Chandrababu and Pawan Kalyan: చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం.. నేడు అమలాపురంలో ట్రాఫిక్ ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu and Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నాయి.. ఓ వైపు సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్తుంటే.. మరోవైపు విపక్షాలు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి.. ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ జట్టుకట్టిన విషయం విదితమే కాగా.. ఈ మూడు పార్టీల నేతలు ఉమ్మడిగా ప్రచారం చేస్తున్నారు.. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న విషయం విదితమే కాగా.. బుధవారం నుంచి మరోసారి ఇద్దరూ కలిసి ప్రచారం నిర్వహించారు.. ఇక, ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇద్దరి పర్యటన కొనసాగనుంది.. అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు..
పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో జరగబోయే ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొంటారు.. మధ్యాహ్నం అంబాజీపేట, సాయంత్రం అమలాపురం బహిరంగ సభలో పాల్గొననున్నారు ఇద్దరు నేతలు.. అయితే, ఇరు పార్టీల అధినేతలు వచ్చేందుకు వీలుగా అంబాజీపేట హైస్కూలులో హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు టీడీపీ నేతలు.. మరోవైపు బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.. వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. విముక్తాంధ్రప్రదేశ్ సాధించడమే ధ్యేయంగా జరగబోయే సభకు ప్రతి ఒక్కరు రావాలన్న టీడీపీ నేతలు కోరుతున్నారు.
Also Read
మరోవైపు నేడు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఉమ్మడి బహిరంగ సభ దృష్ట్యా అమలాపురంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. అమలాపురం మీదుగా వెళ్లే వాహనాలకు అమలాపురం పట్టణంలోకి అనుమతిలేదని స్పష్టం చేశారు.. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లు ఉంటాయని పేర్కొన్నారు.. కాకినాడ, రాజమండ్రి, రాజోలు, పి.గన్నవరం వైపు వెళ్లే వాహనాలను వివిధ మార్గాల్లో మళ్లించామని.. ట్రాఫిక్ ఆంక్షలు, సూచనలు గమనిస్తూ.. ఇబ్బంది లేకుండా.. ప్రయాణికులు తమ ప్రయాణాలు కొనసాగించాలని సూచించారు పోలీసులు.
తాజావార్తలు
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!