Off The Record : మార్వాడి గో బ్యాక్ వెనుక అదృశ్య శక్తి..?
- మార్వాడీ గో బ్యాక్ నినాదంతో అడ్డగోలు వాదనలు
- ఎక్కడ మొదలైంది? ఎవరికి లాభం అన్న చర్చలు
- బహిరంగంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, బీజేపీ
- మాకు సంబంధం లేదన్నట్టుగా ఉన్న బీఆర్‌ఎస్
- గుర్తింపు కోసం రాజకీయ నిరుద్యోగులు చేస్తున్న పనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్వాడీ గో బ్యాక్ నినాదం వెనుక కుట్ర ఉందా? అదృశ్య శక్తులేవో వెనకుండి… కావాలని రెచ్చగొడుతున్నాయా? ఎవరో ఏదో.. ఆశించి హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో మంట పెడుతున్నారా? ఏవో వ్యక్తిగత వివాదాలకు పొలిటికల్ కలర్ పులిమేసి సెంటిమెంట్‌ని రగిల్చే ప్రయత్నం చేస్తున్నారా? అసలీ విషయంలో ప్రధాన రాజకీయ పార్టీల వైఖరేంటి? తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ నినాదం ప్రకంపనలు రేపుతోంది. దీని మీద సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. తాము మాట్లాడుతున్నది సహేతుకమా? అహేతుకమా? అన్న దాంతో సంబంధం లేకుండా..ఎవరికి తోచిన వ్యాఖ్యలు వారు చేస్తూ… ఎగదోస్తున్నారు.
దీంతో… అసలీ వివాదం ఎక్కడ మొదలైంది? ఎందుకు పెరుగుతోంది? దీనివల్ల ఎవరికి లాభం? హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఇలాంటి వివాదాలు పురుడుపోసుకోవడం మేలు చేస్తుందా, కీడు చేస్తుందా అన్న చర్చలు నడుస్తున్నాయి వివిధ వర్గాల్లో. ప్రధాన రాజకీయ పార్టీలేవీ ఈ మార్వాడీ గో బ్యాక్ నినాదాన్ని సమర్ధించడం లేదు. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అయితే… దీన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. బీఆర్‌ఎస్ కూడా అదసలు తమకు సంబంధం లేని వ్యవహారంగా చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి దీని మీద ఎవరికి ఇంట్రస్ట్ ఉంది? ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారని అంటే… అదంతా రాజకీయ నిరుద్యోగుల పని అన్న సమాధానం వస్తోంది.
Also Read
ఇలాంటి లేనిపోని వివాదాలను రేకెత్తించి…తాము క్లిక్ అవ్వాలని అనుకుంటున్నారట కొందరు. అలాంటి వాళ్ళు సక్సెస్ కారని. ఒకరకంగా అది హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర అంటూ సరికొత్త వాదనను తెర మీదికి తెస్తున్నాయి హిందూ సంస్థలు. దీనికి మొదట్లోనే చెక్ పెట్టకుండా ఇలాగే కొనసాగనిస్తే…. హైదరాబాద్ మీద పెను ప్రభావం చూపెడుతుందన్న అభిప్రాయాలు సైతం బలంగా ఉన్నాయి. గంగా జమునా తెహజీబ్ లెక్క… అంతా కలిసి మెలిసి ఉంటున్నారని, ఇప్పుడు దానికి విఘాతం కలిగితే… శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని కూడా అంటున్నారు కొందరు.
మార్వాడీలు అయినా… మరే సమాజానికి చెందిన వారు అయినా… తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు ఉండాలే తప్ప… ఇలా మూకుమ్మడిగా గో బ్యాక్ నినాదం అందుకుంటే… మహా నగరాల్లో ఎలా సాధ్యమన్న ప్రశ్న వస్తోంది. వ్యక్తిగత గొడవకు రాజకీయ రంగు పులిమి దాన్ని ఓ సెంటిమెంట్‌గా మార్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సరికాదని అంటున్నారు విశ్లేషకులు. అసలీ గో బ్యాక్ నినాదం… ఏదో ఆషామాషీగా చేసింది కాదని, దీని వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయని, అర్బన్ నక్సల్స్ పాత్ర కూడా ఉందంటూ ఇటు బీజేపీతో పాటు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. చినికి చినికి గాలి వానగా మారక ముందే ఈ ఇష్యూకు ఫుల్ స్టాప్ పెట్టకుంటే… హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి కొన్ని వర్గాలు.
- Tags
- marwadi Row
- NTV Telugu
- OTR
తాజావార్తలు
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
-
US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..
-
Pulivendula Chicken Centre Fire: పులివెందులలో చికెన్ సెంటర్‌కు నిప్పు.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!