వేసవి ఉక్కపోత కంటే ఎక్కువగా ఆ ఎమ్మెల్యేలు పొలిటికల్ సఫకేషన్ ఫీలవుతున్నారా? దానికైతే ఏసీ వేసుకుంటే సరిపోతుందిగానీ… దీనికేం చేయాలో అర్ధంకావడం లేదని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారా? ఆ ఫ్రస్ట్రేషన్‌లోనే చిటపటలాడి పోతున్నారా..? ఎందుకా టీడీపీ శాసనసభ్యులు అంత అసహనంగా ఉన్నారు? వాళ్లకొచ్చిన ఇబ్బంది ఏంటి? ఉమ్మడి విశాఖజిల్లాలో కూటమి రాజకీయం వేడెక్కుతోంది. వ్యవస్ధ, వైఫల్యాలపై ప్రతిపక్షం కంటే ఎక్కువగా అధికార పార్టీ నాయకులు గళమెత్తడం చర్చనీయాంశమవుతోంది. పైగా… అసంత్రుప్తి స్వరం వినిపిస్తున్న వాళ్ళంతా సీనియర్సే కావడంతో..…
ఏపీ పాలిటిక్స్‌లో తాజా ట్రెండింగ్ లీడర్... వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని, ఇక తాను వ్యవసాయం చేసుకుంటానని చెప్పి వెళ్లిపోయాక... కాకినాడ పోర్టు కేసులో ఆయన ఏ2 గా కేసు ఫైల్ అయింది.
వైసీపీ పాలనలో అడ్డమైన కేసులతో అష్టకష్టాలు పడ్డామని చెబుతుంటారు ఉమ్మడి చిత్తూరు జిల్లా టిడిపి లీడర్స్ అండ్ కేడర్.అక్రమ కేసులతో ఊళ్ళు విడిచి వెళ్ళిన వాళ్ళు సైతం ఉన్నారని అంటారు. కానీ... ఇప్పుడు ప్రభుత్వం మారినా, మా పరిస్థితి మాత్రం మారలేదు. ఏంటీ ఖర్మ మాకు అంటూ తలలు పట్టుకుంటున్నారట తమ్ముళ్ళు. మరీ ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ కేడర్ బాధ అంతా ఇంతా కాదని అంటున్నారు.
పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం.. వరుసగా మూడోసారి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మంత్రి నిమ్మల రామానాయుడు. మినిస్టర్‌గా రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో హవా నడిపిస్తున్నా... సొంత సెగ్మెంట్లో మాత్రం.... ఇంట్లో ఈగల మోత అన్నట్టుగా తయారైందట ఆయన పరిస్థితి.
తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కొత్త భయం పట్టుకుందా? వాళ్ళు….. పార్టీ పెద్దల్ని టెన్షన్ పెడుతున్నారా? నిఖార్సయిన మాట మాట్లాడుకోవాలంటే… ముచ్చెమటలు పట్టిస్తున్నారా? ప్రతిపక్షం కామ్‌గా ఉన్న విషయాల్ని కూడా కెలికిపారేస్తున్నార్రా… బాబూ… మనమేం చేయాలి? ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటూ పసుపు ముఖ్యులు తలలు పట్టుకుంటున్నారా? ఇంతకీ… ఎవరు వాళ్ళు? వాళ్ళకు టీడీపీ అధిష్టానం ఎందుకు భయపడుతోంది? తెలుగుదేశం పార్టీకి ఇప్పుడో కొత్త టెన్షన్ పట్టుకుందట. మా పని మమ్మల్ని చేసుకోనివ్వడం లేదు. డేయ్…. ఎవర్రా మీరంతా అంటూ….…
