PakIstan: పాకిస్తాన్ తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆదివారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. తాజా వరల్డ్ థ్రెట్ అసెస్మెంట్ నివేదిక ప్రకారం, పాకిస్తాన్ తన అణ్వాయుధాలను చైనా నుండి సైనిక, ఆర్థిక మద్దతుతో ఆధునీకరిస్తోందని వెల్లడించింది. భారతదేశాన్ని అస్తిత్వ ముప్పుగా భావిస్తోందని చెప్పింది. పాకిస్తాన్ సైన్యం ప్రాధాన్యతలో ప్రాంతీయ పొరుగు దేశాలతో సరిహద్దు ఘర్షణలు, అణ్వాయుధాల నిరంతర ఆధునీకరణ వంటి లక్ష్యాలు ఉండొచ్చని నివేదిక తెలిపింది.
ఆపరేషన్ సింధూర్ ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందని తెలిపారు. ఉగ్రవాదానికి ఈరోజు దేశం మొత్తం వ్యతిరేకంగా నిలిచింది అన్నారు. ఆపరేషన్ సింధూర్ టైంలో భారత సైన్యం ప్రదర్శించిన పరాక్రమం ప్రతి భారతీయుడిని గర్వించేలా చేసిందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.
Pakistani Spy: భారతదేశానికి సంబంధించిన సున్నిత సమాచారాన్ని దాయాది పాకిస్తాన్‌కు చేరవేస్తున్న వారిని గుర్తించి అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. తాజాగా పాక్‌కు గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో రాజస్థాన్‌లో మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
BJP MP: పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత పలువురు రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా, బీజేపీ రాజ్యసభ ఎంపీ రామ్ చందర్ జాంగ్రా పహల్గామ్ ఉగ్రదాడిపై చేసిన కామెంట్స్‌పై వివాదం చెలరేగింది. ఉగ్రవాద దాడి సమయంలో మహిళలు తమ భర్తల ప్రాణాల కోసం వేడుకునే బదులుగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడి ఉండాల్సిందని ఆయన అనడం రాజకీయ దుమారాన్ని రేపింది.
Pakistan: భారత్ చేతిలో చావు దెబ్బతిన్న తర్వాత పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన మిత్రదేశాల పర్యటనకు వెళ్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్, పీఓకేలోని 09 ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు మరణించారు. ఆ తర్వాత పాక్ సైన్యం, భారత్‌పై దాడి చేయడానికి యత్నించింది. దీనికి బదులుగా పాక్ లోని 11 వైమానిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసి గట్టి బుద్ధి చెప్పింది. Read Also:…
సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక వీడియోలను పోస్ట్ చేసినందుకు ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అరెస్టు చేసిన యువకులను ఇర్ఫాన్, వాజిద్ షాగా గుర్తించినట్లు చైన్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. ఓ జాతీయ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇది మాత్రమే కాదు.. నాలుకలు కోసేస్తామంటూ బెదిరించారు.
Operation Sindoor: భారత్ కొట్టిన దెబ్బకు ఇప్పుడు పాకిస్తాన్‌కి నొప్పి తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో భారత్ పాక్ ఉగ్రవాద స్థావరాలతో పాటు దాని మిలిటరీ స్థావరాలపై దాడులు చేసింది. ముఖ్యంగా, పాక్ వైమానిక దళానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఇటీవల భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల సందర్భంగా పూంఛ్ ప్రాంతంలో ఆస్తులు కోల్పోయిన బాధిత కుటుంబాలను రాహుల్‌గాంధీ పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
S Jaishankar: భారత్ ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించదని, న్యూఢిల్లీ ఎప్పటికీ అణ్వాయుధ బెదిరింపులకు లొంగదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం అన్నారు. జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ వాడేఫుత్‌తో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత, పాక్ మధ్య వ్యవహారం ద్వైపాక్షికం అని, ఈ విషయంలో ఎలాంటి గందరగోళం ఉండకూడదని అన్నారు.
Airspace ban: పాకిస్తాన్ విమానాలకు భారత గగనతల నిషేధాన్ని కేంద్రం జూన్ 23 వరకు, అంటే మరో నెల పాటు పొడగించింది. పాకిస్తాన్ విమానయాన సంస్థలు లీజు తీసుకున్న, వాటి యాజమాన్యం కింద నడపబడుతున్న విమానాలతో పాటు సైనిక విమానాలు భారత ఎయిర్ స్పేస్‌లోకి ప్రవేశించకుండా బ్యాన్ విధించారు.