PM Modi: అధంపుర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లిన ప్రధాని మోడీ.. పాకిస్తాన్‌కు ఇండియా ఎయిర్‌ఫోర్స్ సత్తా చూపారని ప్రశంస
- అధంపుర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లిన ప్రధాని మోడీ
- పాకిస్తాన్‌కు ఇండియా ఎయిర్‌ఫోర్స్ సత్తా చూపారని ప్రశంస
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న ఆపరేషన్ సిందూర్ పై జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత, ప్రధాని మోడీ ఈరోజు తెల్లవారుజామున పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. ప్రధాని మోడీ ఈరోజు ఉదయం 7 గంటలకు ఢిల్లీలోని పాలం విమానాశ్రయం నుంచి బయలుదేరి పంజాబ్‌లోని జలంధర్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న వాయుసేన సిబ్బందితో ప్రధాని సమావేశం అయ్యారు. ప్రధాని మోదీ వైమానిక దళ సిబ్బందిని కలిసి వారి మనోధైర్యాన్ని పెంచడానికి కృషి చేశారు. పాకిస్తాన్‌కు ఇండియా ఎయిర్‌ఫోర్స్ సత్తా చూపారని ప్రశంసించారు. పాకిస్తాన్ భారత్ పై తప్పుడు ప్రచారం చేస్తూనే.. తమ దాడిలో ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని పేల్చివేశామని చెప్పిన విషయం తెలిసిందే.
Also Read:Alia Bhatt : ప్రతి సైనికుడి వెనుక ఒక తల్లి కడుపుకోత ఉంటుంది..
Also Read
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
- AP Municipal Elections 2026: బెజవాడలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు.. జనసేన, బీజేపీ డిమాండ్లతో ఉత్కంఠ
- Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
కానీ ప్రధానమంత్రి విమానం ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అయిన తర్వాత, పాకిస్తాన్ వాదన పూర్తిగా అబద్ధమని రుజువైంది. ఎందుకంటే భారతదేశంలోని అత్యంత VVIP విమానం ఈ ఎయిర్‌బేస్‌లో విజయవంతంగా ల్యాండ్ అయింది. భారతదేశ యుద్ధ విమానం మిగ్ 29 కి అదంపూర్ ఎయిర్‌బేస్ స్థావరం. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కూడా ప్రధాని వెంట ఉన్నారు. పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఆదంపూర్ వైమానిక స్థావరం, శత్రువులపై మెరుపు దాడికి ప్రసిద్ధి చెందింది.
Also Read:Sandeep Kumar Sultania: రాష్ట్ర ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా..!
ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “ఈ ఉదయం నేను AFS ఆదంపూర్‌ను సందర్శించి, మా ధైర్య వైమానిక యోధులు, సైనికులను కలిశాను. ధైర్యం, దృఢ సంకల్పం, నిర్భయతకు చిహ్నాలుగా ఉన్న వ్యక్తులతో ఉండటం చాలా ప్రత్యేకమైన అనుభవం. మన దేశం కోసం మన సాయుధ దళాలు చేసే ప్రతిదానికీ భారత్ ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటుంది” అని రాసుకొచ్చారు.
Earlier this morning, I went to AFS Adampur and met our brave air warriors and soldiers. It was a very special experience to be with those who epitomise courage, determination and fearlessness. India is eternally grateful to our armed forces for everything they do for our nation. pic.twitter.com/RYwfBfTrV2
— Narendra Modi (@narendramodi) May 13, 2025
తాజావార్తలు
-
Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
-
AP Municipal Elections 2026: బెజవాడలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు.. జనసేన, బీజేపీ డిమాండ్లతో ఉత్కంఠ
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
-
EPFO WhatsApp Channel: ఒక్క క్లిక్‌తో PF సమాచారం మీ ఫోన్లోనే.. EPFO అప్డేట్స్ పొందండిలా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!