ఆ వైసీపీ ఎమ్మెల్యేకి అరెస్ట్ భయం పట్టుకుందా? ఎప్పుడు లోపలేస్తారో తెలియదని కంగారు పడుతున్నారా? అందుకే నియోజకవర్గంలో తిరగడం కూడా మానేశారా? తనతో పాటు తన అన్న, ఆయన కొడుకు కూడా కనీసం ఆరు నెలలు జైల్లో ఉండాల్సి వస్తుందని ఓపెన్‌గానే చెప్పేస్తున్నారా? మరి మిమ్మల్ని నమ్ముకుని చెలరేగిన మా సంగతేంటని కేడర్ అడిగితే సమాధానం లేదా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటాయన జైలు భయం? తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై ఇప్పుడు నియోజవర్గంలో…
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రభుత్వానికి తిప్పలు తప్పడం లేదా? ఛైర్మన్ మోషేన్‌రాజు అధికార పక్షానికి కొరకరాని కొయ్యలా మారిపోయారా? ఆయన విషయమై ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? మా రాజీనామాల్ని ఆమోదించండి మహోప్రభో…. అంటూ నలుగురు ఎమ్మెల్సీలు ఎందుకు మొరపెట్టుకోవాల్సి వస్తోంది? అసలు కౌన్సిల్లో పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి? శాసన మండలి…. పెద్దల సభ…. రకరకాల రాజకీయ ప్రాధాన్యతలు, పరిణామాల దృష్ట్యా…. అసెంబ్లీ వ్యవహారాల సంగతి ఎలా ఉన్నా…. ఈ పెద్దల సభలో మాత్రం అన్ని విషయాల…
వైనాట్ పులివెందుల. అసెంబ్లీ ఎన్నికల టైంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నినాదం ఇది. సరే… ఎన్నికలైపోయాయి. కూటమి కనీవినీ ఎరుగని విజయం సాధించింది. అయినా సరే…. పార్టీ పెద్దల మనసు నుంచి వైనాట్ పులివెందుల అన్న మాట చెరిగిపోలేదా? జగన్ అడ్డాలో ఎట్టి పరిస్థితుల్లో బలప్రదర్శన చేయాల్సిందేనని డిసైడయ్యారా? ఈసారి మహానాడును పులివెందులలో నిర్వహించాలన్న ఆలోచన ఉందా? ఆ విషయమై పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? కడప పాలిటిక్స్ అనగానే వైఎస్ కుటుంబం గుర్తుకు రావడం…
Off The Record: కూటమిలో ఇక కాపు తమ్ముళ్ళకు ప్రమోషన్లు ఉండవా? సైకిల్ పార్టీ కాపు నాయకులంతా త్యాగరాజులుగా మిగిలిపోవాల్సిందేనా? చేతికాడికొచ్చిన పదవుల్ని వాళ్ళొచ్చి తన్నుకుపోతున్నారంటూ... టీడీపీ కాపులు తెగ ఫీలైపోతున్నారా? ఇంతకీ వాళ్ళ ముందరి కాళ్ళకు బంధాలు వేస్తున్నదెవరు? ఎందుకు పసుపు కాపుల్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది?.
Off The Record: తెలంగాణ అంతా ఒక లెక్క అయితే.. అ నియోజకవర్గంలో ఇంకో లెక్క అన్నట్టుగా ఉందట. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ.. అప్పర్ హ్యాండ్ సాధించేందుకు అస్త్ర శస్త్రాలన్నింటినీ వాడేస్తున్నారట ఆ మాజీ ఎమ్మెల్యే. ఇలాగే ఉంటే.. మీకే కష్టమని సొంత పార్టీ నుంచే ఎమ్మెల్యేకి హెచ్చరికలు వెళ్తున్నాయట.
