దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. గురువారం నగరవ్యాప్తంగా కుండపోతగా వర్షం పడింది. నైరుతి రుతుపవన కాలంలో తొలిసారిగా నగరంలో భారీ వర్షాలు నమోదు అయ్యాయి. దీంతో నగరం అంతటా వర్షపు నీరు నిలిచింది. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబై దక్షిణ ప్రాంతంలో రోజంతా వర్షం కురసింది. బీఏ అంబేద్కర్ రోడ్, బ్రీచ్ క్యాండీ, జేజే ఫ్లై ఓవర్, వర్లీ, కమలా మిల్స్ కాంపౌండ్, అంధేరి, మాతుంగా, కుర్లా, శాంతాక్రూజ్ ప్రాంతాల్లో భారీ…
కేరళలో వానలు దంచికొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు రావడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ ( ఐఎండీ) బుధవారం రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్ గోడ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. గురువారం కన్నూర్, కాసర్ గోడ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కేరళ చుట్టుపక్కల ప్రాంతాలలో…
నగరంలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉక్కపోతతో భాగ్యనగర వాసులు అల్లాడుతున్నారు. గరిష్టంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత.. కనిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఎండల తీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి సిటీ ప్రజలు జంకుతున్నారు. భానుడి భగభగలతో నగరంలోని రోడ్లు బోసిపోతున్నాయి. రోజుకు సగటున 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నగరవాసులు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి నగరంలో ఎండల తీవ్రత…
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలో ఇప్పటికే 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. పది గంటల కల్లా మాడు పగిలేలా ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, తదితర జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. తెలంగాణలో ఒక్కరోజు వ్యవధిలోనే వడదెబ్బకు గురై నలుగురు మృతిచెందారు. హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్…
తుఫాన్ హెచ్చరికలతో అప్రమత్తం అయింది విశాఖ పోలీసు శాఖ. నగర ప్రజలు,వాహనదారులకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు సిటీ పోలీసులు. రేపటి నుంచి ఆదివారం వరకు తుఫాన్ ప్రభావం ఉంటుంది. భారీ వర్షాలు, గాలులు కారణంగా చెట్లు విరిగిపడ్డం, రహదారులు జలమయం అయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. రవాణాకు అడ్డంకులు ఏర్పడతాయి కనుక వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. అత్యవసరం అయితే తప్ప తుఫాన్ సమయంలో రోడ్లపైకి రావద్దని కోరింది. రాబోయే తుఫాన్ కి సంబంధించి విశాఖ…
ఏపీలో తుపాను ప్రభావం వల్ల శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. తూర్పుగోదావరి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. నిన్న మధ్య అండమాన్ సముద్రం ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాల మీద ఉన్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి ఆగ్నేయ బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్ర ప్రాంతంలో ఈరోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి రాగల 12గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం వాయుగుండముగా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రేపు అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని… ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. మూడు రోజుల పాటు ఏపీలో కుండపోత వర్షాలు పడతాయని వాతావరణశాఖ సూచించింది. ఈ మేరకు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే…