PM Modi: పాకిస్తాన్ గడ్డపై మూడుసార్లు దాడి చేశాం.. “సిందూర్” ఇంకా ముగియలేదు..
- పాక్ గడ్డపై మూడుసార్లు దాడి చేశాం..
- ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు..
- బెంగాల్ నుంచి ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్‌ని మరోమారు హెచ్చరించారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ ఇంకా ముగియలేదని గురువారం చెప్పారు. పాకిస్తాన్ గడ్డపై భారత్ మూడుసార్లు దాడి చేసిందని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారందరిపై భారత్ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: CP CV Anand: భారత్‌లోనే ఉండిపోయేందుకు నైజీరియన్స్ కొత్త ప్లాన్.. సీవీ ఆనంద్ వెల్లడి..!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ, భారత మహిళల గౌరవాన్ని అవమానించిన “ఉగ్రవాదుల దుశ్చర్యకు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందని ప్రధాని అన్నారు. ‘‘ఈ బెంగాల్ గడ్డపై నుంచి ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని 140 కోట్ల మంది భారతీయుల తరుపున నేను చెబుతున్నా’’ అని మోడీ అన్నారు. ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పశ్చిమ బెంగాల్ ప్రజల్లో కూడా చాలా కోపం వచ్చిందని, మీలో ఉన్న కోపాన్ని నేను అర్థం చేసుకున్నానని మోడీ అన్నారు. ఉగ్రవాదులు మన సోదరీమణుల సింధూరాన్ని తుడిచిపెట్టే ధైర్యం చేశారని, మన సైన్యానికి వారి సిందూరమే శక్తిని ఇచ్చిందని అన్నారు.
Read Also: India on Trump: “ట్రంప్ మాటల్లో నిజం లేదు”.. పాక్ కాల్పుల విరమణపై భారత్..
భారత్ ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోందని, ఇప్పుడు ఉగ్రవాద దాడి జరిగితే, శత్రువులు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిందే అని భారత్ ప్రపంచానికి చాటి చెప్పిందని మోడీ అన్నారు. పాకిస్తాన్ ఊహించని విధంగా దాడులు చేశాం, వారి ఇళ్లలోకి దూరి మూడుసార్లు దాడి చేశామని అన్నారు. పాక్ సైన్యం, ఉగ్రవాదులు కలిసి సామూహిక హత్యల్ని అతిపెద్ద నైపుణ్యంగా మార్చుకున్నాయని మోడీ విమర్శించారు. యుద్ధం జరిగినప్పుడల్లా వారు ఓటమిని ఎదుర్కుంటారని చెప్పారు. ప్రధాని చెప్పిన మూడు దాడులు 2016లో భారతదేశం చేసిన సర్జికల్ స్ట్రైక్స్, 2019లో బాలకోట్ వైమానిక దాడులు, ఆపరేషన్ సిందూర్‌లుగా పరిగణించబడుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!