అక్కడ కూటమిలో కుంపట్లు రగులుకుంటున్నాయా? నా నియోజకవర్గంలో మీ పెత్తనం ఏంటని తెలుగుదేశం నాయకుల మీద జనసేన ఎమ్మెల్యే ఫైరై పోతున్నారా? అక్కడి టీడీపీ లీడర్స్ పరిస్థితి కూడా తేలుకుట్టిన దొంగల్లా అయిపోయిందా? ఏదా అసెంబ్లీ నియోజకవర్గం? ఏ విషయంలో తేడా కొట్టింది రెండు పార్టీల మధ్య? కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య గ్యాప్ పెరుగుతోందా? అంటే…. వాతావరణం పూర్తిగా అలాగే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ…
అక్కడ కారు ఫుల్ కండిషన్లో ఉందట. కానీ…. నడిపేందుకు డ్రైవర్ మాత్రం లేడు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారన్న ఎదురు చూపులతోనే సరిపోతోంది కేడర్‌కు. ప్రస్తుతానికి క్రైసిస్ టైం అయినా… భవిష్యత్ బాగుంటుందని కార్యకర్తలు నమ్మకంతో ఉంటే… వాళ్ళని నడపాల్సిన నాయకులు మాత్రం అడ్రస్లేరు. ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎందుకలా జరుగుతుతోంది? నడిగడ్డ ప్రాంతంగా చెప్పుకునే గద్వాల రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటుంది. 2014 ఎన్నికల వరకు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీకి పంపగా…
మనం సీన్లో అన్నా ఉండాలి, లేదా సినిమా మొత్తం మన చుట్టూనే తిరుగుతూ ఉండాలని ఆ సీనియర్ ఐఎఎస్ అనుకుంటున్నారా? అందుకే అనవసరమైన వివాదాల్ని కెలుక్కుని మరీ తెర మీద ఉండే ప్రయత్నం చేస్తున్నారా? ప్రతి సందర్భంలో ఆమె అత్యుత్సాహం ఏదో ఒక వివాదానికి దారి తీస్తోందా? తన పోస్ట్‌కు తగ్గ హుందాతనాన్ని ప్రదర్శించడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్న ఆ ఐఎఎస్ ఎవరు? ఏంటా వ్యవహారం? స్మితా సభర్వాల్…. సీనియర్ ఐఏఎస్. బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు…
ఏపీలో లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గర నిజంగానే ఆధారాలు ఉన్నాయా? ఉంటే… ఆయన సిట్ విచారణకు ఎందుకు డుమ్మా కొట్టారు? మీరు అడిగినదానికంటే ఒక రోజు ముందే వస్తా… నిజాలన్నీ చెప్పేస్తా… కాస్కోండి… అంటూ ఓ వీరలెవల్లో స్టేట్మెంట్ ఇచ్చేసిన సాయి ఎందుకు వెనక్కి తగ్గారు? ఆయనది వైసీపీని టెన్షన్ పెట్టాలన్న ఉద్దేశ్యమా? లేక నిజంగానే విషయం ఉందా? లేక సడన్ షాకివ్వడానికి ప్లాన్ చేస్తున్నారా? ఏపీ లిక్కర్ స్కామ్‌లో వాట్ నెక్స్ట్?…
ఆ సీనియర్ లీడర్ భయపెట్టి బర్త్ డే విషెస్ చెప్పించుకున్నారా? ఎమోషన్స్‌ని టచ్ చేసి… ఎందుకొచ్చిన గొడవ అనుకునే చేసి…శుభాకాంక్షలు చెప్పించుకున్నారా? పక్క పార్టీ వాళ్ళతో పోలిక పెట్టిమరీ… తన పార్టీ లీడర్స్ ఎక్స్‌లో హోరెత్తించేలా చేసుకున్నారా? ఎవరా లీడర్? ఏంటా బర్త్ డే మేటర్? మంగళవారంనాడు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పుట్టినరోజు. సహజంగానే పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు తెలిపారు. డైరెక్ట్‌గా కలిసినవాళ్ళు కొందరైతే…. సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పిన…