Mysore Pak: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకుల్ని, ముఖ్యంగా హిందువుల్ని మతం ఆధారంగా ఉగ్రవాదులు బలిగొన్నారు. ఈ దాడి తర్వాత దేశంలో ఒక్కసారిగా భావోద్వేగాలు ఎగిసిపడ్డాయి. పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలంతా కోరారు. దీనికి అనుగుణంగానే ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా భారత్, పాకిస్తాన్ భూభాగాలతో పాటు పీఓకేలోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద కార్యాలయాలు, వాటి ట్రైనింగ్ సెంటర్లపై దాడులు నిర్వహించింది. 100కి పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది.
India Pakistan: పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాద భాష మారడం లేదు. భారత్‌ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ‘‘ఆపరేషన్ సిందూర్’’ భారత్ చేతిలో చావు దెబ్బలు తిన్నా, పాక్ ఎయిర్ ఫోర్స్ ఆస్తుల్లో 20 శాతాన్ని కోల్పోయినా ఆ దేశానికి బుద్ధి రావడం లేదు. ఉగ్రవాదులు మాట్లాడే భాషలోనే అక్కడి ఆర్మీ అధికారులు మాట్లాడుతున్నారు.
ప్రధాని మోడీ బలమైన సంకల్పం.. నిఘా సంస్థల కచ్చితమైన సమాచారం.. సాయుధ దళాల అద్భుత ప్రదర్శన వల్లే ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు.
ఆపరేషన్ సిందూర్ విజయంపై ప్రధాని మోడీని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అభినందించారు. శుక్రవారం రైజింగ్ నార్త్‌స్టెస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ముఖేష్ అంబానీ తన ప్రసంగాన్ని ఆపరేషన్ సిందూర్ విజయం సాధించినందుకు మోడీకి వందనం చేస్తూ ప్రారంభించారు.
Pakistan: పాకిస్తాన్ చిరకాల మిత్రులు చైనా మరోసారి భారత్‌కి వ్యతిరేకంగా కుట్రలకు తెర తీసింది. ‘‘ఆపరేషన్ సిందూర్’’ తర్వాత చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ ఆర్మీకి శాటిలైట్ సపోర్ట్ అందించేందు డ్రాగన్ కంట్రీ ముందుకు వచ్చింది. దీనిపై ఇరు దేశాల మధ్య గత వారం చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. చైనా తన బీడౌ ఉపగ్రహ వ్యవస్థలను పాకిస్తాన్ సైన్యం యాక్సెస్ చేయడానికి మే 16న చైనా, పాకిస్తాన్ సైనిక అధికారుల మధ్య వ్యూహాత్మక సమావేశం జరిగింది.
Trump: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తాను మధ్యవర్తిత్వం చేసి, అణు యుద్ధాన్ని నివారించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. అయితే, పాకిస్తాన్ కాల్పుల విరమణను కోరడంతోనే తాము అంగీకరించామని భారత్ స్పష్టం చేసింది. తాజాగా, విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో అమెరికా ప్రమేయం లేదని చెప్పారు.
India On Turkey: పాకిస్తాన్‌కి ఇటీవల కాలంలో టర్కీ మద్దతు ఇవ్వడంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. టర్కీకి బలమైన సందేశాన్ని పంపింది. పాకిస్తాన్ నుంచి వస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని పరిష్కరించడానికి టర్కీ పనిచేయాలని భారత్ ఆశిస్తున్నట్లు ప్రభుత్వం గురువారం తెలిపింది.
Agniveers: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ కేవలం 5 రోజుల్లోనే కాళ్ల బేరానికి వచ్చింది. పాక్ వైమానిక ఆస్తుల్లో 20 శాతాన్ని కోల్పోయింది. మొత్తం 11 పాక్ ఎయిర్‌బేస్‌లను భారత్ ధ్వంసం చేసింది. దీనికి తోడు పాకిస్తాన్, పీఓకే లోని లష్కరే తోయిబా, జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద కార్యాలయాలు, ట్రైనింగ్ కేంద్రాలపై భారత్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదుల హతమయ్యారు.
PM Modi: పాకిస్తాన్‌పై భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ గురువారం రాజస్థాన్ బహిరంగ సభలో పాల్గొన్నారు. బికనీర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాకిస్తా్న్‌పై మోడీ విరుచుకుపడ్డారు. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై జరిపిన దాడుల్ని మోడీ హైలెట్ చేశారు. పాకిస్తాన్‌లోని రహీం యార్ ఖాన్ ఎయిర్‌బేస్‌కు జరిగిన విధ్వంసం గురించి మాట్లాడుతూ.. ఆ ఎయిర్‌బేస్ ‘‘ఐసీయూ’’లో ఉందని అన్నారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ..‘‘ నేను ఢిల్లీ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు,…
S Jaishankar: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ ఉగ్రవాదులే టార్గెట్‌గా ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. ఆ తర్వాత పాక్ జరిపిన వైమానిక దాడుల్ని తిప్పికొట్టింది. భారత దాడుల్లో పాకిస్తాన్ సైన్యానికి చెందిన 11 కీలకమైన ఎయిర్ బేస్‌లు ధ్వంసమయ్యాయి. ఈ పరిణామాల తర్వాత భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ డచ్ మీడియాకు బుధవారం ఇంటర్వ్యూ ఇచ్చారు. దీంట్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునిర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆసిమ్…