Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ridge Gourd Peel Chutney Recipe: సాధారణంగా బీరకాయతో పప్పు, కూర, వేపుడు లేదా టమాటా కాంబినేషన్లో వంటకాలు చేసుకుంటుంటాం. అయితే బీరకాయ తొక్కను మాత్రం వ్యర్థంగా పారేస్తుంటారు. నిజానికి బీరకాయ తొక్కులో అత్యధికంగా ఫైబర్ (పీచు పదార్థం), పోషకాలు ఉంటాయి. ఈ తొక్కను వేస్ట్ చేయకుండా నువ్వుల కాంబినేషన్‌తో కారంగా, రుచిగా ఉండే కమ్మని రోటి పచ్చడి ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూద్దాం..
కావాల్సిన పదార్థాలు:
* బీరకాయ తొక్కలు: 1 కప్పు (పైన ఉండే ఈనెలు, తొక్క చెక్కి తీసినవి)
* నువ్వుల నూనె: 3 టేబుల్ స్పూన్లు
* పచ్చిమిర్చి: 4
* ఎండుమిర్చి: 4
* శనగపప్పు: 1 స్పూన్
* నువ్వులు: 1-2 స్పూన్లు
* వెల్లుల్లి రెబ్బలు: 5
* టమాటా: 1 (తరిగినది)
* కొత్తిమీర: కొద్దిగా
* చింతపండు: సరిపడా (కొద్దిగా)
* ఉప్పు: రుచికి సరిపడా
* పోపు కోసం: నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు.
Also Read
- Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
- Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
తయారీ విధానం:
ముందుగా బీరకాయ చివరలను కట్ చేసి, పైన ఉండే చెక్కు/తొక్కను కత్తితో సులభంగా వేరుచేసి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో శుద్ధమైన నువ్వుల నూనె వేసి వేడెక్కనివ్వాలి. అందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, శెనగపప్పు, వెల్లుల్లి వేసి దోరగా వేయించాలి. ఇవి వేగిన తర్వాత బీరకాయ తొక్కను వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి. ఆపై నువ్వులు కూడా వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి.
చివరిగా తరిగిన టమాటా, కొత్తిమీర వేసి చిన్న మంటపై టమాటా మెత్తబడే వరకు మగ్గించి, స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. (గమనిక: శెనగపప్పు, నువ్వులు, మిర్చిలను ముందుగా వేయించి పొడి చేసి, ఆ తర్వాత తొక్క-టమాటాలను వేయించి కూడా రుబ్బుకోవచ్చు). ఇప్పుడు మిక్సీ జార్లో (లేదా రోట్లో) వేయించిన మిశ్రమం, రుచికి సరిపడా ఉప్పు, నానబెట్టిన చింతపండు వేసి కచ్చాపచ్చాగా నూరుకోవాలి.
ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు పసుపు వేసి తాళింపు చేయాలి. ఇందులో నూరుకున్న పచ్చడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే కమ్మని బీరకాయ తొక్క పచ్చడి సిద్ధం.
తాజావార్తలు
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
ట్రెండింగ్
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!