Pakistan: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, ఆపరేషన్ సింధూర్‌పై పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన రాజకీయ నేతలు తప్పుడు కథనాలను చెబుతూనే వస్తున్నారు. ఈ యుద్ధంలో పాకిస్తాన్ విజయం సాధించిందంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పాడు. మరోవైపు, పాక్ వ్యాప్తంగా విక్టరీ ర్యాలీలు తీస్తున్నారు. ఈ ర్యాలీల్లో మాజీ క్రికెటర్ ఆఫ్రిదితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భారత్ ఓ వైపు క్లియర్‌గా శాటిలైట్ చిత్రాలతో పాకిస్తాన్‌కి జరిగిన నష్టాన్ని చూపిస్తుంటే, మరోవైపు తమకు ఏ కాలేదు, భారత్ తీవ్రంగా నష్టపోయిందని ఒక ఫేక్ ప్రచారాన్ని పాకిస్తాన్ చేస్తోంది.
Read Also: PM Modi: ఎస్-400 ముందు ప్రధాని మోడీ.. పాక్, చైనా చెప్పిందంతా అబద్ధమే అని తేలింది..
ఇదెలా ఉంటే, తాజాగా పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ సోమవారం మాట్లాడుతూ.. భారత్ తమ 11 వైమానిక స్థావరాలపై క్షిపణి దాడి చేసినట్లు అంగీకరించారు. భారతదేశంతో జరిగిన ఘర్షణల్లో పాకిస్తాన్ విమానాలు దెబ్బతిన్నట్లు చెప్పాడు. పాకిస్తాన్ జెట్‌ని భారత్ కూల్చినట్లు స్పష్టమైన ఆధారాలతో వెల్లడించింది. అయితే, ఇషాక్ దార్ మాత్రం తమ జెట్ స్వల్పంగా దెబ్బతిన్నట్లు అంగీకరించారు. భారత పైలట్ ఎవరూ కూడా పాకిస్తాన్ వద్ద లేరని చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్తాన్ లోని చాలా కీలమైన ఎయిర్ బేస్‌లపై భారత్ తీవ్రంగా విరుచుకుపడింది. శనివారం తెల్లవారుజామున రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌తో సహా సర్గోదా, రఫికీ, జకోబాబాద్, స్కర్దు వంటి ఎయిర్ బేస్‌లపై విరుకుపడింది. మొత్తంగా భారత్ పాక్‌కి చెందిన 11 వైమానిక స్థావరాలను దెబ్బతీసింది. ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన తర్వాత 35-40 మంది పాకిస్తాన్ సైనిక సిబ్బంది మరణించినట్లు భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు.