Off The Record: తెలుగుదేశం పార్టీలో కూడికలు, తీసివేతల కార్యక్రమం జోరుగా నడుస్తోందా? యాక్టివ్‌గా లేని ఇన్ఛార్జ్‌ల మీద వేటు తప్పదా? ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా సీఎం తలంటు ప్రోగ్రామ్ నడుస్తోందా? పార్టీలో కాస్త లూజ్‌గా ఉన్న నట్లన్నిటినీ టైట్ చేసి పరుగులు పెట్టించే ప్రోగ్రామ్ మొదలైందా? ఉన్నట్టుండి ఈ మార్పునకు కారణం ఏంటి? పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఎక్కడ డౌట్ కొట్టింది?
Read Also: Off The Record: కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం ఆలస్యం వెనుక మర్మం?
మీరు మారండి.. సరిగ్గా పని చేయండి.. లేదంటే నేను మళ్ళీ 1995 సీఎంని అవుతానని చంద్రబాబు ఏ ముహూర్తాన అన్నారోగానీ.. ఇప్పుడు ఆచరణలో మాత్రం అచ్చు అలాగే కనిపిస్తున్నారని అంటున్నాయి తెలుగుదేశం వర్గాలు. 95లో కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉన్నారాయన. అది కొంత నెగెటివ్ కూడా అయిందన్నది వేరే సంగతి. తిరిగి ఈసారి అదే తరహాలో నేను 95 సీఎం అని పదే పదే చెప్తూ ఉన్నారు చంద్రబాబు. అలా ఎందుకంటే… ప్రస్తుతం కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల తీరు ఆయనకు అస్సలు నచ్చడం లేదట. మరీ బాధ్యతారహితంగా ఉంటున్నారని, వాళ్లని అలాగే వదిలేస్తే… తాము మునిగి పార్టీని కూడా ముంచుతారన్న అనుమానాలు ఉన్నాయట ముఖ్యమంత్రికి. చివరికి కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లకు కూడా తోలు మందం ఎక్కడంతో…. ఇక ముల్లుగర్రతో పొడవక తప్పదని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవల సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఎమ్మెల్యే లు, ఇన్ఛార్జ్‌లకు స్పెషల్ టాస్క్ అప్పగించారు చంద్రబాబు.
Read Also: Off The Record: దశాబ్దం తర్వాత ఆ బడా నేతలను ప్రోటోకాలే కలిపిందా?
ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి చెప్పాలన్నది ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. సీఎం సీరియస్‌గా చెప్పినా సరే… కొంతమంది ఎమ్మెల్యేలు దీన్ని లైట్‌గా తీసుకున్నారన్న నివేదికలు అందినట్టు తెలిసింది. కొందరు సీరియస్‌గా ఇంటింటికి తిరిగినా… మరి కొందరు మాత్రం ఆ ప్రోగ్రామ్‌ని సరిగ్గా చేయలేదట. అలాంటి వాళ్ళ వ్యవహార శైలి మీద సీఎం సీరియస్ అయినట్టు సమాచారం. జనంలో తిరగడానికి ఎందుకు ఆలోచిస్తున్నారంటూ…. కోప్పడ్డట్టు చెప్పుకుంటున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో సరిగా పాల్గొనని నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లను వెంటనే తప్పించేయమని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అంత సీరియస్‌గా ప్రోగ్రాం చెబితే నిర్లక్ష్య ధోరణితో ఉండడం ఆయన అసహనానికి కారణంగా తెలిసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాళ్ళకు స్ట్రాంగ్‌గా పడ్డాయని, ఈ విషయంలో మంత్రులకు కూడా మినహాయింపు లేదని చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ నియోజక వర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం చాలా తక్కువగా జరిగిందట. అలాగే మరి కొంతమంది సీనియర్లు ఉన్న నియోజక వర్గాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించడాన్ని సీఎం సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం.
Read Also: Constable Kanakam : ఆకట్టుకుంటున్న కానిస్టేబుల్ కనకం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఎమ్మెల్యేలు, మంత్రులకు తలంటుతూనే… మరోవైపు సీరియస్‌గా లేని ఇన్ఛార్జ్‌ల మీద మాత్రం వేటేయాలని నిర్ణయించినట్టు సమాచారం. దీంతో పాటు పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు, ప్రమాద బీమా చెక్కుల పంపిణీ లాంటి కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యేల హాజరు చాలా తక్కువగా ఉంటోందంటూ సీరియస్ అయ్యారట సీఎం. ఇదే రిపీట్ అయితే ఇబ్బందులు తప్పవని కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లడం…పార్టీ కోసం కొంత సమయం కేటాయించడం లాంటివి ఎమ్మెల్యేలు… మంత్రులకు ఎందుకు కుదరడం లేదని గట్టిగానే అన్నారట చంద్రబాబు. వచ్చే నెలలో టీడీపీ రాష్ట్ర కమిటీ నియామకం జరగనుంది. కొత్త కమిటీలో పూర్తిగా కమిట్మెంట్ ఉన్న వారికి మాత్రమే చోటు దక్కుతుందని, అరకొరగా దృష్టి పెట్టేవాళ్ళను పక్కకు నెట్టేసే ఆలోచనలో అదిష్టానం ఉందన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. ప్రభుత్వంలో ఎంత సీరియస్‌గా పని చేస్తున్నామో పార్టీ కోసం కూడా అంతే సీరియస్‌గా వర్క్ చెయ్యాలని పదే పదే చెబుతున్నారు చంద్రబాబు. ఈ పరిస్థితుల్లో… రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటాయో చూడాలి.