Jagga Reddy: విమర్శలకు సమయం కాదు..ప్రభుత్వం..ప్రతిపక్షం కలిసి ప్రజల్ని ఆదుకుందామని పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మంత్రులంతా వరద బాధితుల సేవలోనే ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఫిల్డ్ లో ఉందని తెలిపారు. బాధ్యతగా సిన్సియర్ గా పని చేస్తున్నారని అన్నారు. సీఎంతో మోడీ మాట్లాడటం.. 7 వేల కోట్లు నష్టం జరిగినట్టు కేంద్రానికి నివేదికలు పంపారు సీఎం అన్నారు. వర్షాలు వస్తున్నాయని తెలిసిన వెంటనే అలెర్ట్ అయ్యింది ప్రభుత్వం. ప్రకృతి మీద అంచనా ఎవరు వేయలేరు కదా? అని తెలిపారు.
Read also: Ponguleti Srinivasa Reddy: తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చాము..
వచ్చిన వరద నుండి ప్రజలకు తక్షణ సాయంగా 10 వేలు ఇస్తున్నారన్నారు. అధికారుల నివేదిక ప్రకారం నష్టం అంచనా వేస్తున్నారు. ప్రజలకు విశ్వాసం నింపే లాగా సిఎం.. మంత్రులు పని చేస్తారన్నారు. కేంద్ర సహకారం కూడా తీసుకుంటుందన్నారు. హరీష్ రావు రాజకీయ పార్టీగా వెళ్ళడం తప్పు కాదన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సమస్యలు మీదృష్టికి వస్తె సీఎంకి చెప్పండన్నారు. కానీ.. అక్కడకు పోకుండానే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లు అధికారం లో ఉండి.. ఒకే సారి అధికారం పోగానే తెరుకోలేక పోతున్నారని అన్నారు.
Read also: Minister Sitakka: ములుగులో 500 ఎకరాల్లో చెట్లు నేలకొరగడంపై మంత్రి సీతక్క ఆరా..
రాజకీయాలు చేసే సమయమా..? అని ప్రశ్నించారు. ముగ్గురు మంత్రులు ఏం చేస్తలేరు అంటున్నావు… ఏం చేయాలో చెప్పడం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎలా ఉండాలో మమ్మల్ని అడిగేతే మేమే ట్రైనింగ్ ఇస్తామన్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్న అనుభవం మాకు ఉంది కాబట్టి అన్నారు. విమర్శలకు సమయం కాదు..ప్రభుత్వం..ప్రతిపక్షం కలిసి ప్రజల్ని ఆదుకుందామని పిలుపునిచ్చారు. హరీష్ రావు ఫ్యామిలీ..చంద్రబాబు నీ ఎప్పుడు తిడతారో.. ఎప్పుడు పొగడతారో తెలియదన్నారు. మమ్మల్ని మెచ్చుకోలేక… చంద్రబాబు నీ మెచ్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని మెచ్చుకుంటే వాళ్లకు రాజకీయంగా ఇబ్బంది కదా..? అని ప్రశ్నించారు.
Read also: Ponnam Prabhakar: ప్రకృతి విపత్తును అపగలిగే శక్తి ఎవరికీ లేదు..
ఏపీ లో ప్రతిపక్షం… తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది అంటున్నారు. తెలంగాణ లో ప్రతిపక్ష నాయకుడు గా కేసీఆర్.. ఇంట్లో ఉండే నడిపిస్తున్నాడన్నారు. సీఎం గా ఉన్నా.. ఇంట్లో ఉండే నడిపించారు.. ఆయన ఇష్టం అది అన్నారు. కాంగ్రెస్ ప్రాక్టికల్ పార్టీ… వాస్తవాలకు దగ్గర ఉంటామన్నారు. బీఆర్ఎస్ అవాస్తవాలకు దగ్గర ఉంటుందన్నారు. మేము పనికి ఎక్కువ.. పబ్లిసిటీ కి తక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు పబ్లిసిటీ కి దగ్గర.. పనికి దూరంగా ఉంటారన్నారు. మా మంత్రుల మైండ్ అంతా ప్రజలను ఎలా ఆదుకోవాలి అనేదాని మీదనే ఉంటదన్నారు.
Hydra Commissioner: హైడ్రా పేరుతొ డబ్బు వసూళ్ల కు పాల్పడితే జైలుకే.. హైడ్రా కమిషనర్ వార్నింగ్..