Droupadi murmu: ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల పర్యటన ఖరారైంది. ఈ నెల 19న ఆమె శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా ద్రౌపది ముర్ము శబరిమల పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 18న కొట్టాయం చేరుకుంటానని, 19న శబరిమల సందర్శన చేస్తానని ప్రకటన వెలువడింది. రాష్ట్రపతి భవన్ ఈ కార్యక్రమ వివరాలను ఈ రోజు కేరళ ప్రభుత్వానికి అందించింది. రాష్ట్రపతి…
భారత వాయుసేన చూపించిన ప్రతిభను చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయిందని ప్రధాని మోడీ అన్నారు. మంగళవారం ఉదయం పంజాబ్‌లోని జలంధర్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో వాయుసేనను మోడీ కలిశారు.
S-400: ‘‘ఆపరేషన్ సిందూర్’’ విజయం కావడంలో భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్ నుంచి వస్తున్న డ్రోన్లు, క్షిపణులను గాలిలోనే అడ్డుకుని, సత్తా చాటింది. దీంతో ఇప్పుడు ప్రపంచ దేశాల కన్ను ఎస్-400 సిస్టమ్‌పై పడింది.
PM Modi Warns Pak: ఆదంపుర్‌లో భారత సైనికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా.. ఉగ్రవాదం అంతం చూస్తామంటూ భారత సైన్యం శపథం చేసింది.. మన డ్రోన్లు, క్షిపణులు పాకిస్తాన్ వాళ్లకు నిద్ర లేకుండా చేశాయని అన్నారు.
PM Modi Speech: పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’పై సోమవారం ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రసంగం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదం గురించి మాట్లాడుతూ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ దానికే బలవుతుందని అన్నారు.
Pakistan: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. చివరకు అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్ ‘‘కాల్పుల విరమణ’’కు అంగీకరించింది. ఇదిలా ఉంటే, ఇంత నష్టపోయిన పాకిస్తాన్‌కి బుద్ధి రావడం లేదు. ఆ దేశ రాజకీయ నాయకులు ఇంకా యుద్ధ భాష మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా, పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న ఇషాక్ దార్ మరోసారి భారత్‌ని బెదిరించే ప్రయత్నం చేశారు.
Pakistan: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, ఆపరేషన్ సింధూర్‌పై పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన రాజకీయ నేతలు తప్పుడు కథనాలను చెబుతూనే వస్తున్నారు. ఈ యుద్ధంలో పాకిస్తాన్ విజయం సాధించిందంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పాడు. మరోవైపు, పాక్ వ్యాప్తంగా విక్టరీ ర్యాలీలు తీస్తున్నారు. ఈ ర్యాలీల్లో మాజీ క్రికెటర్ ఆఫ్రిదితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భారత్ ఓ వైపు క్లియర్‌గా శాటిలైట్ చిత్రాలతో పాకిస్తాన్‌కి జరిగిన నష్టాన్ని చూపిస్తుంటే, మరోవైపు తమకు ఏ కాలేదు,…
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు పంజాబ్ అదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని అభినందించారు. పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ సమయంలో ఈ బేస్ కీలకంగా వ్యవహరించింది. అయితే, భారత ప్రధాని ఒక్క చర్యతో పాకిస్తాన్, చైనాలు చెబుతున్నవి అబద్ధాలని రుజువు చేశారు.