BrahMos: పాకిస్తాన్‌పై “బ్రహ్మోస్”తో భారత్ దాడి.!
- పాకిస్తాన్‌పై బ్రహ్మోస్‌తో భారత్ దాడి..
- ఆపరేషన్ సిందూర్‌లో ఉపయోగించినట్లు వార్తలు..
- బహవల్పూర్ జైషే మహ్మద్ పై దీనితోనే దాడి..
- బికనీర్ ప్రాంతంలో క్షిపణి బూస్టర్ లభ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BrahMos: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్‌లోని పలు ఉగ్రవాద స్థావరాలపై భీకర దాడులు చేసింది. ఈ దాడిలో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయాలతో పాటు వాటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. అయితే, ఈ దాడుల్లో భారత్ ‘‘బ్రహ్మోస్ ’’ సూపర్ సోనిక్ క్షిపణిని ఉపయోగించినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ బికనీర్ ప్రాంతంలో క్షిపణికి సంబంధించిన బూస్టర్, నోస్ క్యాప్ లభించాయి. దీనిని బట్టి చూస్తే ‘‘ఆపరేషన్ సిందూర్’’లో భారత్ ఈ క్షిపణిని ఉపయోగించినట్లు స్పష్టమవుతోంది.
ముఖ్యంగా, పాకిస్తాన్ పంజాబ్‌లోని బహవల్పూర్ జైషే మహ్మద్ ఉగ్ర కార్యాలయంపై దీనిని ప్రయోగించి ఉండొచ్చని తెలుస్తోంది. బహవల్పూర్ అంతర్జాతీయ సరిహద్దు నుంచి 100 కి.మీ దూరంలో ఉంది. దీనిపై అత్యంత ఖచ్చితత్వంతో దాడి జరిగింది. భారత్, పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని మోహరించడంపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
- India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్‌లో కీలక టెస్ట్..
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ కవ్వింతల తర్వాత భారత్ పాకిస్తాన్‌లోని రఫీకి (షోర్కోట్), మురిద్ (చక్వాల్), నూర్ ఖాన్ (రావల్పిండి), రహీం యార్ ఖాన్, సుక్కూర్, చునియన్ (కసూర్) వైమానిక స్థావరాలతో సహా విస్తృత శ్రేణి వ్యూహాత్మక పాకిస్తాన్ సైనిక ఆస్తులను లక్ష్యంగా చేసుకుంది. పస్రూర్, సియాల్ కోట్ లోని రాడార్ లను కూడా నావనం చేసింది. దీంతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దారుణంగా దెబ్బతింది. ఇదిలా ఉంటే, ఈ దాడుల్లో కూడా బ్రహ్మోస్ ఉపయోగించి ఉండొచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!