టీడీపీలో కోవూరు కోలాటం రసవత్తరంగా మారుతోందా? ఎమ్మెల్యే మాటల్ని మండల స్థాయి నాయకులు అస్సలు పట్టించుకోవడం లేదా? అవినీతి, అక్రమాలకు దూరం ఉండమని పదే పదే చెబుతున్నా వాళ్ళ చెవికెక్కడం లేదా? ఎమ్మెల్యేనా…. అయితే ఏంటన్న ధోరణి పెరిగిపోతోందా? అసలేం జరుగుతోందక్కడ? నెల్లూరు జిల్లా కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం.. కొడవలూరు ..విడవలూరు.. ఇందుకూరుపేట మండలాల్లో విస్తరించి ఉంటుంది కోవూరు అసెంబ్లీ సెగ్మెంట్. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.…
ఆ టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర అసహనంగా ఉన్నారా? గెలిచి 9నెలలవుతున్నా…. ఏం చేయలేకపోతున్నానని ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా? చివరికి తప్పు చేసిన వారిని శిక్షించలేకపోయానన్న బాధ ఆయనలో పెరిగిపోతోందా? అసలాయన ఏమన్నారు? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటి? ఎవరా శాసనసభ్యుడు? గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు…2019లో వైసీపీ తరపున గన్నవరం నుంచి పోటీ చేసి అప్పటి తన ప్రత్యర్థి వల్లభనేని వంశీ చేతిలో ఓడిపోయారు. ఇక 2024లో వైసీపీని వీడి టీడీపీ బీఫాం మీద పోటీ…
ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే.. అదే విషయాన్ని సుప్రభాతంలా చెబుతున్నా… కొందరు టీడీపీ నాయకుల చెవికెక్కడం లేదా? ప్రత్యేకించి సొంత జిల్లాలో కొందరికి ఆయన మాటంటే లెక్కే లేకుండా పోయిందా? అదే బాధ ఇప్పుడు పార్టీ అభిమానుల మనసుల్ని సైతం మెలిపెడుతోందా? అసలే విషయంలో సీఎం మాటను పట్టించుకోలేదు జిల్లా ప్రడాప్రతినిధులు? వేల కోట్ల రూపాయల అవకతవకల మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? వైసీపీ నాయకులకు సహాయం చేస్తే పాముకు పాలు పోసినట్టే….వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెలుపు విషయమై నాగబాబు కావాలనే అలాంటి వ్యాఖ్యలు చేశారా? పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను కించపరిచే ఉద్దేశ్యం ఉందన్న ప్రచారంలో నిజమెంత? అసలా కామెంట్స్‌ని వర్మ ఎలా తీసుకుంటున్నారు? తెలుగు తమ్ముళ్ళు ఏమంటున్నారు? ఈ రచ్చ ఇక్కడితో ఆగుతుందా? లేక కథలో ఊహించని మలుపులు ఉండబోతున్నాయా? లెట్స్ వాచ్. జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. ఆయన ఆ మాటల్ని…
అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వ్యూహం మారిందా? ఎక్కడ నెగ్గాలో కాదు…. ఎక్కడ తగ్గాలో తెలిసుండాలన్న డైలాగ్‌ని గుర్తు చేసుకుంటోందా? తమ సభ్యుడి సస్పెన్షన్ బహిష్కరణదాకా వెళ్లకుండా ఉండాలంటే… ముందు తాము మారామని నిరూపించాలని గులాబీ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారా? కారు పార్టీ కొత్త ప్లాన్ ఏంటి? ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉంది? తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా జరుగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర…
దేశంలో ఎక్కడ లిక్కర్ స్కాం బయటపడ్డా… అందరి దృష్టి తెలంగాణవైపే మళ్ళుతోందా? తాజాగా తమిళనాడు మద్యం కుంభకోణం విషయంలో కూడా మరోసారి తెలంగాణ వైపు తొంగిచూసే పరిస్థితి వస్తోందా? అసలు తమిళనాడు లిక్కర్ వ్యవహారానికి, తెలంగాణకు ఏంటి సంబంధం? ఇటువైపు చూడాల్సిన అవసరం ఏం వచ్చింది? ఢిల్లీ మద్యం కుంభకోణం తరహాలోనే…..తమిళనాడులో కూడా పెద్ద స్కామే జరిగిందా? అక్కడి ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందా? అంటే….. ఇప్పుడే ఖచ్చితంగా ఇదీ అని చెప్పలేంగానీ… మొత్తానికి జరగకూడనిదేదో….జరిగిపోయిందని మాత్రం…
విశాఖ జిల్లాలోని ఆ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో షాడోస్ తయారయ్యారా? కూటమి ఎమ్మెల్యేలు తాము తప్పుకుంటూ… వారసులతో అప్రెంటీస్ చేయిస్తున్నారా? నాలుగేళ్ళ తర్వాత వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టారా? ఎవరా ఎమ్మెల్యే కాని ఎమ్మెల్యేలు? ఏంటా కథ? రాజకీయాల్లో వారసత్వాలు కొత్తేమీ కాదు. కాకుంటే… పెద్దోళ్ళు పవర్లో ఉంటే… దాన్ని అడ్డం పెట్టుకుని పిల్లోళ్ళు చెలరేగిపోయినప్పుడే సమస్యలు వస్తుంటాయి. పార్టీల్లో వర్గాలు పెరుగుతుంటాయి. విశాఖ జిల్లాలోని ఆ నాలుగు నియోజకవర్గాల్లో ఇప్పుడు అలాంటి…
తెలంగాణ కాంగ్రెస్‌లో నిశ్శబ్దం బద్దలైందా? ఇన్నాళ్ళు నాకెందుకులే…. అది నా పని కాదని అన్నట్టుగా ఉండే వాళ్ళు యాక్టివ్ అయ్యారా? అసెంబ్లీ సాక్షిగా నాయకుల్లో మార్పు కనిపించిందా? అధికార పక్షం ఇక దూకుడు పెంచబోతోందా? పార్టీలో వచ్చిన మార్పు ఏంటి? దానిపై జరుగుతున్న చర్చ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఎన్ని కుమ్ములాటలు ఉన్నా…. గ్రూపులు కట్టినా….ఓవరాల్‌గా పార్టీ, ప్రభుత్వం మీదికి ఎవరన్నా దాడికి దిగితే… అంతా ఏకతాటి మీదికి వస్తుంటారు. కానీ… ఈ మధ్య కాలంలో…
ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన అలా….అలా…. కట్టు తప్పుతోందా? అధికారులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా? అసలు……. స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలకే దిక్కు లేకుండా పోతోందా? మీ ఆఫీసర్స్కి కాస్త చెప్పండంటూ…. ఏకంగా పక్క రాష్ట్ర మంత్రి సీఎంకు లేఖ రాయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఏపీ సర్కార్‌లో అసలేం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా తొమ్మిది నెలలవుతోంది. ఈ కాలంలో రకరకాల వివాదాలు, అంతకు మించిన ట్విస్ట్‌లు చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా…