Operation Sindoor: పాకిస్తాన్‌కి అండగా నిలిచిన చైనా, టర్కీ.. సంచలన విషయాలు వెలుగులోకి..
- పాకిస్తాన్‌ని అడ్డుపెట్టుకుని చైనా ప్రాక్సీ వార్..
- భారత్‌పై దాడిలో పాక్‌కి అండగా చైనా, టర్కీ..
- వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు ప్రతీ విషయంలోనూ పాకిస్తాన్‌కి చైనా సపోర్టు ఉందని స్పష్టంగా తెలుస్తోంది. చైనా మద్దతుతో పాటు టర్కీ కూడా భారత్‌పై దాడిలో పరోక్షంగా, ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు తెలుస్తోంది. గత వారం జరిగిన భారత్-పాకిస్తాన్ మధ్య వైమానిక పోరాటంలో చైనా పాత్ర స్పష్టంగా ఉంది. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న భూభాగంలోకి భారత్ ఫైటర్ జెట్‌లు వెళ్లిన సమయంలో, పాకిస్తాన్ చైనీస్ PL-15 ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను ప్రయోగించింది.
అయితే, ఇవి సాధారణ ప్రయోగాలు కావని తేలింది. భారత రాడార్లలో వీటి ప్రయోగం ప్రమాదకరంగా ఆలస్యంగా కనిపించాయని తెలుస్తోంది. దీనికి ఫ్యూజన్ ఆపరేషన్ అని పిలువబడే ఒక కొత్త యుద్ధ వ్యూహంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ ఈ క్షిపణుల నిర్వహణకు ‘‘థర్డ్ పార్టీ’’ ఆపరేటర్లను, బహూశా చైనా నిపుణులు పనిచేసినట్లు తెలుస్తోంది. వీరు రిమోట్‌గా శాటిలైట్స్ ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ & కమాండ్ సిస్టమ్స్ (AEW&CS) ఉపయోగించి క్షిపణులకు ప్రయోగించినట్లు తెలుస్తోంది. వీటి వెనక డ్రాగన్ కంట్రీ వ్యూహాలు ఉన్నాయనేదానిపై క్లారిటీ వచ్చింది. అయితే, భారత వైమానిక రక్షణ వ్యవస్థ చాలా క్షిపణులను అడ్డుకుని, పేల్చేసింది.
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
Read Also: S Jaishankar: కాల్పుల విరమణ, ట్రంప్ కామెంట్స్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు..
పహల్గామ్ దాడిలో కూడా చైనా పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదులు బీడౌ-ఎనేబుల్డ్ నావిగేషన్ పరికరాలను వాడినట్లు దర్యాప్తు చేస్తున్న భారత దళాలు గుర్తించాయి. ఇది చైనా జీపీఎస్. భారత నెట్వర్క్‌లపై ఆధారపడకుండా వీరు చైనీస్ జీపీఎస్ అయిన బీడౌని వాడారు. ఇవి చొరబాటుదారులు సంప్రదాయక టెలికాం గ్రిడ్లపై ఆధాపడకుండా చేస్తుంది. దీని ద్వారా వారిని కనిపెట్టడం కష్టమవుతుంది.
దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలో హువావే మేట్ 60 ప్ర స్మార్ట్‌ఫోన్ లభించింది. ఇది కేవలం ఫోన్ మాత్రమే కాదు, నేరుగా చైనా టియాంటాంగ్-1 శాటిలైట్ నెట్వర్క్‌కి కనెక్ట్ అవుతుంది. బ్లాక్ అవుట్ సమయంలో కూడా కాల్స్ చేయడానికి, మెసేజ్ పంపించడానికి వీలు కల్పిస్తుంది. మరోవైపు, టర్కిష్ డ్రోన్లను కూడా పాక్ భారత్‌పై ప్రయోగించింది. అయితే, భారత్ వీటిని ఆకాశంలోనే దెబ్బకొట్టాయి. వీటిని ఆపరేట్ చేయడానికి ఇద్దరు టర్కీ మిలిటరీ పర్సన్స్ కూడా సాయం చేసినట్లు తెలుస్తోంది. భారత్ దాడిలో వీరిద్దరు మరణించినట్లు సమాచారం.
తాజావార్తలు
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
-
Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!