Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’ భారత సైనిక పరాక్రమానికి నిదర్శనమని అమెరికా సైనిక నిపుణుడు జాన్ స్పెన్సర్ కొనియాడారు. భారత్ ఈ ఆపరేషన్‌లో పూర్తి ఆధిక్యత ప్రదర్శించి, విజయం సాధించిందని చెప్పారు. మోడరన్ వార్ ఇన్స్టిట్యూట్‌లోని అర్బన్ వార్‌ఫేర్ స్టడీస్ చైర్ అండ్ అర్బన్ వార్‌ఫేర్ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాన్ స్పెన్సర్ భారత విజయం గురించి ఓ వ్యాసాన్ని పోస్ట్ చేశారు. “ఆపరేషన్ సిందూర్: ఆధునిక యుద్ధంలో నిర్ణయాత్మక విజయం” అనే శీర్షికతో ఎక్స్‌లో కీలక విషయాలు వెల్లడించారు. భారత్, పాకిస్తాన్ మధ్య శత్రుత్వం నిలిపేసినప్పటికీ, ఇది పూర్తిగా ముగియలేదని స్పెన్సర్ చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ కేవలం సింబాలిక్‌గా మాత్రమే చూడలేం అని, ఇది నిర్ణయాత్మకమైందని అన్నారు. సైనిక విజయం తర్వాత విరమణ కేవలం విరామం కాదని, ఇది వ్యూహాత్మక విరామం అని ఆయన పేర్కొన్నారు. గత దాడుల మాదిరిగా కాకుండా భారత్ కొత్త తరహా దాడి చేసినట్లు చెప్పారు. భారత్ మధ్యవర్తిత్వం కోసం ఏ అంతర్జాతీయ ఫోరమ్‌కు విజ్ఞప్తి చేయలేదు లేదా దౌత్యపరమైన సరిహద్దును జారీ చేయలేదు, కానీ “యుద్ధ విమానాలను” ప్రయోగించిందని స్పెన్సర్ పేర్కొన్నాడు.
Read Also: SV Mohan Reddy: పప్పులు, బెల్లంలా దేవాలయాల భూములను పంచుకుంటే ఊరుకోం.. మాజీ ఎమ్మెల్యే సీరియస్..!
భారత్ పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే ఉగ్రవాద చర్యల్ని యుద్ధ చర్యలుగా పరిగణిస్తామని చెప్పింది. ‘‘భారత్ ఎలాంటి అణు బ్లాక్‌మెయిల్‌లను సహించదు. అణు బ్లాక్‌మెయిల్ ముసుగులో పెట్రేగిపోతున్న ఉగ్రవాదుల స్థావరాలపై భారతదేశం ఖచ్చితంగా , నిర్ణయాత్మకంగా దాడి చేస్తుంది’’ అని నరేంద్ర మోడీ కొత్త సిద్ధాంతాన్ని స్పెన్సర్ ప్రస్తావించారు. ఉగ్రవాదం-చర్చలు కలిసి సాగవు, నీరు-రక్తం కలిసి ప్రవహించవు అని ప్రధాని మోడీ కొత్త వ్యూహాత్మక సిద్ధాంతాన్ని ఆవిష్కరించారని స్పెన్సర్ అంగీకరించారు.
భారత్ యుద్ధం చేయాల్సి ఉండేదని వాదించే వారి గురించి స్పెన్సర్ తన వ్యాసంలో .. ‘‘భారత్ ప్రతీకారం కోసం పోరాడలేదు. అది నిరోధకత కోసం పోరాడుతోంది, భారత్ అదే పనిచేసింది’’ అని రాశారు. వ్యూహాత్మక దిశ లేకుండా దీర్ఘకాలికంగా సాకే యుద్ధాల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ ప్రత్యేకంగా నిలుస్తుందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో భారత్ తన లక్ష్యాలను నిర్దేశించుకుంది, వాటిని సాధించింది, ఖచ్చితమైన నిర్ణయాత్మకమై దాడి చేసిందని, ఆధునిక యుద్ధంలో ఈ రకమైన స్పష్టత చాలా అరుదు అని స్పెన్సర్ అన్నారు.
ప్రధాని మోడీ సిద్ధాంతం, భారత్ లో అభివృద్ధి చెందుతున్న దేశీయ రక్షణ పరిశ్రమ, సైన్యం నైపుణ్యం కలిపి, ఒక దేశం ఇకపై చివరి యుద్ధానికి కాకుండా దాని తదుపరి యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు సూచించిందని స్పెన్సర్ చెప్పారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, మళ్లీ రెచ్చగొడితే భారత్ మళ్లీ దాడి చేస్తుందని, ఇది భారత్‌కి వ్యూహాత్మక విజయమని చెప్పారు.
— John Spencer (@SpencerGuard) May 14, 2025