సైలెన్స్ వీడిన ధర్మాన.. కేడర్ లో ఉత్చాహం.. ఇదే ఊపు కొనసాగిస్తారా.. మరలా సైలెంట్ మోడ్ లోకి జారుకుంటారా.. ఇదే అంశం నేడు జిల్లా పార్టీలో ఆశక్తికర చర్చగా మారిందట. ఇంతకీ ఎవరా నేత. వైసీపీ అధికారంలో ఉండగా మంత్రిగా శ్రీకాకుళం జిల్లాలో అంతా తానై వ్యవహరించిన ధర్మాన ప్రసాద రావు…కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యక్రమాలతో అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. ఈమధ్య మళ్లీ జిల్లా పార్టీ ప్రోగ్రామ్స్‌లో యాక్టివ్‌గా కనిపిస్తుండటంతో, అసలేం జరిగింది? మళ్లీ ఎందుకు యాక్టివ్…
కండువాలు మార్చారు. పార్టీలు మారారు. క్యాడర్‌ను తీసుకెళ్లారు. ఏకంగా పార్టీ ఆఫీసును కూడా లాగేసుకున్నారు. పార్టీ జెండా మార్చినంత ఈజీగా పార్టీ ఆఫీసు భవనం రంగులూ మార్చేశారు. ఇప్పుడు ఈ భవనం చుట్టూ పినపాక నియోజకవర్గంలో దండయాత్రలు, ఎదురుదాడులు, ఆక్రమణల పర్వం పీక్ లెవల్‌కు చేరింది. భద్రాద్రి జిల్లా పినపాక నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం పేరుతో మహా రంజుగా రాజకీయం సాగుతోంది. పోటాపోటీగా నేతల చర్యలు…సూటిపోటీ మాటలు అగ్గిరాజేస్తున్నాయి. భద్రాద్రి జిల్లాలోని పినపాక నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే…
జాగృతి అధ్యక్షురాలు కవిత స్వరం మార్చారా....ఇన్నాళ్లు పరోక్షంగా బీఆర్ఎస్ను...ప్రత్యక్షంగా అదే పార్టీ ముఖ్య నేతలను తిట్టిన కవిత...ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారా? ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో కవిత చేసిన వ్యాఖ్యలకు అర్థమేంటి?
ఎన్నికల టైంలో ఎమ్మెల్యే అభ్యర్థులను అటుఇటు మార్చింది వైసీపీ. తమది కాని నియోజకవర్గంలో వున్న నేతలు అన్యమనస్కంగానే వున్నారు. పేరుకు ఇంఛార్జ్ పదవిలో వున్నా…ఎలాంటి ఛార్జింగ్ లేకుండా సైలెంటయ్యారు. అందుకే వైసీపీ అధినేత జగన్ ప్రక్షాళనకు సిద్దమయ్యారా? ఎవరూ ఊహించనిరీతిలో నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ అయ్యారా? ఇంఛార్జ్‌ల మార్పులపై కొందరు నేతల్లో అప్పుడే అలజడి మొదలైందా? ఎన్నికల తర్వాత పార్టీపైనే ఫుల్ ఫోకస్ చేసిన వైసీపీ అధినేత జగన్…ఈ ఏడాదిన్నర కాలంలో పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన…
ఒక లక్ష్యం…రెండు అస్త్రాలు..జూబ్లీహిల్స్ ఎన్నికల రణంలో కీలక ఆయుధాలపై ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్. అవే తమకు విజయ తిలకం దిద్దుతాయని లెక్కలేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్…అన్ని రకాలుగా పైచేయి సాధించే పనిలో పడింది. క్యాబినెట్లో ఉన్న మంత్రులంతా ప్రచారంలో మునిగితేలుతున్నారు. తమకు కలిసొచ్చే ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలేయకుండా అందిపుచ్చుకునే పనిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో సామ దాన భేద దండోపాయాలన్నిటినీ ప్రయోగిస్తోంది. ప్రభుత్వం ఏం చేసిందని అడిగే వాళ్లకు……
