మన మహిళల సిందూరాన్ని తుడిచిన వాళ్లను మట్టిలో కలిపేశామని ప్రధాని మోడీ అన్నారు. మోడీ రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బికనీర్‌లో ఏర్పాటు చేసిన సభలో పహల్గామ్ గురించి మాట్లాడుతూ.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు.
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని పదే పదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. గతంలో ఒకసారి ఇలా చెప్పగా.. తాజాగా మరోసారి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో సమావేశం సందర్భంగా అవే వ్యాఖ్యలు చేశారు.
Asim Munir Promotion: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని కేబినెట్ ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్‌ను ఫీల్డ్ మార్షల్ పదవికి ప్రమోట్ చేసింది. నిజానికి ఇది దేశ చరిత్రలో ఇలా చేయడం రెండోసారి మాత్రమే. ఇదివరకు 1959లో మహ్మద్ అయూబ్ ఖాన్‌కు ఈ పదివిని ఇచ్చారు. ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన “ఆపరేషన్ సిందూర్” సైనిక సంఘర్షణలో మునీర్ పాత్రను ఈ ప్రమోషన్‌కు కారణంగా పేర్కొంది పాక్ ప్రభుత్వం. అయితే, ఈ యుద్ధంలో…
భారతదేశంతో ఉద్రిక్తత మధ్య, పాకిస్థాన్ చైనాతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిని పాకిస్థాన్ తన విజయాలలో ఒకటిగా భావిస్తోంది. వాణిజ్యం, వ్యవసాయం, పరిశ్రమలు సహా అనేక కీలక రంగాలలో సహకారాన్ని పెంచుకోవడానికి పాకిస్థాన్ అంగీకరించింది. పాకిస్థాన్ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. మంగళవారం చైనాలో వాంగ్ యితో పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సమావేశం తర్వాత చైనాతో వాణిజ్య ఒప్పందం ప్రకటించారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత కోల్‌కతాలోని ప్రముఖ ప్రదేశాలపై రాత్రిపూట అనేక డ్రోన్ లాంటి వస్తువులు ఎగురుతూ కనిపించాయి. దీంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అప్రమత్త మయ్యాయి. సోమవారం హేస్టింగ్స్ ప్రాంతం, పార్క్ సర్కస్, విద్యాసాగర్ సేతు, మైదాన్ మీదుగా కనీసం 8-10 మానవరహిత డ్రోన్లు ఆకాశంలో చక్కర్లు కొట్టినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. డ్రోన్ లాంటి వస్తువులను మొదట హేస్టింగ్స్ పోలీస్ స్టేషన్ అధికారులు చూశారు.
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న తీవ్ర ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను ఇటీవల హర్యానా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 'ట్రావెల్ విత్ జో' పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న ఆమె నుంచి వ్యక్తిగత డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలోని కొన్ని పేజీలు పాకిస్థాన్ పట్ల ఆమెకున్న అభిమానాన్ని, అక్కడి పర్యటన అనుభవాలను వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు…
Cyber Terror Activities: ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతీయ వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకునే హ్యాకర్ల దాడి చేస్తారనే హెచ్చరికలు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కు వచ్చింది. దీంతో భారత వ్యతిరేక సందేశాలను ఆన్లైన్లో పోస్ట్ చేసినందుకు గుజరాత్ ఏటీఎస్ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం కొనసాగుతుంది. ఇక, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ముఖాన్ని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తో జత చేసి 'వన్ అజెండా' అని రాసిన పోస్టర్‌ను కమలం పార్టీ సమాచార్ శాఖ చీఫ్ అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం పాకిస్తాన్లో హీరోగా మారాడు, ముఖ్యంగా పాక్ మీడియా ఇటీవల రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌ని కోట్ చేస్తూ తెగ సంబరపడిపోతోంది. ‘‘ఆపరేషన్ సిందూర్’’ని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూ సోమవారం ట్వీట్ చేశారు. అంతకుముందు కూడా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వీడియోని ట్వీట్ చేసి, ఆపరేషన్ సిందూర్ గురించి పాక్ ఆర్మీకి ముందే చెప్పారు అంటూ వ్యాఖ్యానించాడు. ఇదే కాకుండా భారత్ ఎన్ని…