సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా టూర్స్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. నెత్తిన నోరుంటే పెత్తనం సాగుతుందనుకున్న నేతలకు... ఇప్పుడు కాలం కలిసి రావట్లేదా అంటూ వ్యంగ్యంగా మాట్లాడేసుకుంటున్నారు హాస్తం పార్టీలోని కొందరు నేతలు.
పోలీసింగ్‌లో వరంగల్‌కు ఒక స్పెషల్ స్టేటస్ ఉంది. అలాంటి పోలీసులు ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారట. బదిలీలు, సస్పెన్షన్లు, మెమోలతో హడలిపోతున్నారు. అది కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోనే జరగడం ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ మంత్రులు ఒకరిద్దరు మీడియా ముందు మాట్లాడుతున్న కొన్ని విషయాలు కాస్త రచ్చకు దారితీస్తున్నాయి. తమ శాఖలకు సంబంధం లేని విషయాల విషయాల గురించి కూడా కామెంట్స్ చేస్తుండటంతో.. మిగిలిన మంత్రులు నొచ్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ నాయకత్వానికి, ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జ్కు కూడా చెప్పుకున్నారట. ప్రభుత్వ పథకాలపై మంత్రుల కామెంట్స్‌తో చాలా రోజులుగా గందరగోళం పెరుగుతోంది.
ఏడాదిన్నర టైం ఇచ్చినా.. వీళ్ళలో మార్పు లేదు, ఇకమీదట కూడా అలాగే ఉంటే కుదరదని అనుకున్నారో, లేదంటే లేటెస్ట్ ఢిల్లీ టూర్లో పార్టీ పెద్దలతో రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో క్లారిటీ వచ్చిందోగానీ.. ఈసారి హస్తిన ఫ్లైట్ దిగినప్పటి నుంచి ముఖ్యమంత్రిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఆయన కాన్ఫిడెంట్‌గా అడుగులేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. ఇక, ఉత్సాహం ఆపుకోలేని కొందరు కాంగ్రెస్ నాయకులైతే.
సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అత్యంత కీలకమమైన అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో ఒకటి జూబ్లీహిల్స్. 2009లో ఏర్పడ్డ ఈ నియోజకవర్గానికి ఇప్పటికి మూడు సార్లు ఎన్నికలు జరగ్గా... మొత్తం మూడు సార్లూ ఎమ్మెల్యేగా గెలిచారు మాగంటి గోపీనాథ్. టీడీపీ, బీఆర్ఎస్ తరపున ప్రాతినిధ్యం వహించారాయన.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. పల్నాడు జిల్లా మాచర్ల నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మొదట కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయినా... వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ చెంత చేరారాయన. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి మాటకు తిరుగులేదన్నట్టుగా ఉండేది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి చేతిలో ఓడిపోయారు పిన్నెల్లి.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద పలాస రాజకీయాలు కాస్త తేడాగా ఉంటాయని చెప్పుకుంటారు. అందుకు తగ్గట్టే.... అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లా అంతా ప్రశాంతంగా ఉంటే... పలాసలో మాత్రం రాజకీయ కొలిమి రగులుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు పొలిటికల్ సెగలు పెరిగిపోతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో మంటెక్కిస్తున్నారు నేతలు.
మాజీ మంత్రి చిన్నారెడ్డిని కాదని మేఘారెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం, ఆయన గెలవడంతో ముసలం మొదలైందంటున్నారు. ఆ తర్వాత చిన్నారెడ్డికి రాష్ట్ర ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టినా.... ఆయన మాత్రం నియోజక వర్గానికే పరిమితం కావడంతో ప్రోటోకాల్ సమస్యతో పాటు వర్గపోరు ముదిరి పాకాన పడిందని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగం పెంచారు తెలంగాణ అధికారులు. ప్రభాకర్‌రావు విచారణ కొనసాగుతున్న క్రమంలో... ఇక ఏ మాత్రం ఆలస్యం కానివ్వకూడదని భావిస్తోందట ప్రభుత్వం. అటు బాధితులు...ఇటు సాక్షులను విచారిస్తోంది సిట్ బృందం.
దేవాదాయ శాఖ ఉద్యోగుల బదిలీలు అక్కడ కూటమిలో కుంపట్లు పెట్టాయా? మా మాటకు విలువే లేకుండా పోయిందని జనసేన, బీజేపీ శాసనసభ్యులు రగిలిపోతున్నారా? కేవలం టీడీపీ అనుకూలురకే మేళ్ళు జరిగాయన్నది నిజమేనా? లక్షలకు లక్షలు చేతులు మారాయన్న ఆరోపణలు ఎందుకు వచ్చాయి? అసలా బదిలీల బాగోతం ఏంటి? ఎక్కడ జరిగింది? ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దేవాదాయ శాఖ ఉద్యోగుల బదిలీలు… కూటమిలో చిచ్చు రేపుతున్నాయట. తమ సిఫారసు లేఖలను అస్సలు పట్టించుకోవండ లేదంటూ…. జిల్లాకు చెందిన…