YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ప్రజా సమస్యలపై గతంలో మాదిరిగానే ఇకపై కూడా మరింత గట్టిగా పోరాడాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ శాసనసభాపక్ష సభ్యులకు పిలుపునిచ్చారు. రానున్న అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలకు పార్టీ సభ్యులంతా పూర్తి సన్నద్ధంగా ఉండాలని సూచించారు. అయితే, వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని జగన్ ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పిస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాల్సి వస్తుందని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి సభలో మాట్లాడే సమయం హక్కుగా లభిస్తుందని తెలిపారు. ఆ హక్కును ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేకపోవడం వల్లే వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని జగన్ వ్యాఖ్యానించారు. దీంతో అసెంబ్లీలో పార్టీ తరఫున చేయగలిగింది పరిమితంగా ఉంటోందని అన్నారు.
ప్రెస్మీట్ల ద్వారా ప్రజలకు సమాధానం
అసెంబ్లీలో ప్రభుత్వం ప్రస్తావించే అంశాలకు ఆధారాలు, సాక్ష్యాలతో తాను ప్రెస్మీట్లు నిర్వహిస్తానని జగన్ తెలిపారు. ప్రతి అంశంలోనూ ప్రజలకు నాణేనికి రెండోవైపు చూపిస్తామని చెప్పారు. ప్రభుత్వం సభలో ఏ అంశాన్ని ప్రస్తావించినా దానికి సంబంధించిన వాస్తవాలను ఆధారాలు, సాక్ష్యాలతో ప్రజల ముందుకు తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రజా సమస్యలపై తమ పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
Also Read
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
మండలిలో బలంతో పోరాడాలి
శాసనమండలిలో వైసీపీకి బలం ఉందని జగన్ పేర్కొన్నారు. ఈ బలాన్ని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించాలని, ప్రజల తరఫున మండలిలో గట్టిగా పోరాడాలని పార్టీ మండలి సభ్యులకు సూచించారు. రాబోయే సమావేశాల్లో సభ్యులంతా పూర్తి సన్నద్ధతతో ఉండాలని, ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని సమర్థంగా ప్రస్తావించాలని జగన్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో అవకాశాలు పరిమితమైనప్పటికీ, మండలి వేదికగా ప్రజల సమస్యలను బలంగా వినిపించాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై వైసీపీ గతంలోనూ పోరాటం చేసిందని, ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో మరింత గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని జగన్ అన్నారు. సభలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడంతో పాటు, బయట కూడా వాస్తవాలను ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు సూచించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి..
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!