Asim Munir: పాకిస్తార్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కి ఆ దేశ ప్రభుత్వం అత్యున్నత సైనిక హోదాతో సత్కరించింది. ఆసిమ్ మునీర్‌కు ‘‘ఫీల్డ్ మార్షల్’’గా ప్రమోషన్ లభించింది. ఇది చాలా అరుదైన సందర్భాల్లో, సాయుధ దళాల్లో అద్భుతంగా ఆపరేషన్స్ నిర్వహించిన వారికి మాత్రమే ఇచ్చే గౌరవ పదోన్నతి. ప్రధాన మంత్రి షహజాబ్ షరీఫ్ నేతృత్వంలోని మంత్రి మండలి ఆర్మీ చీఫ్‌కి పదోన్నతి కల్పించే ప్రతిపాదనను ఆమోదించింది. జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్…
Mallikarjun Kharge: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకుల ప్రాణాలు రక్షించడంతో కేంద్రం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ ‘‘చిన్న యుద్ధం’’ అని అభివర్ణించారు.
Turkey: పాకిస్తాన్ మిత్ర దేశాలైన టర్కీ, అజర్ బైజాన్లకు భారతీయులు షాక్ ఇస్తున్నారు. తమతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో రుచిచూపిస్తున్నారు. ఇప్పటికే, టర్కీకి వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోవైపు, అజర్ బైజాన్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా, ఈ రెండు దేశాలకు సంబంధించిన వీసా అప్లికేషన్స్ 42 శాతం తగ్గినట్లు ఒక నివేదిక తెలిపింది.
Tapan Deka: కేంద్ర ప్రభుత్వం నేడు (మే 20)న ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) డైరెక్టర్ తపన్ కుమార్ డేకా పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ పొడిగింపు 2025 జూన్ 30 తర్వాత ప్రారంభమై 2026 జూన్ వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమలులో ఉంటుంది. తపన్ కుమార్ డేకా 1988 బ్యాచ్‌కు చెందిన హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. 2022 జూలై 1న ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా బాధ్యతలు…
పాకిస్థాన్ తీరును అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు కేంద్రం రాజకీయ పార్టీలతో బృందాలను ఏర్పాటు చేసింది. ఏడు బృందాలను ఆయా దేశాలకు పంపించేందుకు రాజకీయ పార్టీలను పేర్లు అడిగింది. కానీ పేర్లు ఇవ్వకముందే కేంద్రం.. కమిటీ సభ్యుల్ని ఎంపిక చేసింది.
జ్యోతి మల్హోత్రాపై దేశద్రోహం ఆరోపణలతో విచారణను భారత ఇంటెలిజెన్స్ ముమ్మరం చేసింది. ఈ కేసులో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్, ఢిల్లీలోని పాక్ హైకమిషన్ అధికారుల పాత్రను లోతుగా పరిశీలిస్తుంది. ఈ కేసును ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలని ఆలోచనలో కేంద్ర హోం శాఖ ఉంది.
Madhya Pradesh Minister: కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి విజయ్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అతడి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలతో ఆయన పదవీగండం ఎదుర్కుంటున్నట్లు సమాచారం.
పాక్ ప్రయోగించిన లైవ్ షెల్ ఒకటి పూంఛ్‌లో రోడ్డు పక్కన ఉండటాన్ని ఈరోజు (మంగళవారం) గ్రామస్తులు గుర్తించారు. ఆ విషయాన్ని భారత సైనిక అధికారులకు తెలియజేశారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఆ లైవ్ షెల్ ను పేల్చేశాయి.
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డ హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు పేర్కొన్నారు. శనివారం ఆమెను అరెస్ట్ చేయగా.. న్యాయస్థానం ఆమెను ఐదు రోజులు కస్టడీకి ఇచ్చింది. దీంతో అధికారులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు.
బీటీంగ్ రిట్రీట్ సమయంలో పాకిస్తానీ వైపు ఉన్న బోర్డర్ గేట్లు తెరవబోమని భారత అధికారులు చెప్పారు. ఇక పాక్ సిబ్బందితో కరచాలనం చేయడం జరగదని తేల్చి చెప్పారు. కానీ, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రేక్షకులకు అవకాశం కల్పించారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఈ ప్రోగ్రం జరగబోతుంది.