తుంగతుర్తి కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకటి ఎమ్మెల్యే మందుల సామేల్ వెంట ఉంటే.. మరొక వర్గం జిల్లా సీనియర్ నేతల వెంట నడుస్తోందన్నది ఓపెన్ టాక్. కొంత కాలంగా రెండు వర్గాల క్యాడర్ మధ్య మాటలు పేలుతున్నాయి.
అంతన్నాడింతన్నాడు.. అంతే లేకుండా పోయాడు. ఈసారి నేను ఓడిపోతే... మీసం తీసేసుకుంటానంటూ.. మెలేసి మరీ ఒట్టేశాడు. ఇప్పుడు మీసం సంగతి దేవుడెరుగు.. అసలు మనిషే కనిపించకుండా మాయమైపోయాడంటూ.... రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారట నియోజకవర్గంలో.
లోక్సభ సభ్యుడు.... తన నియోజక వర్గంలో ఎక్కడైనా సరే.. ఎమ్మెల్యేలకు ముందస్తు సమాచారం ఇచ్చి తిరగొచ్చు. సొంత పార్టీ ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా చెప్పాలి. ఉద్దేశ్యపూర్వకంగా గొడవ పెట్టుకోవాలనుకుంటే తప్ప.. సాధారణంగా లొల్లి ఎందుకులే అనుకుంటూ అందర్నీ కలుపుకుని పోతుంటారు ఎంపీలు. కానీ.... నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవికి ఇప్పుడో చిక్కొచ్చి పడిందట.
కాకినాడ జిల్లా జగ్గంపేట కూటమిలో అగ్గి అంటుకోవడమే కాదు.... అది భగభగ మండే స్థాయికి వెళ్తున్నట్టు కనిపిస్తోంది. టీడీపీ, జనసేన నాయకులు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయికి వెళ్ళడమేకాకుండా... వీధి పోరాటాలకు సిద్ధమవడం కలకలం రేపుతోంది.
ఆరిణి శ్రీనివాసులు... తిరుపతి ఎమ్మెల్యే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషంలో జనసేన టిక్కెట్ తెచ్చుకుని భారీ మెజారిటీతో గెలిచారాయన. ఎన్నికలకు ముందు వరకు వైసిపి ఎమ్మెల్యేగా ఉన్న ఆరిణికి టిక్కెట్ ఇవ్వడాన్ని తిరుపతి టిడిపి జనసేన నేతలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. అయినాసరే... ఫైనల్గా ఆయనకే ఖరారు చేశారు పవన్కళ్యాణ్.
అసలు రాజకీయాల్లోకి వచ్చిన కారణంగానే ఈ ఆర్థిక సమస్యలు వచ్చానన్నది మాజీ ఎంపీ మనసులోని మాటగా ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో ఆర్థికంగా బాగా భరించాల్సి రావడం, ఆ తరువాత కూడా 2024 ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక భారం పడడంతోనే ఇబ్బందులు మొదలయ్యాయట. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఆమెను కొనసాగించకపోవచ్చన్న టాక్ నడుస్తోంది నియోజకవర్గంలో.
ఆరెస్సెస్ పెద్దల్ని ప్రసన్నం చేసుకుంటే కమలం పార్టీలో పదవులు చాలా ఈజీగా వస్తాయన్న ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. అదే అభిప్రాయంతో...బీజేపీ లీడర్స్ చాలామంది సంఘ్ ఆఫీసులకు క్యూ కడుతుంటారు కూడా. అయితే... ఇటీవలి కాలంలో ఇది మరీ శృతిమించిపోయిందని, నిన్నగాక మొన్న పార్టీ వేరే పార్టీలనుంచి బీజేపీలోకి మారిన వాళ్ళు కూడా మాకు పదవులు అంటూ తలుపు తడుతుండటం ఆర్ఎస్ఎస్ నేతలకు చిరాకు తెప్పిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
సీనియర్ ఐఏఎస్ అయిన స్మితాసభర్వాల్ ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నట్లుగానే భావిస్తున్నారని, కాంగ్రెస్ సర్కార్తో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని మంత్రులు కూడా అంటున్నారు. పర్యాటక శాఖలో ఫైల్స్ అన్నీ పెండింగులోనే పెట్టారని... సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ కు సైతం రెగ్యులర్గా రావడంలేని ఉద్యోగులే చెప్పుకుంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చల అంశాన్ని లీడ్ చేయాలని చూస్తోందా..? కేంద్రం ఇప్పటికే ఏరివేతలో బిజీగా ఉంటే... కాంగ్రెస్ ఇప్పుడు చర్చల మాట ఎందుకు మాట్లాడుతోంది? టార్గెట్ పెట్టి మరీ... కేంద్ర బలగాలు మావోయిస్టులను ఏరిపారేస్తున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వ మాటలు చెవికెక్కుతాయా? కేంద్రం తగ్గుతుందా..? గత అనుభవం అధిష్ఠానం పరిశీలనలో ఉందా..
బీఆర్ఎస్ అధిష్టానం దేన్నుంచో తప్పించుకోబోయి… ఇంకెక్కడో ఇరుక్కుపోయిందా? హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక పార్టీని ఇరికించేసిందా? ఇప్పుడు గులాబీ పార్టీకి కొత్తగా వచ్చిన ఇబ్బంది ఏంటి? దాని గురించి అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఏంటి? హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ముగిసినా… పొలిటికల్ ప్రకంపనలు మాత్రం రేగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ వైఖరి చర్చనీయాంశమైంది. ఈ ఎన్నికలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లే ప్రధాన ఓటర్లు. ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఈ స్థానం నుంచి…