YSRCP : చచ్చేదాకా YCP లోనే అన్న మాజీ ఎమ్మెల్యే.. ఇప్పుడు స్వరం మారుస్తున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ మాజీ ఎమ్మెల్యే కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయా? ఆయన మాటలు ఇప్పుడే ఎందుకు తేడాగా వినిపిస్తున్నాయి? మామీద మీ పెత్తనం ఏంటి? ఎక్కువ చేస్తే… పార్టీ ఆఫీస్ మెట్లు కూడా ఎక్కబోమని ఎందుకు అంటున్నారు? చచ్చేదాకా వైసీపీలోనే ఉంటానని ఒకవైపు చెబుతూనే… మరోవైపు స్వరం మారుస్తున్న ఆ మాజీ ఎవరు? ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఉత్తరాంధ్ర వైసీపీలో ఒక్కొక్కటిగా అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయా అంటే… అవును, అలాగే కనిపిస్తోందంటున్నారు పొలిటికల్ పండిట్స్. అందుకు తాజా ఉదాహరణగా… విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌ని చూపిస్తున్నారు. అంతకు ముందు సంగతి ఎలా ఉన్నా…. ఇటీవల వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ వేదికగా ఆయన అన్న మాటలు, లేవనెత్తిన ప్రశ్నలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్ వ్యవస్థ పార్టీ అధినేతకు, తమకు మధ్య అడ్డుగోడగా మారిందన్న మాటల చుట్టూ రకరకాల విశ్లేషణలు పెరుగుతున్నాయి. గతంలో ఆ పోస్ట్‌లో ఉన్న విజయసాయిరెడ్డి చర్యలవల్ల ఒక్కో నియోజకవర్గంలో కనీసం 10వేల ఓట్లు కోల్పోయామన్న రాజకీయ సూత్రీకరణను తెరపైకి తెచ్చారు వాసుపల్లి. అలాంటి వ్యవస్థ ఇప్పటికీ అవసరమా…? అన్న అభిప్రాయంతో…. ప్రస్తుత కో ఆర్డినేటర్ కన్నబాబును కోట్ చేస్తూ… మాట్లాడ్డాన్ని కాస్త తేడాగానే చూస్తున్నాయట వైసీపీ వర్గాలు. ఇప్పుడు కూడా పాత పద్ధతులనే కొనసాగిస్తామని చెబితే… పార్టీ ఆఫీసులోకి కూడా అడుగు పెట్టబోనంటూ…. తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు మాజీ ఎమ్మెల్యే. దీంతో వాసుపల్లి ఆలోచన ధోరణి వైసీపీ లో విస్తృత చర్చ జరుగుతోందట. ఓవైపు కూటమి ప్రభుత్వం ఏడాది వైఫల్యాలపై పోరాటానికి సమాయత్తం అవుతున్న టైంలో…. వాసుపల్లి లాంటి వాళ్ళు పాత చేదు జ్ఞాపకాలతోనే సహవాసం చేయడం ఏంటని మాట్లాడుకుంటున్నాయట పార్టీ వర్గాలు. ఇక్కడ టీడీపీతో పోలిక తీసుకురావడం మరింత ఇబ్బంది మారిందట వైసీపీ నాయకత్వానికి. వాసుపల్లి గణేష్ రాజకీయంగా ఎదిగింది, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది టీడీపీలోనే. 2014, 2019లో విశాఖ దక్షిణ స్థానం నుంచి గెలిచారాయన. ఆ సమయంలో నేరుగా చంద్రబాబుతో మాట్లాడే అవకాశం ఉండేదని…కానీ… వైసీపీ అధికారంలో ఉన్నా…ప్రతిపక్షం లో కూర్చున్నా…. నియోజకవర్గ సమస్యల గురించి పార్టీ అధ్యక్షుడు జగన్‌కు నేరుగా రిపోర్ట్ చేసే అవకాశం లేకుండా పోయిందని, అదే అతిపెద్ద సమస్య అంటున్నారట ఈ మాజీ.వాస్తవానికి 2024 ఎన్నికల ఫలితాలు మిగిలిన నియోజకర్గాలతో పోలిస్తే వాసుపల్లికి అతిపెద్ద షాక్. జనసేన పోటీ చేయడం, ప్రత్యర్ధి వంశీకృష్ణ పొరుగు నియోజకవర్గం నుంచి రావడం, రెండు సార్లు గెలిచిన తన అనుభవం అన్నీ కలిసొచ్చి స్వల్ప మెజారిటీతో అయినా.. బయటపడతానని అనుకున్నారట ఆయన.
కానీ… ఆ అంచనాలను తల్లకిందులు చేస్తూ… ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ 64వేలకు పైగా మెజార్టీతో గెలవడం చూసి వాసుపల్లి నిజంగానే షాకయ్యారన్నది లోకల్ వాయిస్. ఆ తర్వాతనే ఆయన పార్టీలోని అత్యంత కీలకమైన వ్యవస్థని టార్గెట్ చేస్తూ మాట్లాడటం యాధృచ్చికం కాకపోవచ్చని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. 2019లో టీడీపీ నుంచి గెలిచి ఏడాది కాలానికే జెండా పీకేశారు ఈ మత్స్యకార నేత. వైసీపీ అధినాయకత్వం సాదరంగా స్వాగతించినప్పటికీ నియోజకవర్గ రాజకీయాలు కంట్లో నలుసుగా మారాయట. అప్పటి వైసీపీ నేత, బ్రాహ్మణ కార్పొరే షన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ వర్సెస్ వాసుపల్లిగా వ్యవహారం నడిచేది. అప్పటి పార్టీ ముఖ్యనేత విజయ సాయిరెడ్డి ప్రమేయంతోనే తాను ఇబ్బంది పడాల్సి వచ్చిందన్న అభిప్రాయం ఆయనలో ఉందట. ఇక ఎన్నికలకు ముందు సుధాకర్ పార్టీ మారిపోయి దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ అయ్యారు. ఇక దక్షిణ నియోజకవర్గం వైసీపీలో తనకు ఇబ్బంది లేదనుకుంటున్న టైంలో చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు ఆయన స్వరం ఎందుకు మారిందన్న చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే ఆయన తిరిగి కూటమికి దగ్గరవుతారని అనుకున్నారు అంతా. గణేష్ కుమార్ మాత్రం ప్రాణం వున్నంత వరకు వైసీపీలోనేనని తేల్చేశారు. అలాంటప్పుడు ఈ అసంతృప్త స్వరం ఎందుకంటే… అందుకు వేరే బలమైన కారణాలున్నాయన్న విశ్లేషణలు నడుస్తున్నాయి. విశాఖ దక్షిణంలో బలపడేందుకు మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కుటుంబం ప్రయత్నం చేస్తోందట. అలాగే… ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా యాక్టివేట్ అవుతున్నట్టు సమాచారం. వాళ్ళకు పార్టీలోని సీనియర్లు సహకరిస్తున్నారన్న అనుమానమే ఆయన అసహనానికి కారణం కావచ్చంటున్నారు. అందుకే కో ఆర్డినేటర్ వ్యవస్థను కూడా ప్రశ్నిస్తుండవచ్చన్నది ఓ వాదన. మొత్తం మీద వైసీపీలోని అత్యంత కీలకమైన వ్యవస్థ టార్గెట్‌గా వాసుపల్లి సంధించిన అసంతృప్తి అస్త్రం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
Also Read
- Tags
- Ganesh
- NTV Telugu
- OTR
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!