Rahul Gandhi: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ రోజు సాయంత్రం భారత్‌లో తన రెండు రోజుల పర్యటన కోసం అడుగుపెట్టనున్నారు. పుతిన్ పర్యటనకు ముందు లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy: హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో పదవ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మహాత్మ బసవేశ్వర జయంతి ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విప్లవకారుడు అంటే తుపాకీ పట్టుకోవాల్సిన అవసరం లేదని, విప్లవాత్మక మార్పు తెచ్చే ఎవరైనా విప్లవకారుడని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ పై బసవేశ్వరుడు ప్రభావం ఎక్కువని సీఎం అన్నారు. ప్రభుత్వ తప్పిదాలు సరిదిద్దేలా ప్రతిపక్ష వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నామని…
వక్ఫ్ బోర్డు బిల్లుపై పార్లమెంటులో రాహుల్ గాంధీ వెన్నుచూపారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడారు. మైనారిటీలపై కాంగ్రెస్ కపట ప్రేమ చూయిస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మైనారిటీల హక్కులను కాలరాసి కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చలో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం దారుణమన్నారు. ప్రియాంక గాంధీ అతి ముఖ్యమైన ఈ బిల్లు సమయంలో పార్లమెంటుకు హాజరు కాకపోవడం అత్యంత దారుణమని…
Vemula Prashanth Reddy : తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ చేసిన త్యాగాలను గుర్తు చేశారు. ఆయన డిప్యూటీ స్పీకర్ పదవిని త్యాగం చేసి, 14 ఏళ్లు మడమ తిప్పని ఉద్యమం నడిపిన వ్యక్తి అని ప్రశంసించారు. అయితే, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు తగదని మండిపడ్డారు. ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు.…
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి లక్నోలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు(ACJM) రూ.200 జరిమానా విధించింది. ఏప్రిల్ 14న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసు రాహుల్ గాంధీ మహారాష్ట్రలో ఇచ్చిన ప్రకటనకు సంబంధించినది. డిసెంబర్ 17, 2022న అకోలాలో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ పై వివాదాస్పద ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై లక్నోలోని ACJMలో పిటిషన్లు దాఖలు అయ్యాయి. రాహుల్ గాంధీ ప్రకటన…
Ponguleti Srinivas Reddy : కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. కేసీఆర్ గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నామని, ఫామ్ హౌస్ లోనే ఉండి మాట్లాడతారా..లేదా అసెంబ్లీకి వస్తారా? అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. 13 నెలల పాటు ఫామ్ హౌజ్ కే పరిమితమై ఇంతకాలం మౌనంగా ఉన్నానని ఇప్పుడేదో అంటే సరిపోదు. ప్రతిపక్ష నాయకుడంటే ప్రజల్లో తిరగాలి. ప్రజా సమస్యలు ప్రస్తావించాలి. వర్షాలు వచ్చినా.. వరదలు వచ్చినా కనీసం ప్రజలను పరామర్శించలేదు. ఫామ్…
ఐదుగురు ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క రోజూ సభకు వచ్చారని.. 38 మంది ఉన్న బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఎందుకు రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి కంటే ఎక్కువ విలువ ప్రతిపక్ష నాయకుడికి ఉంటుందన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖతం అవుతుంది అని కేసీఆర్ ముందే తెలుసుకొని సభకు రావడం లేదన్నారు.
CPI Ramakrishna: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దొంగలు పడ్డారు అని ఆరోపించారు.
AP Assembly: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో మరోసారి తెర పైకి ప్రతిపక్ష నేత హోదా రానుంది. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరుతున్నారు. 11 సీట్లే వచ్చాయి కాబట్టి.. ప్రతిపక్ష హోదా ఇవ్వలేమంటోన్న అధికార పక్షం.. ఇప్పటి వరకు జరగని అసెంబ్లీలో సీట్ల కేటాయింపు జరపని స్పీకర్..
రష్యా ప్రతిపక్ష నేత, పుతిన్ విమర్శకుడు అలెక్సీ నావల్నీ (Alexei Navalny) అంత్యక్రియలు ప్రశాంతంగా ముగిశాయి. కట్టుదిట్టమైన పోలీసుల భద్రత మధ్య.. వేలాది మంది ప్రజలు ఆయనకు తుది వీడ్కోలు పలికారు.