Off The Record: తెలంగాణ బీజేపీలో సమన్యాయం జరగడం లేదా? సూపర్ పవర్స్, రెగ్యులర్ పవర్స్ అంటూ వేర్వేరుగా నిర్ణయాలు జరుగుతున్నాయా? రాష్ట్రం మొత్తం జిల్లాల అధ్యక్షుల నియామకాలు పూర్తయినా ఆ రెండు జిల్లాల్లో మాత్రం ఎందుకు పెండింగ్‌లో పడ్డాయి? అక్కడ అడ్డుపడుతున్న బలమైన శక్తులేవి? ఆ వ్యవహారం పార్టీలో అసంతృప్తికి ఆజ్యం పోస్తోందా?.
Off The Record: ఆ జిల్లాలో బీఆర్ఎస్ ఓటమికి, వాస్తుకు లింక్ ఉందా? వాస్తు దోషం కారణంగానే జిల్లాలో ఒక్క సీటు కూడా పార్టీ గెలవలేకపోయిందా? అందుకే జిల్లా పార్టీ ఆఫీస్‌ని పాడుబెట్టేశాం... భూత్ బంగ్లాగా మార్చేశామని స్టేట్మెంట్స్ ఇవ్వడంలో లాజిక్ ఉందా?..
గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లారు. అయితే కలిసొచ్చి కుర్చీలో కూర్చున్నా…. దాన్ని ఎలా వాడుకోవాలో అర్ధంగాక తికమకలు, మకతికలు పడుతున్నారట ఆ ఎంపీసాబ్. పబ్లిసిటీ మోజులో తెగ పరేషాన్ అయిపోతూ…. అసలు తానేం చేస్తున్నానో… తన స్థాయి ఏంటో కూడా మర్చిపోయి సొంత పార్టీ ముఖ్యులకే అంతు చిక్కని పజిల్లా మారారాట. చివరికి చంద్రబాబు, లోకేష్ కూడా అతన్నెవరన్నా అపండర్రా….అని మొత్తుకోవాల్సి వస్తోందా? ఎవరా ఎంపీ? అంత తలనొప్పి పనులేం చేస్తున్నారు? కలిశెట్టి అప్పలనాయుడు….. విజయనగరం టీడీపీ…
ఆ ఎమ్మెల్యే ఏదో…… గొప్పగా…… సెటైరికల్‌గా మాట్లాడదామనుకుంటే….. చివరికి సుర్రు సుమ్మైపోయిందా? మాటలు మిస్ ఫైర్ అయిపోయి అట్రాసిటీ కేసు పెట్టించుకునేదాకా వెళ్ళాయా? ఫైనల్‌గా జంక్షన్ జామైపోయే పరిస్థితులు వచ్చాయా? ఎవరా ఎమ్మెల్యే? ఎక్కడ మాటలు బూమరాంగ్ అయ్యాయి? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నట్టు కనిపిస్తోంది. నియోజకవర్గంలోని వ్యవహారాలు ఆయన మీద అట్రాసిటీ కేసు బుక్ చేసేదాకా వెళ్లాయట. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్‌ని ఉద్దేశించి…
ఇటుక అన్న మాట వినిపిస్తే చాలు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉలిక్కి పడుతున్నారట. కలలో ఇటుకలు కనిపించినా….భయంతో ఒళ్ళంతా తడిసిపోతోందట. ఇక అసలు ఇటుక బట్టీ అన్న మాట వింటే చాలు శివాలెత్తిపోతున్నట్టు సమాచారం. అసలేంటా ఇటుక పంచాయితీ? అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఇటుక ఫోబియా ఎందుకు పట్టుకుంది? నిజామాబాద్ జిల్లాలో ఓ కాంగ్రెస్ శాసనసభ్యుడికి ఇటుక బట్టీల ఎమ్మెల్యేగా పేరు పెట్టారట బీజేపీ లీడర్స్. ఇటుక బట్టీల ఎమ్మెల్యేకు స్వాగతం అంటూ.. ప్లెక్సీలు సైతం ఏర్పాటు…