పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీసుకున్న చర్యల కారణంగా పాకిస్తాన్ భారీ నష్టాలను చవిచూసింది . ఆపరేషన్ సిందూర్‌లో, పాకిస్తాన్‌లో పెంచి పోషించిన అనేక మంది భయంకరమైన ఉగ్రవాదులను నాశనం చేశారు. ఆ తర్వాత పాక్ భారత్ పై దాడి చేసింది. భారత్ జరిపిన ప్రతీకార దాడుల్లో చాలా మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. పాకిస్తాన్ స్వయంగా దీనిని అంగీకరించింది. రెండు పొరుగు దేశాల మధ్య ఇటీవల ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భారత సైన్యం జరిపిన దాడిలో 11 మంది పాకిస్తాన్ సైనికులు మరణించగా, 78 మంది గాయపడ్డారని పాకిస్తాన్ ఆర్మీ మీడియా విభాగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read:Bollywood : రెమ్యునరేషన్ అమాంతం పెంచేసిన బాలీవుడ్ హీరో
పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాదులను నిర్మూలిస్తామని భారత్ ప్రతిజ్ఞ చేసి ఆపరేషన్ సిందూర్ ప్రారంభించినప్పుడు భారత్, పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణ జరిగింది. ఈ దాడిలో చాలా మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. డాన్ వార్తాపత్రిక ప్రకారం, మరణించిన పాకిస్తాన్ ఆర్మీ సైనికులలో నాయక్ అబ్దుల్ రెహ్మాన్, లాన్స్ నాయక్ దిలావర్ ఖాన్, లాన్స్ నాయక్ ఇక్రముల్లా, నాయక్ వకార్ ఖలీద్, సిపాయి ముహమ్మద్ ఆదిల్ అక్బర్, సిపాయి నిసార్ ఉన్నారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్‌లోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసింది. వైమానిక దాడిలో అనేక ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.