానిక రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఇతర పక్షాలతో కలిసి సత్తా చాటారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొనసాగించాలని తెలిపారు. పి.గన్నవరం నియోజకవర్గం కచ్చితంగా జనసేనదే.. గెలుపు మనదేనని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలు రాష్ట్రం దిశా దశను నిర్దేశించేవి.. ప్రతి స్థానం కీలకమేనని పవన్ కల్యాణ్ చెప్పారు.