హైడ్రాలో కోవర్టులు ఉన్నారా..? లేదంటే ఎప్పుడేం చెయ్యాలో తెలీక సర్కార్‌ను ఇబ్బందిపెడుతున్నారా? కూల్చివేతలను పర్యవేక్షించేవారికి ప్లానింగ్ లేదా? జగ్గారెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు రేపుతున్న ప్రకంపనలేంటి? కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు. హైడ్రాలో బీఆర్ఎస్కు అనుకూలంగా… కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే అధికారులు ఉన్నారంటూ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్య ఆయన ఆషామాషీగా చేసి ఉండరు. ఎందుకంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సహజంగానే ఇలాంటి అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ప్రభావం ఎంత? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ డిపాజిట్ కూడా దక్కని పార్టీ… లోక్‌సభ ఎన్నికల నాటికి అనూహ్యంగా పుంజుకోవడాన్ని ఎలా చూడాలి? అసెంబ్లీకి ఒకలా, పార్లమెంట్‌కు మరోలా తీర్పునిచ్చిన ఓటర్ల మైండ్‌సెట్ ఈసారి ఎలా ఉండబోతోంది? ఆ విషయంలో కాషాయదళం ధీమా ఏంటి? జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి. కానీ… ఇప్పటిదాకా ఎప్పుడూ భారీగా పోలింగ్ నమోదైన దాఖలాలు లేవు. 50 శాతానికి కాస్త…
జూబ్లీహిల్స్ బై పోల్‌లో బీఆర్ఎస్ స్ట్రాటజీ మారుతోందా? ఓటర్లకు దగ్గరవడానికి కొత్త కొత్త ఎత్తులు వేస్తోందా? పోటీలో లేని ఓ రెండు ప్రధాన రాజకీయ పార్టీల సానుభూతిపరుల్ని తనవైపునకు తిప్పుకునే స్కెచ్ వేసిందా? ఆ దిశగా వర్కౌట్ చేయడం కూడా మొదలైపోయిందా? అసలు కారు పార్టీ కొత్త ప్లాన్ ఏంటి? వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీటును తిరిగి నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎలాగైనా గెలిచి తీరాలన్న యాంగిల్లో రకరకాల స్కెచ్‌లు…
ఆ నియోజకవర్గ హస్తం పార్టీలో నేతల చేతులు కలవడం లేదు. ఇక మనసులు, మాటల గురించి అయితే చెప్పే పనేలేదు. సర్ది చెప్పాల్సిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఓ వర్గాన్ని సపోర్ట్ చేస్తూ… అగ్గికి ఆజ్యం పోస్తున్నారట. రెండు వర్గాలు వేర్వేరుగా మీటింగ్స్ పెట్టుకుంటే రెండు చోట్లకు వెళ్తున్న ఆ మంత్రివర్యులు ఎవరు? ఏ జిల్లాలో, ఎందుకా పరిస్థితి వచ్చింది? సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకప్పుడు టిడిపి హవా కొనసాగగా… ఆ తర్వాత…
ఏపీ స్థానిక ఎన్నికల్లో పోటీ విషయమై వైసీపీలో అంతర్మథనం జరుగుతోందా? బరిలో ఉండే విషయమై పార్టీలో ఏకాభిప్రాయం లేదా? అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి సంకేతాలు రాకున్నా… కింది స్థాయిలో మాత్రం కంగారు పడుతున్నారన్నది నిజమేనా? ఎందుకా కంగారు? లోకల్ బాడీస్ ఎలక్షన్స్‌లో పోటీ విషయమై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? షెడ్యూల్ ప్రకారం వచ్చే మార్చిలో ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎలక్షన్స్‌లో ప్రతిపక్షం వైసీపీ పోటీ చేస్తుందా లేదా అన్న…