Vemula Prashanth Reddy : తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ చేసిన త్యాగాలను గుర్తు చేశారు. ఆయన డిప్యూటీ స్పీకర్ పదవిని త్యాగం చేసి, 14 ఏళ్లు మడమ తిప్పని ఉద్యమం నడిపిన వ్యక్తి అని ప్రశంసించారు. అయితే, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు తగదని మండిపడ్డారు.
ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో మూడు గంటల పాటు కేసీఆర్ గురించే మాట్లాడారని, ప్రజలకు ఉపయుక్తమైన విషయాలను ప్రస్తావించలేదని అన్నారు. కేసీఆర్ చావు కోరుతూ మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయికి తగదని మండిపడ్డారు. ప్రతి పక్ష నాయకునికి గౌరవం ఇవ్వడం సాంప్రదాయంగా వస్తున్నా, కొత్త ప్రభుత్వం వచ్చాకా కేసీఆర్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతకు అందించాల్సిన ఛాంబర్‌ను తొలగించడం అవమానకరమని పేర్కొన్నారు.
ప్రతిపక్ష నాయకుని సంప్రదించకుండా PAC ఛైర్మన్‌ను పార్టీ మారిన వ్యక్తిగా నియమించారని, ఇది నియమాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇది ప్రతిపక్షానికి ఇచ్చే గౌరవం కాదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన ప్రతి అంశంలో అబద్ధాలు ఉన్నాయని అన్నారు. ఎన్నికల హామీల అమలులో విఫలమయ్యారని, తులం బంగారం, స్కూటీలు, పంటలకు బోనస్ వంటి హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ విషయంలోనూ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లో కేసీఆర్ పాలనలో సాధించిన విజయాలను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రుణమాఫీ రెండుసార్లు అమలయిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు విడతలుగా చేసినా BRS కంటే 8 వేల కోట్లు తక్కువే మాఫీ చేసిందని పేర్కొన్నారు.
US Missile Strike: యూఎస్ మిస్సైల్ దాడి.. ‘‘ఐసిస్’’ అబు ఖదీజా హతం..