Telangana Stood No 1 In Organ Donation Says Swarnalatha: అవయవదానంలో దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రమే అగ్రస్థానంలో ఉందని ‘జీవన్‌దాన్’ ఇంఛార్జ్ స్వర్ణలత స్పష్టం చేశారు. జీవన్‌దాన్ పదేళ్లు పూర్తి చేసుకుందని, ఈ దశాబ్ది కాలంలో దాదాపుగా 5 వేల అవయవాలు దానం చేశామని తెలిపారు. లైవ్, కెడవర్ డొనేషన్‌లో మనమే టాప్‌లో ఉన్నామని చెప్పారు. జీవన్‌దాన్ అత్యధికంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిర్వహిస్తోందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు జరుగుతున్నాయని వెల్లడించారు. 2013 నుంచి ఇప్పటివరకు కేడావర్ ట్రాన్స్ ప్లాంటేషన్లు 4721 నిర్వహించగా.. లైవ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ 4938 మందికి నిర్వహించామని క్లారిటీ ఇచ్చారు.
Mallu Ravi: ధరణిపై చర్చకు సిద్ధమా.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మల్లురవి సవాల్
అవయవదానం సర్జరీలు ప్రభుత్వ ఆసుపత్రులైన గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లలో నిర్వహించడం జరుగుతోందని స్వర్ణలత పేర్కొన్నారు. 33 ప్రైవేట్ ఆసుపత్రల్లో సర్జరీలు నిర్వహించేందుకు అనుమతులు ఉన్నాయన్నారు. బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోతున్న వారి నుంచి 7 అవయవ భాగాలను దానం చేయవచ్చని తెలిపారు. కిడ్నీ, లివర్, హార్ట్, కార్నియా, హార్ట్ వాల్వ్, లంగ్స్, పాంక్రియాస్ వంటి భాగాల్ని దానం చేయవచ్చాన్నారు. వీటిలో అత్యధికంగా 1877 కిడ్నీలు జీవన్‌దాన్ ద్వారా ట్రాన్స్‌ప్లాంటేషన్ నిర్వహించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం వేచి ఉన్న వారి సంఖ్య 3 వేలకు పైగా ఉందని.. ఇందులో కిడ్నీ కోసం 2 వేలకు పైగా వేచి ఉన్నారని స్వర్ణలత వివరించారు.
Bhatti Vikramarka: బిఆర్ఎస్ ఆ రెండు జిల్లాల ప్రజలకు తీరని ద్రోహం చేసింది.. భట్టి విక్రమార్క ధ్వజం
ఇదిలావుండగా.. ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతున్నప్పుడు, అవయవదానంపై మరింత అవగాహన కల్పించేందుకు తెలంగాణ జీవన్‌దాన్‌తో కలిసి సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ముందుకొచ్చింది. ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతున్న అనేక మంది రోగులకు కొత్త జీవితాన్ని అందించేందుకు.. అవయవదానంపై జీవన్‌దాన్, సన్‌రైజర్స్‌తో కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా.. అపోలో దవాఖానలో అవయవ మార్పిడి కార్యక్రమాన్ని 1990లో ప్రారంభించి, ఇప్పటివరకు 4872 అవయవ మార్పిడిలు విజయవంతంగా చేశామని స్వర్ణలత తెలిపారు.