Ponguleti Srinivas Reddy : ఫామ్‌హౌస్‌లోనే ఉండి మాట్లాడతారా.. లేదా అసెంబ్లీకి వస్తారా?
- కేసీఆర్ గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నాం
- ఫామ్ హౌస్‌లోనే ఉండి మాట్లాడతారా
- లేదా అసెంబ్లీకి వస్తారా? : మంత్రి పొంగులేటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivas Reddy : కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. కేసీఆర్ గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నామని, ఫామ్ హౌస్ లోనే ఉండి మాట్లాడతారా..లేదా అసెంబ్లీకి వస్తారా? అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. 13 నెలల పాటు ఫామ్ హౌజ్ కే పరిమితమై ఇంతకాలం మౌనంగా ఉన్నానని ఇప్పుడేదో అంటే సరిపోదు. ప్రతిపక్ష నాయకుడంటే ప్రజల్లో తిరగాలి. ప్రజా సమస్యలు ప్రస్తావించాలి. వర్షాలు వచ్చినా.. వరదలు వచ్చినా కనీసం ప్రజలను పరామర్శించలేదు. ఫామ్ హౌస్ దాటలేదని, అధికారంలో ఉన్ననాడు సచివాలయానికి రాలేదు. ప్రతిపక్ష నేతగా ఏడాది నుంచి అసెంబ్లీకి రాలేదు. ప్రజల్లోకి రాలేదు.. కేసీఆర్ జీవితమంతా ఫామ్ హౌసే అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు అత్యాశకు పోయి కాంగ్రెస్ కు ఓటేశారని కేసీఆర్ వ్యాఖ్యలు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయి. ప్రజా తీర్పును అగౌరవ పరుస్తున్నారని, ప్రజలన్నా.. ప్రజాతీర్పు అన్నా కేసీఆర్ కు ఏనాడూ గౌరవం లేదన్నారు.
IND vs ENG 4th T20: దూబే, హార్దిక్ మెరుపులు.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
అంతేకాకుండా..’పదేండ్లు అధికారం ఇచ్చిన ప్రజలకు ఓడిపోయిన తర్వాత ఈ రోజు వరకు కూడా కనీసం కృతజ్ఞత తెలపలేదు. ప్రజాతీర్పును శిరసావహిస్తున్నామని కూడా ప్రకటించలేదు. ఈ ఏడాది కాలంలో నల్గొండ, కరీంనగర్ బీఆర్ఎస్ సభల్లో కూడా.. ఈరోజు మాదిరిగానే గంభీర ప్రకటనలే చేశారు. ఆ తర్వాత ఏమయ్యారో అందరికీ తెలిసిందే. ప్రతిపక్షనేతగా అసెంబ్లీ ముఖం చూడని వ్యక్తి తన ఉనికిని చాటుకోవడానికి, నేనున్నానని చెప్పుకోవడానికి తుపాకీ రాముడిలా, పిట్టల దొర మాదిరి మాట్లాడుతున్నారు. ప్రజలు ఏదో నమ్మి ఓటేశారని అంటున్నావు. వాస్తవాలు గ్రహించి నీ గడీల పాలన వద్దనుకుని ప్రజలు నిన్ను నీ కుటుంబాన్ని ఛీత్కరించారు. పథకాలు అమలు కాలేదని ఫామ్ హౌజ్ లో కూర్చొని మాట్లాడటం కాదు. ఇప్పటికైనా ప్రజల్లోకి రావాలనే మేమంటున్నాం. అసెంబ్లీ సమావేశాలకు రావాలని ముఖ్యమంత్రి గారు పదే పదే ఆహ్వానించారు. 80 వేల పుస్తకాలు చదివినారన్నారు. మీ అమూల్యమైన సూచనలు సలహాలు ఇవ్వాలని అసెంబ్లీకి రమ్మంటే ఎందుకు రాలేదు. 2020 రెవెన్యూ చట్టం దేశానికే ఆదర్శమని ప్రకటించిన మీరు భూ భారతి చట్టం ప్రవేశ పెట్టిననాడైన అస్సెంబ్లీ కి వస్తారని ఆశించాం.
Yamaha: స్పోర్ట్స్ బైక్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఈ బైక్స్‌పై రూ.1.10 లక్షల వరకు డిస్కౌంట్!
నీ ఫామ్ హౌజ్ కు కరెంటు కోతలెక్కడివి. లెక్కలు తీద్దామా. ఏ రోజు ఎంత కరెంటు సరఫరా అయింది. ఎంత సరఫరా అవుతుంది. నీ ఫామ్ హౌజ్ కు నీళ్లెక్కడివి. రైతు భరోసా ఇచ్చిందే మేము. రాష్ట్రంలో ఉచిత కరెంట్ తెచ్చిందే కాంగ్రెస్. చరిత్ర ప్రజలకు తెలియదా. నీవంటున్న గురుకులాలను సందర్శిద్దామా. మాతో వస్తారా. నీవెక్కడికంటే అక్కడికి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అద్దె గదుల్లో పెట్టి విద్యార్థులను నానా ఇబ్బందులకు గురిచేసిన మీరా మాట్లాడేది. రైతుల రుణమాఫీ కోసం 20 వేల కోట్ల రూపాయలు ఇచ్చిన సంగతి కళ్లకు కనిపించడం లేదా. అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా. ఏదైనా మాట్లాడితే దానికొక ప్రాతిపదిక ఉండాలి. ముస్లింలను కాంగ్రెస్ వాడుకుంది అంటున్నావు. వాడుకుని వదిలేసే చరిత్ర నీది.’ అని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!