ఇండియన్ నౌవీకి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్కు దగ్గరగా వచ్చింది.. మన దేశానికి కేవలం 400 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది.. కానీ, విక్రాంత్ పై పాకిస్తాన్ వైమానిక దళం దాడి చేసి తీవ్రంగా నష్టం కలిగించిందని అబద్దపు మాటలు చెప్పుకొచ్చారు షెహబాజ్ షరీఫ్.
కన్నతల్లిని.. పుట్టిన గడ్డను మరిచిపోకూడదంటారు. ఇక దేశం పట్ల కృతజ్ఞత భావంతో ఉండాలని పెద్దలు చెబుతుంటారు. భారతదేశం విషయానికొస్తే.. ఇక్కడున్న సంస్కృతి, సంప్రదాయాలు, వాతావరణం ఏ దేశంలో ఉండదు.
India Pakistan Conflict: పాకిస్తాన్లోని అన్ని ప్రాంతాలపై దాడి చేసే సామర్థ్యం భారతదేశానికి ఉందని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డి కున్యా పేర్కొన్నారు.
ముంబై ఉగ్ర దాడి ప్రధాన సూత్రధారులలో ఒకరైన తహవూర్ హుస్సేన్ రాణాను అమెరికా భారత్ కు అప్పగించినట్లుగానే.. ఇస్లామాబాద్ లోని కీలక ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, సాజిద్ మీర్, జకీర్ రెహ్మాన్ లఖ్వీలను అప్పగించాలని భారత రాయబారి జేపీ సింగ్ డిమాండ్ చేశారు.
పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మరోసారి గొప్పలు చెప్పుకున్నారు. భారతదేశం ఇజ్రాయెల్ కాదు.. పాకిస్తాన్ పాలస్తీనా కాదని అన్నారు. అలాగే, కాశ్మీర్ అంశంపై కూడా అతడు భారతదేశంపై నిరాధారమైన ఆరోపణలు చేశారు.
Rahul Gandhi: ఆపరేషన్ సింధూర్ వివరాలను బహిర్గతం చేయాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ను అడిగారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేసిన రాహుల్.. అందులో జై శంకర్ మౌనంపై ప్రశ్నలు సంధించారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా.. ఉగ్రవాదులను లేపేయడమే టార్గెట్గా ఆపరేషన్ సిందూర్ ప్రారంభించి పీవోకే, టెర్రరిస్టు శిబిరాలపై విరుచుకుపడింది భారత సైన్యం.. భారతదేశం ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించినప్పుడు తన తల్లిదండ్రులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో ఉన్నారని స్టార్ క్రికెటర్ మోయిన్ అలీ వెల్లడించాడు.
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో గల స్వర్ణ దేవాలయాన్ని టార్గెట్గా చేసుకుని డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడికి ప్రయత్నించింది అని GOC మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి ఈ రోజు మీడియాకు తెలిపారు. ఇక, గోల్డెన్ టెంపుల్ ని లక్ష్యంగా చేసుకున్న అన్ని డ్రోన్లు, క్షిపణులను ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు వెల్లడించారు.
India Pakistan War: ఆపరేషన్ సింధూర్ తర్వాత కాల్పులు జరిపిన పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా అణ్వాయుధ సామర్థ్యం గల షాహీన్ క్షిపణిని ఉపయోగించినట్లు ఇండియన్ ఆర్మీ ధృవీకరించింది. అయితే, ఈ క్షిపణినీ భారతదేశం తన S-400 రక్షణ వ్యవస్థతో అడ్డుకుంది.
దేశ ద్రోహానికి పాల్పడ్డ హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హాత్రాకు సంబంధించిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కస్టడీలో ఉన్న జ్యోతిని అధికారులు విచారిస్తున్నారు.