తుఫాన్ హెచ్చరికలతో అప్రమత్తం అయింది విశాఖ పోలీసు శాఖ. నగర ప్రజలు,వాహనదారులకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు సిటీ పోలీసులు. రేపటి నుంచి ఆదివారం వరకు తుఫాన్ ప్రభావం ఉంటుంది. భారీ వర్షాలు, గాలులు కారణంగా చెట్లు విరిగిపడ్డం, రహదారులు జలమయం అయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. రవాణాకు అడ్డంకులు ఏర్పడతాయి కనుక వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. అత్యవసరం అయితే తప్ప తుఫాన్ సమయంలో రోడ్లపైకి రావద్దని కోరింది.
రాబోయే తుఫాన్ కి సంబంధించి విశాఖ జిల్లాలో అధికారులు అప్రమత్తం అయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున. గత గులాబ్ తుఫాన్ సమయంలో మునిగిన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున.. జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ పలు సూచనలు చేశారు. విశాఖ జిల్లాకు ఇప్పటికే రెండు ఎన్డీఆర్ఎఫ్ ,ఎస్ డి ఆర్ ఎఫ్ బలగాలు చేరుకున్నాయని చెప్పారు. విశాఖ పర్యటన 4, 5, 6 తేదీల్లో వాయిదా వేసుకుంటే మంచిదన్నారు. అధికారులందరూ అప్రమత్తం కావాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆదేశాలు జారీ చేశారు.