AP Assembly: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో మరోసారి తెర పైకి ప్రతిపక్ష నేత హోదా రానుంది. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరుతున్నారు. 11 సీట్లే వచ్చాయి కాబట్టి.. ప్రతిపక్ష హోదా ఇవ్వలేమంటోన్న అధికార పక్షం.. ఇప్పటి వరకు జరగని అసెంబ్లీలో సీట్ల కేటాయింపు జరపని స్పీకర్.. ఈ సమావేశాలకూ సీట్ల కేటాయింపు జరిగే అవకాశం లేదంటోన్న అసెంబ్లీ వర్గాలు.. సీట్ల కేటాయింపు జరపకపోవడంతో సామాన్య సభ్యునిగానే సభలో మాజీ సీఎం జగన్ కూర్చోనున్నారు.
Read Also: Sradda srinadh: శ్రద్ధాకు శ్రద్ధగా స్వాగతం పలికిన యూనిట్ ..ఇంతకీ ఏ సినిమా..?
కానీ, ఈసారి అసెంబ్లీ సమావేశాలకు విజిటర్స్ పాసుల కుదించారు. ఎమ్మెల్యేల వెంట భారీ ఎత్తున అనుచరులు వస్తుండడంతో పాసులను నియంత్రించాలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రులకు రిప్రజెంటేషన్లు ఇవ్వాలంటూ అసెంబ్లీకి నేతలు, కార్యకర్తలు వస్తోన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సచివాలయంలో సందర్శకులను కలిసేలా ప్లాన్ చేసుకోవాలని మంత్రులకు సూచనలు చేస్తున్నారు. అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేలా ప్రిపేర్ అవ్వాలని మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.