Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Supreme Court Slams Mp Minister Vijay Shah Over Comments On Colonel Sofiya Qureshi

Colonel Sofiya Qureshi: ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు.. మధ్యప్రదేశ్‌ మంత్రిపై సుప్రీం సీరియస్‌!

NTV Telugu Twitter
Published Date :May 15, 2025 , 1:13 pm
By Sampath Kumar
  • మంత్రి విజయ్ షాపై సుప్రీంకోర్టు ఆగ్రహం
  • మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు
  • ముందెళ్లి హైకోర్టులో క్షమాపణ చెప్పండి
Colonel Sofiya Qureshi: ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు.. మధ్యప్రదేశ్‌ మంత్రిపై సుప్రీం సీరియస్‌!
  • Follow Us :
  • google news
  • dailyhunt

కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక మంత్రిగా మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అని సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మాసిహ్ లతో కూడిన ధర్మాసనం మండిపడింది. దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంది. ఇలాంటి అంశాల్లో కాస్త సున్నితంగా వ్యవహరించండని, ముందుగా హైకోర్టులో క్షమాపణలు చెప్పండని మంత్రి విజయ్ షాకు ధర్మాసనం సూచించింది.

తాజాగా ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించి వివరాలను కల్నల్ సోఫియా ఖురేషీ మీడియాకు వెల్లడించారు. వివరాలను వెల్లడించిన సోఫియా ఖురేషీని ఉద్దేశిస్తూ మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఉగ్రవాదుల సోదరి’ అని మంత్రి వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగడంతో.. మంత్రి వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా తీసుకుంది. మోవ్ తహసీల్‌లోని మాన్పూర్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. సెక్షన్లు 152, 196(1)(b), 197(1)(c) కింద ఎఫ్ఐఆర్ నమోదయింది.

Also Read: IPL 2025: ఐపీఎల్ 2025లో కొత్త రూల్.. ఆ ప్లేయర్స్ ఈ సీజన్‌ వరకే!

హైకోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విజయ్ షా తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. తన క్లయింట్ క్షమాపణలు చెప్పారని, మీడియా ఆయన ప్రకటనను వక్రీకరించిందని తెలిపారు. అందుకు మీరు హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని సీజేఐ ప్రశ్నించారు. మంత్రి పిటిషన్‌ను శుక్రవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మంత్రిపై దాఖలైన పిటిషన్‌పై స్టే విధించేందుకు నిరాకరించింది. అంతేగాకుండా మంత్రి తీరును తప్పుపట్టింది. ముందెళ్లి క్షమాపణ చెప్పండి అని సూచించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • india
  • Operation Sindoor
  • Pakistan
  • Sophia Qureshi
  • Supreme Court

తాజావార్తలు

  • Donald Trump: ఇండియా-పాక్‌ మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే.. ట్రంప్ నోట అవే కామెంట్స్.. బీజేపీపై కాంగ్రెస్ ఫైర్!

  • Jani Master : జానీ మాస్టర్ కు ఛాన్స్ ఇచ్చిన టాలీవుడ్ స్టార్ హీరో

  • Pawan Kalyan New Look: డిఫరెంట్ లుక్‌లో డిప్యూటీ సీఎం.. పిక్స్ వైరల్!

  • Fairphone Gen 6: 5 ఏళ్ల వారంటీ, మరమ్మతులకు అనుకూలంగా ఉండేలా మొబైల్ లాంచ్..!

  • Shocking : తన మూత్రంతో కళ్లు కడుకున్న మహిళ.. ఇన్ స్టాలో రీల్స్.. పొట్టు పొట్టు తిడుతున్న నెటిజన్లు

ట్రెండింగ్‌

  • HONOR X9C 5G: డిజైన్‌లో క్లాస్, పెర్ఫార్మెన్స్‌లో దమ్మున్న ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైన హానర్..!

  • TECNO Spark Go 2: మొబైల్‌లో సిగ్నల్ లేకున్నా పనిచేసే ఫీచర్‌.. కేవలం రూ. 6,999కే వచ్చేసిన ‘స్పార్క్ గో 2’ మొబైల్..!

  • Girl Friend Scam: ఇదేందయ్యా ఇది.. ఇంటి కోసం ఏకంగా 20 మంది అబ్బాలను ముగ్గులోకి దింపేసిందిగా..!

  • Vitamin D Foods: మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ D ఎలా తోడ్పడుతుందంటే..?

  • BSNL Launches Quantum 5G FWA: 5G విప్లవానికి నాంది.. బిఎస్ఎన్ఎల్ క్వాంటమ్ 5G FWA సేవలు రూ.999 నుంచే ప్రారంభం..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions