త్రిషకు అద్భుతంగా ప్రపోజ్ చేసిన అభిమాని..
ముద్దు గుమ్మ త్రిష గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. చెన్నై అమ్మడు అయినప్పటికి తెలుగు చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుందనే చెప్పాలి. ఇక్కడ దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు రెండు దశాబ్దాలుగా తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇప్పటికీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నత్రిష, ప్రస్తుతం చిరంజీవి సరసన ‘విశ్వంభర’ అనే చిత్రం చేస్తుంది. సాధారణంగా చెప్పాలంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో అవకాశాలు రావడం చాలా అరుదు. కాని త్రిష మాత్రం అద్భుతమైన అవకాశాలు అందుకుంటుంది. ఇదిలా ఉంటే ఫేవరెట్ హీరో గాని హీరోయిన్ పై అభిమానులు వారి అభిమానాన్ని నానా రకాలుగా వ్యక్తం చేస్తుంటారు. ఇందులో భాగంగా తాజాగా త్రిషకు ఓ అభిమాని చేసిన ప్రపోజ్ ప్రజంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
ఇంగ్లీష్ టైటిల్స్ ను సెంటిమెంట్ గా మార్చుకున్న యంగ్ హీరో
దర్శకుడి నుండి హీరోగా యూటర్న్ తీసుకుని స్టార్ హీరోలకే కాంపిటీటర్ అయ్యాడు ప్రదీప్ రంగనాథన్. వాళ్లు సాధించలేని రూ. 100 కోట్ల కలెక్షన్స్ వంటి రేర్ ఫీట్ సొంతం చేసుకున్నాడు. హీరోగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో గ్యారెంటీ హీరోగా మారాడు. షార్ట్ ఫిల్మ్స్ నుండి డైరెక్టరైన ప్రదీప్ డైరెక్టర్ గా కోబలితో తానేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. ఇక హీరో కం డైరెక్షన్ చేసిన లవ్ టుడే ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో అందరికీ తెలుసు. ప్రదీప్ పేరు యూత్‌లో మార్మోగిపోయింది. ఈ ఏడాది ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన డ్రాగన్‌తో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు ప్రదీప్. స్టార్ హీరోలు కూడా తీసుకురాని హైప్, హోప్ తెచ్చాడు. ఏకంగా రూ. 150 కోట్లను కొల్లగొట్టింది డ్రాగన్. ఈ రెండు చిత్రాల విజయాలను తీసుకుని ఓ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు ప్రదీప్. లవ్ టుడే, డ్రాగన్ లాంటి ఇంగ్లీష్ టైటిల్స్‌తో బ్లాక్ బస్టర్స్ చూసిన ప్రదీప్. అదే సెంటిమెంట్ గా నెక్ట్స్ ప్రాజెక్టులకు అలాంటి టైటిల్సే ఫిక్స్ చేస్తున్నాడు. ప్రదీప్ థర్డ్ వెంచర్ ‘లవ్ ఇన్సురెన్స్ కంపెనీ’ కూడా ఇంగ్లీష్ టైటిలే. దీనికి నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకుడు. ఇక రీసెంట్లీ స్టార్టైన ఫోర్త్ మూవీకి కూడా టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. డ్యూడ్ అనే యూత్ అండ్ క్యాచీ టైటిల్ ఖరారు చేశారు. కీర్తిశ్వరన్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇంగ్లిష్ టైటిల్స్ ను సెంటిమెంట్ గా పెట్టుకున్న ప్రదీప్ ఈ సారి డ్యూడ్ తో ఎలాంటి కొడతాడో చూడాలి.
మరోసారి లిక్కర్ స్కామ్‌పై కేశినేని కీలక వ్యాఖ్యలు
మాజీ ఎంపీ కేశినేని నాని మరోసారి లిక్కర్ స్కామ్‌పై తన గళం విప్పారు. ఈసారి ఆయన లక్ష్యం ప్రస్తుత ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని). లిక్కర్ స్కామ్‌లో ఎంపీ చిన్ని పాత్రపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి రాసిన లేఖను శనివారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ, లిక్కర్ స్కామ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిట్ విచారణకు ఆదేశిస్తే, ఎంపీ చిన్నికి దానిపై నమ్మకం లేక సీబీఐ విచారణ కోరారని గుర్తు చేశారు. వ్యాపార భాగస్వామి రాజ్ కసిరెడ్డి ద్వారా మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న ఆర్థిక లావాదేవీలలో ఎంపీ చిన్ని కీలక పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు.
పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందం.. నెట్టింట 1971లో ఇందిరా గాంధీ నిర్ణయంపై చర్చ
భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధానికి శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో పాక్, ప్రస్తుత పరిస్థితులపై కొందరు కాంగ్రెస్ నేతల కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం ఇందిర కాలం నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటున్నారు. అయితే, పాకిస్తాన్‌తో కాల్పులు విరమణ ఒప్పందం జరిగిన తర్వాత ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న చర్యను ప్రధాని నరేంద్ర మోడీ వైఖరితో పోల్చుతూ సోషల్ మీడియా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 1971 యుద్ధం సందర్భంగా సైనికులతో మాజీ ప్రధాని ఇందిరా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో హస్తం నేతలు పోస్టు చేస్తున్నారు. ఇందిర లేని లోటు కనిపిస్తోందని పేర్కొంటున్నారు. ‘ఇందిర ధైర్యం చూపారు.. దేశం కోసం నిలబడ్డారని రాసుకొచ్చారు. జాతి పౌరుషంతో ఆమె రాజీ పడలేదని కాంగ్రెస్ నెట్టింట తెలిపింది.
క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్.. త్వరలో ఐపీఎల్ రీస్టార్ట్.. కొత్త షెడ్యూల్!
భారత్- పాక్ మధ్య యుద్ధంతో ఐపీఎల్‌కు తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో వీలైనంత తొందరగా మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లను ముగించాలని గవర్నింగ్ కౌన్సిల్ ఆలోచనలో ఉంది. ఈ వారాంతంలో టోర్నమెంట్ మళ్లీ స్టార్ట్ కావొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే మే 15వ తేదీ నుంచే మ్యాచ్‌లు జరిగే ఛాన్స్ ఉంది. అసలు షెడ్యూల్ ప్రకారం మే 25లోపే లీగ్‌ను ముగించాలని బీసీసీఐ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. ఇక, ఐపీఎల్ కొనసాగింపుపై నేడు ప్రత్యేక భేటీ నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలియజేశారు.
ఈఏపీసెట్ పలితాలు వచ్చేశాయ్..
తెలంగాణ ఈఏపీసెట్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఈఏపీసెట్ పలితాలు విడుదలయ్యాయి. నేడు(ఆదివారం) ఉదయం 11 గంటల 15 నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈఏపీసెట్ రిజల్ట్స్ ను రిలీజ్ చేశారు. తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తాచాటారు. ఏపీకి చెందిన పల్ల భరత్ చంద్ర ఇంజినీరింగ్ స్ట్రీమ్ లో మొదటి ర్యాక్ కైవసం చేసుకున్నాడు. తెలంగాణకు చెందిన ఊదగండ్ల రామ చరణ్ రెడ్డి రెండో ర్యాంక్ తో మెరిశాడు. అగ్రికల్చర్-ఫార్మసీ విభాగంలో తెలంగాణకు చెందిన సాకేత్ రెడ్డి పెద్దకగరి ఫస్ట్ ర్యాంక్ తో సత్తాచాటాడు. ఫలితాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి
భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై కౌంటర్ దాడులకు దిగింది. అనంతరం పాకిస్తాన్ ప్రత్యక్షంగా భారత్‌పై దాడికి దిగడంతో, ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ ఉద్రిక్త వాతావరణాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం వల్ల కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా సాంత్వనకు తీసుకువచ్చారు. ప్రస్తుతం రెండు దేశాల సరిహద్దుల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ, “రాష్ట్ర రక్షణలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. దేశాన్ని ధైర్యంగా కాపాడిన సాయుధ దళాలకు అభినందనలు తెలియజేస్తున్నాను” అన్నారు.
నీటి హక్కులను ఆంధ్రాకు తాకట్టు పెట్టి, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు..
తెలంగాణలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని కాంగ్రెస్ పార్టీ తక్కువ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియా ద్వారా విడుదల చేసిన ప్రకటనలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, అదే అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తోంది అంటూ హరీష్ రావు మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టుకు కేంద్ర జల వనరుల సంఘం (CWC), హైడ్రాలజీ అనుమతులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనుమతులేదంటూ ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి సమర్పించిందని, అనంతరం 2021లో ఈ ప్రాజెక్టుకు అవసరమైన 113.795 టీఎంసీల నీటి లభ్యతను సీడబ్ల్యూసీ ఆమోదించిందని హరీష్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు తాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీటిని కూడా అందించాలన్నదే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ప్రధాని మోడీతో త్రివిధ దళాధిపతుల సమావేశం.. రేపటి భేటీపై చర్చ!
ఆపరేషన్ సింధూర్‌కు విరామం ఇచ్చిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాసంలో హైలెవల్ సెక్యూరిటీ సమావేశం కొనసాగుతుంది. త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ (సీడీఎస్) అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ మీటింగ్ కు హాజరయ్యారు. అయితే, భారత్-పాకిస్తాన్ లు పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడంతో.. ఆ తర్వాత దానిని ఇస్లామాబాద్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ భేటీ జరగడం గమనార్హం. కాగా, తటస్థ వేదికపై ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు.. సరిహద్దుల్లో పరిస్థితి కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. తాజా పరిస్థితులపై మరి కొద్దిసేపట్లో విదేశాంగ శాఖ, రక్షణశాఖ మీడియా సమావేశం నిర్వహించనున్నాయి.
ఆపరేషన్ సింధూర్ పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కీలక ప్రకటన..
ఆపరేషన్ సింధూర్‌పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని తేల్చి చెప్పింది. ఆపరేషన్ ఇంకా ముగియలేదని తెలిపింది. దీనికి సంబంధించి కాసేపట్లో ఐఏఎఫ్ అధికారులు పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. అయితే, మాకు అప్పగించిన టార్గెట్‌లను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసేశాం. విచక్షణ, వివేకంతోనే ఆపరేషన్ సింధూర్ కొనసాగించాం అన్నారు. ఆపరేషన్ సింధూర్‌పై వస్తున్న ప్రచారం, ఫేక్ వార్తలను నమ్మవద్దు అని అధికారులు వెల్లడించారు.