ఆ ఏపీ మంత్రి వైఖరితో లోకల్, నాన్ లోకల్ సమస్యలు తలెత్తుతున్నాయా? బయటి నుంచి ఎవరో వచ్చి మా నెత్తినెక్కి డాన్స్ ఆడుతున్నారంటూ… ఆ యన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని టీడీపీ నేతలు రగిలిపోతున్నారా? మా ఎమ్మెల్యే మంత్రి అయితే… ఆ లెక్కే వేరబ్బా అనుకున్నవాళ్ళ అంచనాలు తల్లకిందులయ్యాయా? ఇంతకీ ఎవరా మినిస్టర్ సాబ్? ఏంటా లోకల్, నాన్ లోకల్ వార్? కొలుసు పార్ధసారధి… ఏపీ మినిస్టర్. టీడీపీ తరపున తొలిసారి నూజివీడు నుంచి గెలిచి… బీసీ…
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి కోలుకుంటూ...పార్టీని రీ సెట్ చేసే పనిలో సీరియస్‌గా ఉన్నారట వైసీపీ అధ్యక్షుడు జగన్. ఆ క్రమంలోనే సీనియర్ నాయకులు ఒక్కొక్కరిని పిలిపించుకుని మాట్లాడుతూ... భరోసా ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ పరంగా చేయాల్సిన అన్ని పనులు గట్టిగానే చేద్దామని ధైర్యం చెబుతుండటంతో... మెల్లిగా ఒక్కొక్కరు అజ్ఞాతం వీడుతున్నారట.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం...ఒకప్పుడు ఫ్యాక్షన్ అడ్డాగా, బాంబుల గడ్డగా ప్రసిద్ధి. ఇక్కడ ఫ్యాక్షన్ కోరల్లో చిక్కి విలవిల్లాడిన కుటుంబాలు ఎన్నో. పార్టీలతో సంబంధం లేకుండా పర్సనల్ కక్షలతోనే నరుకుడు ప్రోగ్రామ్స్ నడిచేవి. అయితే... రెండు దశాబ్దాల నుంచి ఆ తీవ్రత బాగా తగ్గింది. రాజకీయ పార్టీల ప్రాబల్యం పెరిగింది. ఆళ్ళగడ్డలో టీడీపీకి బలమైన క్యాడర్ వుందని చెబుతారు.
తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్పుడు కులగణన అంశమే హాట్ సబ్జెక్ట్. జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహించగా... వివిధ కారణాలతో కొందరు పాల్గొనలేకపోయారు. కుదరక కొందరైతే... ఉద్దేశ్యపూర్వకంగా వదిలేసిన వాళ్ళు మరి కొందరు. అలా వివరాలు ఇవ్వని వారికోసం మరోసారి సర్వే చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. ఈ విషయంలో కూడా రాజకీయాలు మొదలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగంలో అలసత్వం అరచేతి మందాన పేరుకుపోతోందా? సీఎం స్పీడ్…స్పీడ్… అంటున్నా, వాళ్ళు మాత్రం మన్నుతిన్న పాముల్లా కదులుతున్నారా? తీరు మార్చుకోవాలని సీఎం పదేపదే చెబుతున్న మాటలు ఉన్నతాధికారుల చెవికెక్కడం లేదా? నేను 95 సీఎంని అవుతానన్న చంద్రబాబు ప్రకటనలు కేవలం మాటలేనా? ఆ… అయినప్పుడు చూద్దాంలే అని ఆఫీసర్స్ అనుకుంటున్నారా? అసలు ఏపీ సెక్రటేరియెట్‌లో ఏం జరుగుతోంది? నాలో… మళ్ళీ.. నైన్టీ ఫైవ్ సీఎంని చూస్తారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ ముహూర్తాన అన్నారోగానీ….…
తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల భర్తీ కూడా అదిగో పులి అంటే… ఇదిగో తోక అన్నట్టు ఉందా..? ఎప్పటికప్పుడు అదిగో ఇదిగో అంటున్నారే తప్ప ఎప్పటికప్పుడు ఎందుకు వాయిదా వేస్తున్నారు? కసరత్తు పూర్తయిపోయింది, రెండు రోజుల్లో ఇచ్చేస్తారన్న పదవుల్ని సైతం ఎందుకు పట్టించుకోవడం లేదు? కాంగ్రెస్ పెద్దలకు అడ్డుపడుతున్నదేంటి? స్థానిక ఎన్నికల సందర్భంగా ఇచ్చే పదవులన్నా ఇస్తారా..! లేక వాటిని కూడా వాయిదా వేస్తారా? తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల భర్తీ అంశం ఊగిసలాడుతోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్…
జగన్ 2.oలో ఊహించని అంశాలు ఉండబోతున్నాయా? ఓటమి తర్వాత ఆయన బాగా మారిపోయారా? అందుకే ఇప్పుడు గతానికి పూర్తి భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఏంటా నిర్ణయాలు? వాటి ప్రభావం ఎంతవరకు ఉండవచ్చంటున్నారు? వైసీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఓటు బ్యాంక్ దాదాపుగా ఆ పార్టీకి టర్న్ అయ్యింది. 95 శాతం దాకా కాంగ్రెస్ ఓటర్లను తన వైపునకు తిప్పుకోవటంలో సక్సెస్ అయిన జగన్… కొందరు కీలక నేతల విషయంలో మాత్రం లైట్‌గా ఉన్నారట. అప్పట్లోనే…
జిల్లా అధ్యక్షుల ఎంపిక అక్కడ బీజేపీలో చిచ్చు పెట్టిందా? కష్టపడ్డవాళ్ళకు కాకుండా…. కాకా రాయుళ్ళకు, చెప్పుచేతల్లో ఉండే వాళ్ళకు పదవులు ఇచ్చారన్న అసంతృప్తి పెరిగిపోతోందా? కనీసం కుల సమీకరణల్ని కూడా చూడకుండా… విచ్చలవిడి పంపకాలు జరిగాయా? కాషాయ కేడర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎక్కడుంది? ఏ ఉమ్మడి జిల్లాలో తమకు కావాల్సిన వాళ్ళకి పంచేసుకున్నారు? ఉమ్మడి ఆదిలాబాద్ బీజేపీలో జిల్లా అధ్యక్షుల ఎంపిక అంతర్గత కుమ్ములాటలకు దారి తీస్తోందట. అధ్యక్షపదవి కోసం పోటీ పడ్డ…
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్, బీజేపీ క్లారిటీకి రాలేకపోతున్నాయా? ఆశావహులు పెద్ద ఎత్తున ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటున్నా… అధిష్టానాల వైపు నుంచి ఎందుకు స్పందన లేదు? లెక్కలు పక్కాగా కుదరడం లేదా? లేక అంతకు మించిన సమస్యలు వేరే ఉన్నాయా? అవసరానికి మించిన డిమాండే ఆలస్యానికి కారణం అవుతోందా? లేక అవతలి వాళ్ళని చూసి మనం అభ్యర్థుల్ని ప్రకటిద్దామన్న వైఖరి ఉందా? వచ్చే మార్చిలో ఖాళీ అవబోతున్న ఎమ్మెల్సీ స్థానాల విషయమై తెలంగాణలో ఉత్కంఠ…
శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయలని అంటారు. ఓ పక్క రాష్ట్రంలో జడలు విప్పిన రేషన్ మాఫియాను కట్టడి చేయడానికి ఏపీ సర్కార్ ప్రయత్నిస్తుంటే… తెలివి మీరిన ముఠాలు కొత్త దారులు వెదుకుతున్నాయట. మాలెక్క తేలిస్తే… మీ లెక్కలు సెటిల్ చేస్తామంటూ… సరికొత్త బేరగాళ్ళు మార్కెట్లో తిరుగుతున్నారట. ఇంతకీ ఎవరు వాళ్ళు? ఏకంగా మాఫియాకే ఆఫర్స్ ఇస్తున్న ఆ ముఠాలేంటి? ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియా వేళ్ళూనుకుని పోయింది. ఇది ఎవరో దారిన పోయే దానయ్య…