ఆకాష్‌టీర్.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. దాయాది దేశం పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్ ప్రయోగించిన అత్యంత పవర్ఫుల్ వెపన్ సిస్టమ్. శత్రు దేశం గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టించింది. అంతేకాకుండా ప్రపంచ నిపుణులనే కలవర పెట్టింది.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్థాన్ భారీ స్థాయిలో నష్టపోయినట్లుగా తాజా గణాంకాలు వెలువడుతున్నాయి. పాకిస్థాన్ వైమానిక దళంలో దాదాపు 20 శాతం మౌలిక సదుపాయాలు ధ్వంసం అయినట్లు సమాచారం.
అనుభవమయితే గానీ తత్వం బోధపడదంటారు పెద్దలు. ఇప్పుడు అచ్చం పాకిస్థాన్ పరిస్థితి అలానే అయింది. భారత్‌పై అనవసరంగా కాలుదువ్విన దాయాది దేశానికి తత్వం బోధపడినట్లుంది. దీంతో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది.
ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై నోరు జారిన మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ మంత్రి కున్వర్ విజయ్ షాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశించింది.
పాకిస్తాన్ కు సహకరించిన టర్కీ, చైనాపై ప్రతీకారం తీర్చుకోవడానికి భారతీయ వ్యాపారులు ఆ రెండు దేశాలకు చెందిన ఉత్పత్తులను స్వచ్ఛందంగా బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించారు. టర్కీ పర్యాటక రంగంతో పాటు దిగుమతి ఉత్పత్తుల బహిష్కరణతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
పాక్‌లోని కరాచీ పోర్టే లక్ష్యంగా ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములను భారీగా మోహరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వాటిని మోహరించడంతో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందన్నారు.
Operation Sindoor: భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును “ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టేట్” (సీడీఎస్) అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు కలిశారు.
BSF Jawan Released: పాకిస్తాన్ రేంజర్లు గత నెల ఫిరోజ్‌పుర్ దగ్గర అదుపులోకి తీసుకొన్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ సాహూను ఎట్టకేలకు రిలీజ్ చేశారు. అతడిని ఈ రోజు ఉదయం పంజాబ్‌లోని అటారీ సరిహద్దు వద్ద భారత దళాలకు అప్పగించినట్లు పీటీఐ పేర్కొంది.
జైషే మహమ్మద్ అధినేత, మసూద్ అజార్ ఫ్యామిలీలోని 14 మంది ఈ దాడుల్లో చనిపోయారు. దీంతో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు. భారత్ దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయాల నష్టపరిహారం అందజేస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మసూద్ అజార్‌కు నష్ట పరిహారం కింద సుమారు రూ. 14 కోట్లు దక్కే ఛాన్స్ ఉంది.
S Jaishankar: భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కు భారీ భద్రత పెంచినట్లు సమాచారం. ఆయన భద్రతా ఏర్పాట్లలో ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ కారును జత చేశారు.