Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పతంగి సపోర్ట్ ఎటు..? |
- జూబ్లీహిల్స్‌లో మూడు సార్లు మాగంటి గోపీనాథ్ గెలుపు..
- ఇటీవల అనారోగ్యంతో గోపీనాథ్ మృతి..
- మొదలైన ఉప ఎన్నిక హడావిడి..
- ఎంఐఎం వైఖరిపై సరికొత్త చర్చలు..
- ఈసారి కాంగ్రెస్‌కు మద్దతివ్వవచ్చన్న అంచనాలు..
- 2023లో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటికి 16 వేల 337 ఓట్ల మెజార్టీ..
- అధికార పార్టీగా కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం..
- బస్తీల ప్రాబల్యం, మైనార్టీ ఓట్లు కీలకం..
- బీఆర్‌ఎస్ గోపీనాథ్ కుటుంబానికే ఇస్తుందా?..
- సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం అప్పుడే పొలిటికల్ పావులు కదులుతున్నాయా? ఈసారి సమీకరణలు మారే ఛాన్స్ ఉందా? అత్యంత కీలకమైన పతంగి పార్టీ ఎటువైపు? ఎవరికైనా మద్దతిస్తుందా? లేక తిరిగి సొంతగా బరిలో దిగుతుందా? మిగతా మూడు పార్టీల సంగతేంది? రేస్‌లో ఉన్న ఆశావహులు ఎవరు?
Read Also: Gang Rape: బీచ్‌లో ప్రియుడి ముందే యువతిపై సామూహిక అత్యాచారం..10 మంది అరెస్ట్
Also Read
సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అత్యంత కీలకమమైన అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో ఒకటి జూబ్లీహిల్స్. 2009లో ఏర్పడ్డ ఈ నియోజకవర్గానికి ఇప్పటికి మూడు సార్లు ఎన్నికలు జరగ్గా… మొత్తం మూడు సార్లూ ఎమ్మెల్యేగా గెలిచారు మాగంటి గోపీనాథ్. టీడీపీ, బీఆర్‌ఎస్ తరపున ప్రాతినిధ్యం వహించారాయన. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. దీంతో వచ్చే ఆరు నెలలలోపు ఇక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. దీంతో అప్పుడే ఇక్కడ పొలిటికల్ టాక్స్ మొదలైపోయాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పోటీ చేసే అవకాశం ఉండగా.. మజ్లిస్ పార్టీ వైఖరేంటన్నది ఆసక్తిరకరంగా మారింది. ఆ పార్టీ కూడా నేరుగా బరిలో దిగితే.. చతుర్ముఖ పోటీ తప్పనిసరి అవుతుంది.
Read Also: KTR Formula E-Car Race: బలవంతంగా వ్యక్తిగత ఫోన్లు తీసుకోకూడదు..
అయితే, ఈ పరిస్థితుల్లో.. ఎంఐఎం నేరుగా పోటీ చేస్తుందా లేక వేరే ఏ పార్టీకైనా.. మద్దతిస్తుందా అన్న చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌తో ఉన్న సఖ్యత, ఆ మధ్య జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడం లాంటి పరిస్థితుల్లో… ఆ పార్టీకే మద్దతు ఇవ్వొచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పతంగి పార్టీ ఈ ఉప ఎన్నికలో కీలకం అన్న అంచనాల మధ్య అందరి చూపు అటువైపే మళ్లుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్, కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్, బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. ఎంఐఎం అభ్యర్థి బరిలో ఉన్నా…. మాగంటి గోపీనాథ్ 16 వేల 337 ఓట్లతో గెలిచారు. కాంగ్రెస్ సెకండ్ ప్లేస్, బీజేపీ థర్డ్ ప్లేస్ లో నిలిచాయి. ఈ సారి కూడా మూడు పార్టీలకు జూబ్లీహిల్స్ కీలకంగానే ఉంటుందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున సీటు గెలవడం ఆ పార్టీకి ప్రతిష్టాత్మకం అవుతుంది. జూబ్లీహిల్స్ ధనిక ప్రాంతమైనా.. మొత్తం నియోజకవర్గ పరంగా చూసుకుంటే బస్తీల ప్రాబల్యం ఎక్కువ. అందులోనూ ముస్లిం మైనార్టీల ఓట్లే కీలకం. ఇక మూడు పార్టీల్లో ఆశావహులు ఆల్రెడీ టిక్కెట్ ప్రయత్నాలు మొదలుపెట్టారట.
Read Also: Ramya Sri: సినీ నటిపై కత్తి దాడి?
ఇక, బీఆర్‌ఎస్ అయితే.. మాగంటి గోపీనాథ్ కుటుంబం నుంచే ఎవరినో ఒకరిని బరిలో దింపవచ్చని అంటున్నారు. అయితే రావుల శ్రీధర్ రెడ్డి ఆ టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం.మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి కూడా అడగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుండి గతంలో పోటీ చేసిన అజారుద్దీన్.. కార్పొరేటర్ విజయా రెడ్డి, గతంలో MIM నుండి పోటీ చేసిన నవీన్ యాదవ్‌తోపాటు మరికొందరు రేస్‌లో ఉన్నారట. ఇక బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి, డాక్టర్ పద్మ వీరపనేని, రామకృష్ణ, కీర్తి రెడ్డి ఇలా… పలువురు రేస్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ సిట్టింగ్ సీటు కాపాడుకోవడం బీఆర్‌ఎస్‌కు తప్పనిసరి అయితే…. అధికార పార్టీగా ఉప ఎన్నికలో గెలవడం కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం. దీంతో పోలింగ్ రసవత్తరంగా మారవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. అటు బీజేపీకి కుడా ఇది కీలకమే. ఈ నియోజకవర్గం ఉన్న సికింద్రాబాద్ ఎంపీగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని చెబుతున్న క్రమంలో ఈ ఉప ఎన్నికను గీటురాయిగా భావించవచ్చంటున్నారు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?