పేరెంట్ డిపార్ట్మెంట్ వద్దు... పక్క శాఖ ముద్దు అంటున్నారా మహిళా అధికారి. తన సొంత శాఖకు ప్రమోషన్ ఇచ్చి పొమ్మన్నా పట్టించుకోకుండా ఆలయ ఈవోగానే కొనసాగేందుకు ఇష్టపడుతున్నారు. ప్రత్యేకించి ఓ ప్రముఖ ఆలయ అధికారిగా ఉండేందుకు చివరిదాకా విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమైన ఆ అధికారి ఎవరు?
తెలంగాణ ప్రభుత్వంలో ఏదీ దాగే పరిస్థితి లేదా? దాచాలంటే దాగదులే... దాగుడు మూతలు చెల్లవులే అన్నట్టుగా ఉందా వ్యవహారం? అత్యంత కీలకమైనది, టాప్ సీక్రెట్ అనుకున్న రిపోర్ట్ కూడా ప్రతిపక్షం చేతికి అందిందా? లీకు వీరులు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారా?
ఐఎఎస్ శ్రీలక్ష్మిని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే భూమన ఆ స్థాయిలో ఎందుకు మాట్లాడారు? పైగా తమ పార్టీ అనుకూల ముద్ర ఉన్న ఆఫీసర్ని రాక్షసులతో పోల్చడానికి బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? ఆమెను టార్గెట్ చేసి ఇంకెవరికో సందేశం పంపాలనుకున్నారా? చివరికి చీరలు, విగ్గులు అంటూ…. వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేయడం వెనకున్న వ్యూహం ఏంటి? మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ లీడర్ భూమన కరుణాకర్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి మీద చేసిన ఆరోపణలు రాజకీయంగా… పెను…
కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ సర్కార్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? అసెంబ్లీలో చర్చించాక తదుపరి చర్యల మాటేంటి? ఏ తరహా ఎంక్వైరీ వేయబోతోంది? దర్యాప్తు అధికారాన్ని తన పరిధిలోనే ఉంచుకుంటుందా? లేక బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టు సీబీఐకి అప్పగిస్తుందా?
ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడి పేషీలో అరాచకాలు జరిగిపోతున్నాయా? వాటన్నిటికీ కారణం ఒకే ఒక్కడా? విషయం తెలిసినా, ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నా... మంత్రి ఆయన్ని ఎందుకు పక్కన పెట్టలేకపోతున్నారు? ఇద్దరి మధ్య అంత అనుబంధం ఏంటి? పైగా అచ్చెన్నాయుడు ఈ విడత మంత్రి అయ్యాక సదరు వ్యక్తిని ఏరికోరి పేషీలోకి తెచ్చుకున్నారన్నది నిజమేనా?
ఆ నియోజకవర్గంలో కోల్డ్ వార్ ఓపెనైపోతోందా? ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా అగ్గి అంటుకుందా? ఎమ్మెల్యే క్లియర్‌గా, క్లారిటీగా చెప్పిన తాజా మాటలు కేవలలం ఎంపీకేనా? లేక అక్కడ పట్టున్న కాంగ్రెస్ సీనియర్స్ అందరికీనా? ఎవరా ఇద్దరు ప్రజాప్రతినిధులు?
అక్కడ అంతా మేడమ్ ఇష్టమేనా? నేను మోనార్క్‌ని.... గిల్లితే గిల్లించుకోవాలి, గిచ్చితే గిచ్చించుకోవాలని అంటున్నారా? పార్టీ నిర్ణయాలతో పని లేకుండా... తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా... నేను చెప్పిన వాళ్ళే కార్పొరేటర్స్ అవుతారని అంటున్న ఆ తెలుగుదేశం ఎమ్మెల్యే ఎవరు?
తెలంగాణలో కమలం కట్టు తప్పుతోందా? క్రమ శిక్షణకు కేరాఫ్ అని చెప్పుకునే పార్టీలో ఇక అది భూతద్దం పెట్టి వెదికినా కనిపించే అవకాశాలు ఉండవా? పార్టీ పెద్దలే అందుకు ఊతం ఇస్తున్నారా? దారిన పెట్టాల్సి వాళ్ళే గాడి తప్పుతున్నారా? రాష్ట్ర పార్టీలో అసలేం జరుగుతోంది? తెలంగాణ బీజేపీలో అంతర్గత రచ్చ... అంతకంతకూ పెరుగుతూనే ఉంది.