ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన ఆ అక్కచెల్లెళ్ళ మధ్య ఏదో జరుగుతోందా? ఇబ్బంది వచ్చినప్పుడు కూడా కనీసం ఒకర్ని ఒకరు పరామర్శించుకోలేనంత అగాధం పెరిగిపోయిందా? సినిమా, రాజకీయం కలగలిసిపోయినట్టుగా ఉండే ఆ సిస్టర్స్ ఎవరు? వాళ్ళ మధ్య సఖ్యత లేదన్న అనుమానాలు ఇప్పుడెందుకు వచ్చాయి? నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిలప్రియను వివాదాలు చుట్టుముడతాయో… లేక ఆమే వివాదాలను వెతుక్కుంటూ వెళ్తారో తెలీదుగానీ… ఎప్పుడూ ఏదోఒక వివాదాస్పద టాపిక్‌తో చర్చల్లో వుంటున్నారు ఆమె.…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై విస్తృత చర్చ జరుగుతోంది. వాళ్ళని వెనక నుంచి ఎవరో నడిపిస్తున్నారని, లేందటే.. వాళ్ళు అంత తేలిగ్గా.. మంత్రి పదవి పేరుతో ముందుకు నడిచేవాళ్ళు కాదని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. మంత్రి పదవుల పంపకంలో సామాజిక న్యాయం పాటించాలని కోరుకోవడంలో తప్పు లేదు.
వి.హన్మంతరావు అలియాస్ వీహెచ్. కాంగ్రెస్‌లోనే కాదు, తెలంగాణలోనే కాదు, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఆయనంటే తెలియని వారు ఉండరు. ఇంకా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కురువృద్ధుడాయన. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. తొలి నుంచి కాంగ్రెస్‌కు లాయల్‌గా ఉంటూ... అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారన్న పేరుంది.
వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ జూపల్లి వెంకటరత్నం సస్పెండ్ అయ్యారు. ఆయన మీద వేటు వేస్తూ... వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. డిపార్ట్మెంట్లో అలాంటివి సాధారణంగా జరుగుతుంటాయి. కానీ, ఈ సస్పెన్షన్ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే.. ఈ పోలీస్ స్టేషన్ ఇలాంటివి కామన్ అయిపోయాయి కాబట్టి.
గుంటూరు వెస్ట్.. రాజకీయంగా మంచి ప్రాధాన్యత ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్. కానీ... ఇక్కడ ఇన్ఛార్జ్ని నియమించుకోలేక సతమతం అవుతోందట వైసీపీ. అలాగని.... పార్టీకి ఇక్కడ నాయకుల కొరతేం లేదు
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కొత్త పోకడలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ప్రత్యేకించి రాష్ట్రంలో ఇన్నాళ్లు పార్టీ పరిస్థితులకు భిన్నంగా... కనిపిస్తున్నాయని అంటున్నారు. ఎంత కూటమిలో ఉన్నా... అధికారం చెలాయిస్తున్నా... సొంత బలం ఉంటేనే గౌరవం అన్న నిర్ణయానికి వచ్చిన ఏపీ కాషాయదళం... ఆ దిశగా అడుగులేస్తోందట.
వైసీపీ అధినేత జగన్ దారి మారిందా? ఆయన కూడా డైవర్షన్స్ మొదలు పెట్టేశారా? ముక్కుసూటి రాజకీయం వర్కౌట్ కాదని తెలుసుకున్నారా? ఎప్పుడూ హైవే పాలిటిక్సే కాదు… ఇక నుంచి డొంక రోడ్డు రాజకీయం కూడా చేద్దామనుకుంటున్నారా? ఇంతకీ ఏం చేయబోతున్నారాయన? ఏంటా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్? వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎప్పుడూ స్ట్రైట్ లైన్ పాలిటిక్స్ చేస్తారన్న పేరుంది. అది లాభమైనా, నష్టమైనా…. నా దారి రహదారి అన్నట్టుగానే ఆయన వ్యవహారం ఉంటుందని చెప్పుకుంటారు. కానీ… అదంతా…
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలక మండలి ఏర్పాటుకు ఎందుకు ముందడుగు పడటం లేదు? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ….చట్ట సవరణ చేశాక కూడా… ఎక్కడ తేడా కొడుతోంది? నెలల తరబడి కసరత్తులు జరుగుతున్నా…. పాలకమండలి ఎంపిక కొలిక్కి రాకపోవడానికి కారణాలేంటి? ప్రభుత్వ పెద్దలకు ఎలాంటి సవాళ్ళు ఎదురవుతున్నాయి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక… తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డ్ తరహాలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కూడా బోర్డ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం…
మినీమహానాడు వేదికగా ఆ టీడీపీ సీనియర్ లీడర్ కమ్ ఎమ్మెల్యే బాంబ్ పేల్చారు. మంత్రులకో న్యాయం, మాకో మరో న్యాయమా….? అంటూ పార్టీ డైరెక్ట్‌గా అధిష్టానాన్ని నిలదీశారు. ఎందుకీ వివక్ష అన్న ప్రస్తావన లేవనెత్తిన ఆ సీనియర్ శాసనసభ్యుడు ఎవరు? మిస్టర్ కూల్ ఇమేజ్ వున్న ఆ మాజీమంత్రి ఎందుకు బరస్ట్ అయ్యారు? ఎవరిమీద ఆయన ఆక్రోశం? ఉత్తరాంధ్ర టీడీపీలో…. సీనియర్ లీడర్ బండారు సత్యనారాయణ మూర్తిది డిఫరెంట్ పొలిటికల్ స్టైల్. మండలాధ్యక్షుడి నుంచి మంత్రి వరకు…
అది స్వపక్షమైనా, విపక్షమైనా…. ప్రత్యర్థులన్నవాళ్ళు లేకుండా చేసుకోవడమే ఆ ఎమ్మెల్యే లక్ష్యమా? విపక్ష శిబిరంలో ఉన్న కాస్తో కూస్తో పవర్‌ని లాగేసే కార్యక్రమం పూర్తయ్యాక… ఇప్పుడు టీడీపీలోని ప్రత్యర్ధులపై దృష్టి పెట్టారా? వాళ్ళని తరిమేయండని మినీ మహానాడు సాక్షిగా కేడర్‌కు పిలుపునివ్వడాన్ని ఎలా చూడాలి? ఎవరా ఎమ్మెల్యే? ఎందుకు ఆ స్థాయిలో ఫైర్ మీదున్నారు? రెండు దశాబ్దాలుగా కడప అసెంబ్లీ సీటులో సైకిల్ పార్టీకి గెలుపన్నదే లేదు. నియోజకవర్గంలో టీడీపీ ఉనికే ప్రమాదంలో పడిన సమయంలో 2024…