Pakistan: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. చివరకు అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్ ‘‘కాల్పుల విరమణ’’కు అంగీకరించింది. ఇదిలా ఉంటే, ఇంత నష్టపోయిన పాకిస్తాన్‌కి బుద్ధి రావడం లేదు. ఆ దేశ రాజకీయ నాయకులు ఇంకా యుద్ధ భాష మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా, పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న ఇషాక్ దార్ మరోసారి భారత్‌ని బెదిరించే ప్రయత్నం చేశారు.
Read Also: Pakistan: అవును, భారత్ మా ఎయిర్ బేస్‌లపై క్షిపణి దాడి చేసింది: పాకిస్తాన్ డిప్యూటీ పీఎం..
‘‘సింధు జలాల ఒప్పందం’’ సమస్యని పరిష్కరించకపోతే కాల్పుల విరమణకు అర్థమే లేదని అన్నారు. CNN కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషాక్ దార్ మాట్లాడుతూ.. భారత్-పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం సమస్యని పరిష్కరించకపోతే, కాల్పుల విరమణ ప్రమాదంలో పడొచ్చని, దీనిని ‘‘యుద్ధ చర్య’’గా భావిస్తామని చెప్పారు. అంతకుముందు కూడా పాకిస్తాన్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు భారత్‌ని ‘‘అణ్వాయుధాలు’’ ఉన్నాయని బెదిరించే ప్రయత్నం చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య 1960లో కుదిరిని ‘‘ఇండస్ వాటర్ ట్రిటీ’’ని నిలిపేసింది. పాకిస్తాన్‌కి సింధూ దాని ఉపనదులే జీవన ఆధారం. 80 శాతం జనాభా ఈ నదీ జలాలపైనే ఆధారపడి ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందం నిలిపివేత పాకిస్తాన్‌లో భయాన్ని పెంచుతోంది. దీంతోనే భారత్‌ని బెదిరించేలా పాక్ నేతలు మాట్లాడుతున్నారు.