ఊరు మారినా… తీరు మారలేదన్నట్టుగా ఆ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఉందా? ఉన్న పార్టీని కాదని అధికార కూటమివైపు జంప్ చేసినా… ఆశించిన ప్రయోజనం మాత్రం దక్కలేదా? అసలెందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాను రా… బాబూ… తప్పుచేశానా అని ఇప్పుడు తెగ ఫీలైపోతున్నారా? ఎవరా మాజీ సీనియర్ ఎమ్మెల్యే? ఆయన నైరాశ్యానికి కారణాలేంటి? ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు సామినేని ఉదయభాను. రెండు విడతలు కాంగ్రెస్, మూడు…
తెలంగాణ కాంగ్రెస్‌లో తల పండిన నాయకులు కూడా మాట్లాడలేని మాటల్ని ఆ యువ ఎమ్మెల్యే ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఏకంగా పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా… మాటల తూటాలు పేల్చడం ఆయన నైజమా? లేక వ్యూహమా? అదీ.. ఇదీ.. కాకుండా ఎవరో వేస్తున్న తాళానికి ఈయన రాగం ఆలపిస్తున్నారా? పార్టీని అంతలా ఇరుకున పెడుతున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? పదే పదే ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు? జనంపల్లి అనిరుథ్‌రెడ్డి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా… జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే.…
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె, పార్టీ ఎమ్మెల్సీ కవిత మాటలు, చేతలు ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్. ఇంటా బయటా రకరకాల ఇబ్బందులతో సతమతం అవుతున్నారామె. అది స్వయంకృతమా? లేక పరిస్థితుల ప్రభావమా అన్న విషయాన్ని పక్కనబెడితే.. ప్రస్తుతం తన సమస్యలకు విరుగుడు కనుక్కునే పనిలో బిజీగా ఉన్నారట కవిత.
బీజేపీకి రాజీనామా చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ.. రాష్ట్ర కార్యాలయంలో.. నేతల ముఖం మీదే చెప్పేసి వెళ్ళిపోయారాయన. అటు నాయకత్వం కూడా.. ఆయన క్రమశిక్షణారాహిత్యం పరాకాష్టకు చేరిందని ప్రకటించింది.
ఫైళ్ళ క్లియరెన్స్ విషయంలో మంత్రికి, ముఖ్య కార్యదర్శికి మధ్య విభేదాలు ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలో హాట్ టాపిక్ అయ్యాయి. మంత్రి తీసుకున్న నిర్ణయాలు రూల్స్‌కు అనుగుణంగా ఉంటే...సంబంధిత శాఖ కార్యదర్శి వాటిని అమలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ విరుద్ధంగా ఉంటే మాత్రం సరైన సలహాలు ఇచ్చి సవరించుకునే విధానాన్ని వివరించాలి. ఇక్కడే మంత్రి కొండా సురేఖకు, తన శాఖ పరిధిలోని ఓ ముఖ్య కార్యదర్శి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకున్నట్లు సమాచారం.
వనపర్తి డీసీసీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ పెరిగింది. ఏకంగా అరడజన్ మంది ఆశావహులు జిల్లా కాంగ్రెస్ పీఠంపై కన్నేసి గాంధీభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. రాష్ట్ర మంత్రులు ఇద్దరి నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలున్న వనపర్తి డిసిసి పీఠం కోసం ఒకరకంగా హోరాహోరీ పొలిటికల్ పోరు నడుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
అధికారం కోల్పోయాక బీఆర్ఎస్లో సంక్షోభం.. ఒకవైపు సొంత కూతురు ధిక్కార స్వరం, మరోవైపు మేనల్లుడు హరీష్‌రావు అలక. ఇంకోవైపు కాళేశ్వరం కమిషన్ నోటీసులు, కొడుకు కేటీఆర్ ఏసీబీ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు.. ఇలా ఎటు చూసినా కేసీఆర్‌కు ఇబ్బందికర పరిస్థితులే. ఆయనకున్న నమ్మకాల కోణంలో చెప్పాలంటే.. గ్రహాలు కలిసిరాలేదు.
తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు బనకచర్ల పొలిటికల్ హాట్ టాపిక్. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఒకే తాను ముక్కలుగా అభివర్ణిస్తూ.. ఇద్దర్నీ ఏక కాలంలో టార్గెట్ చేస్తోంది తెలంగాణ ప్రతిపక్షం బీఆర్ఎస్.
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ.. తమ పొలిటికల్ గాడ్ ఫాదర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. కార్పొరేషన్ ఛైర్మన్, డీసీసీ అధ్యక్ష పదవుల రేసులో నిలిచినా.. వీళ్ళకు ఆ ఒక్కటి అడ్డొస్తోందట. ఎక్కడికెళ్లినా ఆ తప్పునే గుర్తు చేస్తూ.. ఇద్దరికీ పదవులు రాకుండా అడ్డుపడుతున్నారట సీనియర్ కాంగ్రెస్ నాయకులు.
మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వ విప్‌గా పనిచేసిన అడ్లూరి లక్ష్మణ్ కేబినెట్ మంత్రి అయ్యారు. రాంచంద్రు నాయక్‌ని డిప్యూటీ స్పీకర్‌ని చేస్తామని ప్రకటించేశారు పార్టీ పెద్దలు. ఈ క్రమంలో... ప్రభుత్వ విప్ల నియామకంపై ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. విప్ పదవుల భర్తీకి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పూర్తి స్థాయిలో కసరత్తు మొదలుపెట్టిన క్రమంలో.. పార్టీ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది.