BJP vs Congress: ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ దాడిపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఢిల్లీ పేలుడు తర్వాత చిదంబరం మాట్లాడుతూ.. భారతదేశం రెండు రకాల ఉగ్రవాదులను ఎదుర్కొంటుందని ఆయన అన్నారు.
Chidambaram: ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రవాద దాడిపై తాజాగా మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. "దేశీయ ఉగ్రవాదం" అంశాన్ని లేవనెత్తారు. భారతదేశం రెండు రకాల ఉగ్రవాదులను ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. విదేశాల నుంచి వచ్చినవారు కొందరైతే.. దేశంలో తయారవుతున్న స్వదేశీ ఉగ్రవాదులు మరి కొందరని తెలిపారు. ఈ విషయాన్ని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని వివరించారు. "పహల్గామ్ దాడికి ముందు, తరువాత దేశంలో రెండు రకాల ఉగ్రవాదులు…
Eknath Shinde: 26/11 ముంబై ఉగ్ర దాడుల తర్వాత, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్‌పై చర్యలు తీసుకోకపోవడం ‘‘ద్రోహం’’ అని శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే అన్నారు. ఎవరి ఒత్తిడితో కాంగ్రెస్ పాకిస్తాన్‌పై దాడికి సిద్ధ పడలేదని ప్రశ్నించారు. శివసేన వార్షిక దసరా ర్యాలీలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. ఉద్ధవ్ ఠాక్రే తన సొంత పార్టీ అనుచరులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
Chidambaram: 2008 ముంబై ఉగ్రవాద దాడుల గురించి మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత పి. చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. 175 మంది ప్రాణాలను బలిగొన్న ఈ ఘోర ఉగ్రవాద ఘటన తర్వాత, అప్పటి యూపీఏ ప్రభుత్వం పాకిస్తాన్‌తో యుద్ధం చేయాలని భావించిందని, అయితే అమెరికా ఒత్తిడి మేరకు తాము ఆ పనిచేయలేదని చిదంబరం అన్నారు.
P Chidambaram: పార్లమెంట్‌లో ఆపరేషన్ సిందూర్ చర్చకు అంతా అధికార, ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అయితే, దీనికి ముందు కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమువుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో పహల్గామ్ ఉగ్రదాడిలో ‘‘స్వదేశీ ఉగ్రవాదులు’’ పాల్గొనవచ్చని ఆయన అన్నారు. హంతకులు పాకిస్తాన్ నుంచి వచ్చారని నిరూపించే ఆధారాలు ఏక్కడ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.
P. Chidambaram: ఎయిర్‌సెల్- మ్యాక్సిస్ మనీలాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది.
P. Chidambaram: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేసేందుకు కాషాయ పార్టీ ఏమాత్రం వెనకాడదన్నారు.
P. Chidambaram: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఆర్థిక మాజీ మంత్రి పి. చిదంబరం తన ఎక్స్ వేదికగా వ్యాఖ్యనించారు.
Emergency: 1975, జూన్ 25న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ‘ఎమర్జెన్సీ’ విధించారు. అయితే, జూన్ 25ని ‘సంవిధాన్ హత్యా దివాస్’గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ నేత పి.చిదంబరం ఇవాళ (గురువారం) అన్నారు. మోడీ హామీల జాడ ఎక్కడా లేదని, బీజేపీ అబద్ధాలు చెప్పడం, వక్రీకరించడం, దుర్వినియోగం చేయడం వంటి చర్యలకు పాల్పడుతోందని తెలిపారు.