India Turkey: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌ని సహకరించిన టర్కీకి భారత్, భారత ప్రజలు షాక్‌లు ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే, టర్కీ ఆపిల్స్‌కి అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్, ఇప్పుడు భారత వ్యాపారులు ఆ దేశ ఆపిల్స్‌ని బ్యాన్ చేశారు. మరోవైపు, టర్కీ టూర్లను ప్రజలు రద్దు చేసుకుంటున్నారు. దీనికి తోడు టర్కీ యూనివర్సిటీలతో భారత యూనివర్సిటీలు కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నారు.
Read Also: Turkey: జేఎన్‌యూ తర్వాత, టర్కీతో ఒప్పందాలు రద్దు చేసుకున్న 2 యూనివర్సిటీలు..
ఇదిలా ఉంటే, తాజాగా భారత విమానాశ్రయాల్లో ప్రయాణికుల, కార్గో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను అందించడంలో పాల్గొంటున్న టర్కీష్ కంపెనీ భద్రతా అనుమతుల్ని భారత్ గురువారం రద్దు చేసింది. జాతీయ భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మే 15న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సెలెబి ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యొక్క భద్రతా అనుమతిని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) తక్షణమే రద్దు చేసింది. ఈ సంస్థ నవంబర్ 21, 2022న గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ కేటగిరి కింద అనుమతి పొందింది. ఢిల్లీ, ముంబై, చెన్నైతో సహా 9 ప్రధాన విమానాశ్రయాల్లో కీలకమైన హై-సెక్యూరిటీ కార్యకలాపాలను సెలెబి ఏవియేషన్ నిర్వహిస్తోంది. గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సేవలు, ఎయిర్ సైడ్ ఆపరేషన్ల వంటి కీలక విధులను కంపెనీ నిర్వహిస్తోంది.