అక్కడ కాంగ్రెస్ పార్టీలో మూడు ముక్కలాట జోరుగా నడుస్తోందా? ఓ కాంగ్రెస్, బీ కాంగ్రెస్ అంటూ వర్గాలుగా విడిపోయి తన్నుకుని తలంట్లు పోసుకుంటున్నారా? చివరికి పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశాన్నే రసాభాస చేసుకున్నారా? ఆ యుద్ధం అసలు అధిష్టానం చెక్ పెట్టగలిగే స్థాయిలో ఉందా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? మూడు ముక్కలాట ఆడుతున్న ఆ నాయకులెవరు? వికారాబాద్ జిల్లా అధికార పార్టీలో నేతల మధ్య ఐక్యత లోపించింది. ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే…
ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్నా లొల్లే, రాజధానికి వచ్చినా లొల్లేనా? గాలికి పోయే కంపను గుడ్డకు తగిలించుకోనిదే ఆయనకు నిద్ర పట్టదా? ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని నెత్తినేసుకుని తిరిగితే తప్ప ఆయనకు రాజకీయం చేసినట్టు ఉండదా? కేరాఫ్ కాంట్రవర్శీ లిస్ట్‌లో చేరుతున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? ఆయన కదిపిన తాజా తుట్టె ఏంటి? ఓపెన్‌గా ఉండాలి. బోళాగా మాట్లాడాలని అనుకుంటూ ఉంటారు కొందరు రాజకీయ నాయకులు. ఆ తత్వం వాళ్ళని ఒక్కోసారి సమస్యల నుంచి బయటపడేస్తే……
గడ్డం వంశీకృష్ణ.. పెద్దపల్లి ఎంపీ. 35 ఏళ్లకే లోక్‌సభలో అడుగుపెట్టారీ పొలిటికల్ వారసుడు. కాకా కుటుంబం నుంచి పెద్దపల్లి సీట్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న మూడో తరం నాయకుడు. అంతవరకు బాగానే ఉందిగానీ.. ఇప్పుడాయన వ్యవహారశైలి గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో. అటు పార్టీ కార్యక్రమాల్లో, ఇటు ప్రభుత్వ ప్రోగ్రామ్స్‌లో ప్రోటోకాల్ ప్రకారం పిలుపులు ఉండటం లేదన్నది ఎంపీ అనుచరుల ఆరోపణ. ఐడెంటిటీ సమస్య కావడంతో ఆగ్రహంతో ఉన్నారట ఎంపీసాబ్.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో.. ఇసుక దందా జోరుగా నడుస్తోందన్న ఆరోపణలున్నాయి. హస్తం పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు... ఇందులో మునిగి తేలుతున్నారట. ఎమ్మెల్యేల కనుసన్నల్లో కొంత.. వాళ్ళ పేర్లు చెప్పి మరింత దందా చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీరు ఉన్నట్టుండి మారిపోయింది. ఎంతటి సీరియస్ విషయాన్నయినా కూల్‌గా డీల్ చేసి తనదైన శైలిలో సాఫ్ట్ ముగింపు ఇచ్చే ఈటల భాష ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది. తన సహజత్వానికి భిన్నంగా ఆయన చేస్తున్న ఎగ్రెసివ్ కామెంట్స్ నాలుగైదు రోజులుగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశం అవుతోంది.
సంగారెడ్డి జిల్లా బీజేపీ ఇటీవల కొత్త మండల అధ్యక్షుల్ని ప్రకటించింది. ఇక అంతే... ఆ ఒక్క ప్రకటనతో.... జిల్లా పార్టీలో వర్గపోరు భగ్గుమంది. తమను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం ఏంటంటూ.. పార్టీ ముఖ్య నాయకులు జిల్లా అధ్యక్షురాలిపై సీరియస్ అయినట్టు సమాచారం.
తెలంగాణలో రాజకీయ అగ్గి ఈసారి డిఫరెంట్‌గా రాజుకోబోతోందా అంటే... అవును... అలాగే కనిపిస్తోందని చెబుతున్నారు పొలిటికల్ పరిశీలకులు. బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అంటున్నారు. తాజాగా మీడియాతో కవిత అన్న మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. సామాజిక తెలంగాణ విషయమై ఈనెల మొదట్లో కవిత అన్న మాటల సెగలే ఇప్పటికీ తగ్గలేదు.
తెలంగాణలో పదేళ్ళు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్... ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చింది. అందుకు కారణాలపై ఇప్పటికే పోస్ట్‌మార్టం పూర్తి చేసిన గులాబీ అధిష్టానం... జరిగిన తప్పుల్ని సరిదిద్దుకునే కార్యక్రమం మొదలుపెట్టిందట.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్‌లో కల్లోలం కొనసాగుతూనే ఉంది. నిరుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పార్టీ మార్పుతో మొదలైన వివాదం తీవ్ర తుఫాన్‌గా మారుతోందేతప్ప తీరం దాటడం లేదు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేంత రాజకీయ వైరం ఉంది.
తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు చేసిన కామెంట్స్‌పై సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇక సమరమే అంటూ.... ఉద్యోగ సంఘాల జేఏసీ పేరుతో వచ్చిన ప్రకటనపై సీఎం తీవ్ర అసహనంగా ఉన్నట్టు సమాచారం.