కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. రుతుపవనాలకు ముందు కురుస్తున్న వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. ఈ క్రమంలో.. రాష్ట్రంలోని ఎర్నాకులం, త్రిసూర్‌లలో రెడ్ అలర్ట్.. పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్ మరియు వాయనాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రెడ్ అలర్ట్ ప్రాంతాల్లో రానున్న 24 గంటల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా.. భారీ నుండి…
Temperatures in Telangana: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతల మార్క్ ను దాటేసింది.
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి చివరి వారంలోనే భానుడు భగభగ మంటు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక, ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదు అవుతున్నాయి.
నైరుతు రుతుపవనాలతో కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాఖండ్‌లో గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి పలు చోట్ల రహదారులు మూతబడ్డాయి.
మధ్యప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రస్తుతం పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నప్పటికీ, మంగళవారం ఉదయం వరకు మధ్యప్రదేశ్‌లోని పలు ప్రదేశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సోమవారం ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది.
Heavy rain: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. మధ్యాహ్నం వరకు భగభగలతో అల్లాడిపోయిన భాగ్యనగరం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి సూర్యని వేడితో అల్లాడుతున్న నగరవాసులకు చిరు జల్లులతో పలుకరించింది.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా హైదరాబాద్‌తోపాటు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న రాత్రి కూడా నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. వాహనదారులు, ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. Read Also: CM KCR Yadadri Tour: నేడు యాదాద్రికి…