Salman Khurshid: ‘‘ప్రధాన సమస్య ముగిసింది’’.. ఆర్టికల్ 370 రద్దును ప్రశంసించిన కాంగ్రెస్ నేత..
- ఆర్టికల్ 370 రద్దుతో ప్రధాన సమస్య ముగిసింది..
- ఇండోనేషియాలో ప్రశంసించిన కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khurshid: కాంగ్రెస్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని ప్రశంసించారు. జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్, భారతదేశంలోని మిగతా ప్రాంతాల నుంచి వేరుగా ఉందనే భావనను చాలా కాలం సృష్టించిందని, ప్రభుత్వం ఈ ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో ఈ భావన ముగిసిందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత, పలు దేశాలకు భారత దౌత్య బృందాలు వెళ్లాయి. పాక్ ఉగ్రవాదం గురించి ఆయా దేశాలకు ఈ బృందాలు వివరించనున్నాయి. ఇండోనేషియాకు వెళ్లిన బృందంలో సల్మాన్ ఖుర్షీద్ కూడా ఉన్నారు. ఇండోనేషియా ప్రతినిధి బృందంతో సంభాషిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Liquor Case: లిక్కర్ కేసులో సిట్ కస్టడీకి నలుగురు నిందితులు.. విచారణకు కోర్టు అనుమతి..!
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ఆర్టికల్ 370 రద్దు తర్వాత, జమ్మూ కాశ్మీర్‌లో అభివృద్ధి, ఇటీవల జరిగిన ఎన్నికల్ని ఆయన ప్రస్తావించారు. జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికల్లో 65 శాతం ఓటర్ల భాగస్వామ్యం ఉందని, ఇది కాశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు దోహదపడిందని చెప్పారు. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని బీజేపీ నేతృత్వంలోని ప్రధాని మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. దీనిని కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ కొనియాడటం గమనార్హం. ఇటీవల, ప్రధాని మోడీ నిర్ణయాలను, ఆపరేషన్ సిందూర్‌ని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రశంసించడం హస్తం పార్టీలో సంచలనంగా మారింది. ఇప్పుడు ఆర్టికల్ 370ని ఖుర్షీద్ ప్రస్తావిచడంపై కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!