Mahesh Kumar Goud: తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని టీపీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ నేత మైనంపల్లి ఇంటికి మహేష్ కుమార్ సమావేశం అయ్యారు. ఖమ్మం వరద బాధితులకు కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు సహాయం అందించారు. దీంతో..నిత్యావసర సరుకుల వ్యాన్ లను టీపీసీసీ చీఫ్ జెండా ఊపి ప్రారంభించారు. వరద బాధితులకు మైనంపల్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నారు. రూ.50 లక్షల రూపాయల విలువ చేసే సరుకులను మైనంపల్లి ఖమ్మం పంపించారు. మైనంపల్లి నివాసంలో జెండా ఊపి సరుకుల వ్యాన్ లను ఖమ్మం పంపారు. 25కేజీల బియ్యం బ్యాగ్ తో పాటు 11 రకాల సరుకులను వెయ్యి కుటుంబాలకు పంపిణీ పై మైనంపల్లి నివాసంలో మహేష్ కుమార్ తో కాంగ్రెస్ నేతలు కూన శ్రీశైలం గౌడ్.. వజ్రేశ్ , సమావేశమయ్యారు.
Read also: Heavy Rain Alert for AP: కాసేపట్లో తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి విమర్శలు చేస్తున్నాయన్నారు. ఏడున్నర లక్షల కోట్ల అప్పు పెట్టి మా చేతిలో రాష్ట్రాన్ని పెట్టి పోయాడు కేసీఆర్ అని మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ హామీలను అమలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తుందన్నారు. తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. నాయకులకు.. కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నారు.. ప్రభుత్వం మనదే మరింతగా కష్టపడి పని చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుస్తామన్నారు. ప్రభుత్వాన్ని.. పార్టీని.. సమన్వయం చేసుకుంటూ ముందు వెళ్తామన్నారు.
Indian Railways : వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలకు ఉపశమనం.. రైల్వే శాఖ రాజీనామాకు ఆమోదం